చాణక్య నీతి: విద్యార్థులు చేయకూడని ఎనిమిది పనులు



కామం క్రోధం తధా లోభం స్వాద శృంగారకౌతుకమ్
అతినిద్రాఅతిసేవా వ విద్యార్థీ హాష్ట వర్ణయేత్



ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకం అర్థం ఏంటంటే..కామము, క్రోధము, లోభము, తీపి, శృంగారము, కౌతుకత్వము, ఎక్కువసేపు నిద్రించుట, అమితంగా సేవచేయుట.. విద్యార్థులు ఈ 8 విడిచిపెట్టాలి



చదువుపై శ్రద్ధ పెరగాలన్నా, చదివింది బుర్రకు ఎక్కాలన్నా ఈ 8 పనులు చేయకూడదని చెప్పాడు చాణక్యుడు



అహంకారం, అధికకోపం విద్యార్థిలో ఉంటే విచక్షణ కోల్పోయేలా చేస్తుంది



ప్రేమలో మునిగితేలడం, లైంగిక విషయాలపై ఆసక్తి ఉంటే చదువు అటకెక్కిపోతుంది



పిసినారితనం, తిండిపై ఎక్కువ మక్కువ ఉన్నా చదువుపై ఆసక్తి తగ్గుతుంది



ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల జ్యేష్టా దేవి ఆవహించి బుద్ధి మందగించేలా చేస్తుంది



చేయాల్సిన పనులు కాకుండా అధికంగా పనులు తలకెక్కించుకుంటే చదువు అయినట్టే



అందుకే ఈ విషయాలకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది..మంచి ఫలితాలు సాధిస్తారని వివరించాడు చాణక్యుడు



Images Credit: Pixabay