ఉగాది పంచాంగం 2023-2024
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మేష రాశి ఫలితాలు



శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో (2023-2024) మేషరాశివారికి... భాగ్య, వ్యయాధిపతి అయిన గురువు జన్మరాశిలో సంచరిస్తున్నందున గతంలో కన్నా శుభఫలితాలనే అందించనున్నాడు.



శని పదకొండో స్థానంలో ఉండడం కొంత ఉపశనమం. జన్మంలో రాహుకేతువుల ప్రభావం వల్ల తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. పదకొండో స్థానంలో ఉన్న శనివల్ల ఎలాంటి చిక్కు సమస్యలను అయినా పరిష్కరించుకోగలుగుతారు



ఈ ఏడాది మేష రాశివారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, స్థిరాస్థిని వృద్ధి చేస్తారు
సంఘంలో గౌరవం, పలుకుబడి పెరుగుతుంది



జన్మంలో రాహువు సంచారం వల్ల కొన్ని అశుభవార్తలు వినాల్సి వస్తుంది, ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతాయి, మానసికంగా కుంగిపోతారు, కొన్నిసార్లు చేయని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది



ఉద్యోగులకు ఈ ఏడాది మిశ్రమ ఫలితాలున్నాయి.స్థానచలనం, దూరప్రాంతాలకు బదిలీలు తప్పవు, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది.. పై అధికారులతో మాటలు పడడం తప్పదు. అయితే శని బలం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది, నిరుద్యోగులకు ఈ ఏడాది కూడా నిరాశ తప్పదు



గృహనిర్మాణాలు పూర్తిచేస్తారు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు, సంతానం కారణంగా ఆనందంగా ఉంటారు



ఈ ఏడాది ఈ రాశి రాజకీయనాయకులకు శనిబలం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రజల్లో - అధిష్టానం నుంచి మంచి పేరు సంపాదించుకుంటారు. ఈ రాశి వారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు



కళాకారులకు ఈ ఏడాది అంత అనుకూలంగా లేదు. టీవీ రంగంలో ఉన్న వారికి ఫలితాలు అంతంతమాత్రమే



వ్యాపారుల విషయానికొస్తే.. హోల్ సేల్, రిటైల్ రంగంలో ఉన్నవారికి బావుంటుంది. ఫైనాన్స్, ఆభరణాల వ్యాపారం చేసేవారికి నష్టం తప్పదు. ఇనుము, ఇసుక, ఇటుక, సిమెంట్ వ్యాపారం చేసేవారికి లభాలొస్తాయి



విద్యార్థులకు గురుబలం లేకపోవడం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గుతుంది, ఇతర వ్యాపకాలపై మనసు మళ్లుతుంది. ఇంజినీరింగ్, మెడికల్ సహా పలు ఎంట్రన్స్ టెస్టులు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందలేరు



వ్యవసాయదారులకు కూడా ఓ పంట లాభిస్తుంది..రెండో పంట నష్టాన్ని మిగులుస్తుంది. ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ అవసరం, ఏ చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయరాదు



జూన్ 17 నుంచి శని వక్రం వల్ల సుమారు నాలుగు నెలల పాటు ఇబ్బందులు తప్పవు...అధిక కృషి చేసినా సాధారణ ఫలితాలు మాత్రమే పొందుతారు. నవంబరు ప్రారంభం నుంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి
Images Credit: Pixabay


Thanks for Reading. UP NEXT

ఈ రోజు ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు

View next story