అన్వేషించండి

Today Horoscope In Telugu - జులై 12 రాశి ఫలాలు: నిరుద్యోగులు శుభవార్తలు వింటారు, ఆ రాశివారు అప్పులు చెయ్యాల్సిందే

Horoscope Prediction 12th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for july 12 th 2024: 

మేషం

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.

వృషభం

ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. మిత్రులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు వ్యవహారాలు వాయిదా పడతాయి. పిల్లల విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

మిథునం

ఈ రాశి వారికి ఈరోజు మిత్రుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు.

కర్కాటకం

ఈ రాశి వారికి ఈరోజు ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం

ఈ రాశి వారికి ఈరోజు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.

కన్య

ఈరోజు ఈ రాశి వారికి అప్పుల బాధలు ఎక్కువై కొత్తగా రుణాలు చేయడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

తుల

ఈ రాశి వారికి ఈరోజు సొసైటీలో విపరీతమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈరోజు దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలసివస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

ధనస్సు

ఈ రాశివారికి ఈరోజు సోదరులతో స్థిరాస్థి వివాదాలు ఏర్పడతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొనటం మంచిది.

మకరం

ఈ రాశి వారికి ఈరోజు వ్యాపార వ్యవహారాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

కుంభం

ఈ రాశి వారు ఈరోజు నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. సహ ఉద్యోగులతో సఖ్యత కలుగుతుంది.

మీనం

ఈరాశి వారికి ఈరోజు వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారంలో ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు గడిస్తారు. మిత్రులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఇంట్లో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు.

Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ALSO READ: లక్ష్మీనారాయణ యోగం..ఈ 4 రాశులవారికి రాజయోగం , ధనప్రాప్తి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Embed widget