చాణక్య నీతి: నేనే తోపు అనుకునేవారికి చాణక్యుడు చెప్పింది ఇదే!



దానే తవసి శౌర్యే చ విజ్నానే వినయే నయే
విన్మయో న హి కర్తవ్యో బహురత్నా వసున్ధరా



ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈశ్లోకం ఆంతర్యం ఏంటంటే..మనిషిలో ఎప్పుడూ అహంకారం ఉండకూడదు



దానగుణం, తపస్సు, శూరత్వం, పాండిత్యం, సుశీలత, నీతి నైపుణ్యత చూసుకుని మురిసిపోరాదు



ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకరిని మించిన దానపరుడు మరొకరుంటారని తెలుసుకోవాలి



సేరు ( ఒక కొలమానం) కలిగినవాడు ఒకడుతుంటే సనాసేరు ఉన్నవాడు ఇంకొకడు ఉంటాడన్న సామెత ఇలా పుట్టినదే



ఏ విషయంలో అయినా నేను మాత్రమే గొప్పవాడిని అనే అహంకారం ప్రదర్శిస్తే అది వారి మూర్ఖత్వమే అవుతుంది



ఇలాంటి అహంకారమే దుఃఖానికి కారణం అవుతుందని చెప్పాడు చాణక్యుడు



Images Credit: Pixabay