Ugadi Panchangam in Telugu (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి మహోన్నత యోగం, ఇంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు!
ఉగాది పంచాంగం: ఉగాది రాగానే కొత్త ఏడాదిలో ఆదాయ వ్యయాలు, అనుకూల-ప్రతికూలతలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఏ రాశివారికి ఎలా ఉందో ముందుగానే అందిస్తోంది మీ ఏబీపీ దేశం
Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 ధనస్సు రాశి ఫలితాలు
ధనస్సు రాశి
మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం : 8 వ్యయం :11 రాజ్యపూజ్యం : 6 అవమానం : 3
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ధనస్సు రాశివారికి మహోన్నత యోగం ఉంది. దేవతల గురువు బృహస్పతి, శని ఇద్దరూ శుభ స్థానంలోనే ఉన్నారు. ఈ ఫలితంగా గతంలో పడిన బాధలు, ఇబ్బందులు, చికాకులు తొలగిపోయి సంపూర్ణంగా శుభ ఫలితాలు పొందుతారు. ద్వితీయార్థంలో మాత్రం అర్దష్టమ రాహువు వలన మానసిక ఆందోళనలుంటాయి. కొందరికో అభిప్రాయ బేధాలుంటాయి.. 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ ధనస్సు రాశివారికి ఎలాఉందంటే..
- ఈ రాశివారికి ఏల్నాటి శని పూర్తిగా తొలగిపోవడంతో గతంలో పడిన ఇబ్బందుల నుంచి పూర్తి ఉపశమనం ఉంటుంది
- మీరున్నరంగాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటారు..అధికారుల అనుగ్రహం సదా మీపై ఉంటుంది
- మానసిక ధైర్యం పెరుగుతుంది, ఎంతటివారినినా మీవైపు తిప్పుకోగల నేర్పు మీ సొంతం
- ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి..పెళ్లి దిశగా అడుగేయాలి అనుకుంటే ఈ ఏడాది మంచి సమయం
- విందు,వినోదాల్లో ఉత్సాహంగా ఉంటారు
- నూతనంగా ప్రారంభించే పనులు మీకు కలిసొస్తాయి..గతంలో ఉన్న శత్రువులు మిత్రులుగా మారుతారు
- విలువైన ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు.. ఖర్చులు భారీగా ఉంటాయి
Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!
ఉద్యోగులకు
ధనస్సు రాశి ఉద్యోగులకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నందున మీ మాటకు తిరుగులేదు. ఎంతటి అధికారులైనా మీ మాట మీరలేనంత పవర్ మీ సొంతం. ప్రమోషన్ తో కూడిన బదిలీలు, ఇంక్రిమెంట్లు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలసిసొస్తాయి
వ్యాపారులకు
వ్యాపారులకు ఈ ఏడాది అద్భుతమైన కాలం. అన్ని రకాల వ్యాపారులకు కలిసొస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించేందుకు, నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొస్తుంది.
విద్యార్థులకు
ఈ రాశి విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలను వదిలిపెట్టి చదువుపై శ్రద్ధ పెడతారు. పోటీ పరీక్షలలో మంచి ర్యాంకులు సాధిస్తారు.
క్రీడాకారులకు మంచి యోగకాలమే
వ్యవసాయదారులు
ఈ రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు లాభిస్తాయి. కౌలుదార్లకు కూడా శుభసమయం.చేపలు, రొయ్యల చెరువులు నిర్వహించేవారు లాభాలు పొందుతారు. పౌల్ట్రీ రంగం బావుంటుంది. వాణిజ్య పంటలు, కాయగూరలు పండించేవారికి మంచి లాభాలొస్తాయి.
రాజకీయ నాయకులకు
ధనస్సు రాశి రాజకీయ నాయకులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం సువర్ణావకాశం. ప్రజాభిమానం విశేషంగా పొందుతారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. అధిష్టాన పరంగా మంచి పేరు సంపాదించుకుంటారు. ఎన్నికల్లో పోటీచేస్తే విజయం మీదే అవుతుంది. శత్రువుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి
కళారంగం వారికి
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కళారంగం వారికి అనుకూల ఫలితాలున్నాయి. ప్రజాకర్షణ పెరుగుతుంది. టీవీ రంగంవారికి మంచి ఫలితాలున్నాయి.
- మూల నక్షత్రం వారికి అధికార వృద్ధి
- పూర్వాషాడ నక్షత్రం వారికి సంపద వృద్ధి, విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి
- ధనస్సు రాశికి చెందిన ఉత్తరాషాడ మొదటి పాదం వారికి ఉన్నత ఉద్యోగం, సంతాన యోగం
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.