News
News
వీడియోలు ఆటలు
X

Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ అన్నీ అనుకూల ఫలితాలే!

ఉగాది పంచాంగం: ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ వ్యయాలు, అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం

FOLLOW US: 
Share:

Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 మకర రాశి ఫలితాలు
మకర రాశి
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 6

శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో మకర రాశివారికి బాగానే ఉంది. గురుడు, రాహువు బలీయంగా ఉన్నందున.. ముఖ్యంగా సంపత్తుకి కారకుడైన గురుబలం బావున్నందున ఆదాయానికి లోటుంటదు. గౌరవ మర్యాదలు పొందుతారు. ఏలినాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం అంతగా ఉండదు. రాహువు ప్రభావం, ఏలినాటి శని ప్రభావం ఉన్నందున కొన్ని సూతకాలు తప్పవు..ఆప్తబంధువులు మరణం మిమ్మల్ని బాధిస్తుంది. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ  మకర రాశివారికి ఎలాఉందంటే.. 

 • ఈ ఏడాది గురుబలం వల్ల సాంఘికంగా, ఆర్థికంగా లాభపడతారు
 • పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి
 • స్థిరాస్తిని వృద్ధి చేస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు
 • దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు
 • శత్రువుల సంఖ్య తగ్గుతుంది కానీ వివాదాలకు దూరంగా ఉండడం మంచిది
 • కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్న వారు విజయం సాధిస్తారు
 • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది
 • నూతన వాహనం కొనుగోలు చేస్తారు
 • ఈ రాశి అవివాహితులకు పెళ్లిజరుగుతుంది

Also Read: ఉత్సాహం, ధైర్యం, ఆదాయం, అభివృద్ధి - ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మామూలుగా లేదు!

ఉద్యోగులకు

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మకర రాశి ఉద్యోగులకు అనుకూల సమయం. శ్రమకు తగిన గుర్తింపు, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఎలినాటి శని ఉన్నప్పటికీ దాని ప్రభావం తక్కువగా ఉండడం వల్ల అధికారులనుంచి వేధింపులు ఉండవు. ప్రమోషన్ తో కూడిన బదిలీలు ఉంటాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం తప్పదు. ప్రైవేట్ ఉద్యోగులు ఉద్యోగం మారాలి అనుకంటే మంచి సమయం

విద్యార్థులకు

ఈ రాశి విద్యార్థులకు గురుబలం బావుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర విషయాలపై ఆసక్తి తగ్గించుకుని చదువుపై శ్రద్ధ పెడతారు. పోటీ పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు సాధిస్తారు

క్రీడాకారులకు కూడా శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బావుంటుంది

వ్యాపారులకు

శోభకృత్ నామసంవత్సరంలో వ్యాపారులకు ఆశించిన లాభాలొస్తాయి. హోల్ సేల్, రీటైల్ రంగంలో ఉన్నవారి ఆదాయం బావుంటుంది. సరుకులు నిల్వచేసే వ్యాపారులు ధరలు పెరగడంతో అనుకున్నదానికన్నా ఎక్కువ లాభాలొస్తాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కలిసొస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా వెనకేస్తారు

Also Read: హమ్మయ్య ఈ ఉగాదితో ఈ రాశివారికి 'శని' వదిలిపోయింది, ఇక మంచిరోజులు మొదలైనట్టే!

కళారంగం వారికి

కళారంగంలో ఉన్నవారికి ఈ ఏడాది మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. అవార్డులు , రివార్డులు పొందుతారు.

రాజకీయ నాయకులకు

మకర రాశి రాజకీయనాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం బాగా కలిసొస్తుంది. గతేడాదికన్నా అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. ప్రజల్లో ఫాలోయింగ్ పెరుగుతుంది..అధిష్టానం నుంచి గుర్తింపు లభిస్తుంది. శత్రువులు కూడా మీకు సహాయపడతారు

వ్యవసాయదారులు

ఈ రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. రెండు పంటలు లాభిస్తాయి. అనుకున్నదానికన్నా ఎక్కువ ఆదాయం లభిస్తుంది. వాణిజ్య పంటలు, ప్రౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం...

Published at : 20 Mar 2023 06:33 AM (IST) Tags: Sagittarius Sobhakritu Nama Samvatsaram rasi phalau 2023 sri Sobhakritu nama samvatsara ugadi rasi phalalu 2023-2024 ugadi panchagam Capricorn astrology predictions 2023 Makara Rashi Yearly horoscope in Telugu Makara Rashi 2023

సంబంధిత కథనాలు

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !