![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Lakshmi Narayana Yoga: లక్ష్మీనారాయణ యోగం..ఈ 4 రాశులవారికి రాజయోగం , ధనప్రాప్తి!
Lakshmi Narayana Yoga: ఒకేరాశిలో బుధుడు - శుక్రుడు సంచరించే సమయంలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని రాశులవారికి శుభఫలితాలనే ఇస్తుంది.. కొన్ని రాశులవారికి రాజయోగాన్నిస్తుంది.
![Lakshmi Narayana Yoga: లక్ష్మీనారాయణ యోగం..ఈ 4 రాశులవారికి రాజయోగం , ధనప్రాప్తి! Lakshmi Narayana Yoga in July these zodiac signs get more economic benifuts What is Lakshmi narayana Yoga When it happens Lakshmi Narayana Yoga: లక్ష్మీనారాయణ యోగం..ఈ 4 రాశులవారికి రాజయోగం , ధనప్రాప్తి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/10/5daac04a43ca2700ff933f929c861bc11720588521973217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lakshmi Narayana Yoga in July : జ్యోతిష్య శాస్త్రంలో యోగాల గురించి ఉంటుంది. రాశి, అంశ చక్రాల్లో ఉన్న గ్రహస్థానాలను బట్టి ఈ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలను అనుసరించి గ్రహాల అనుగ్రహం ఏ రాశివారిపై ఎలా ఉంటుందో నిర్ణయిస్తారు. ఇలాంటి యోగాల్లో ఒకటి లక్ష్మీనారాయణ యోగం. ఈ యోగానికి జ్యోతిష్యశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ యోగం కొన్ని రాశులవారి జీవితంలో ఊహించనంత మార్పు తీసుకొస్తుంది. ముఖ్యంగా శుక్రుడు - బుధుడు ఈ రెండు గ్రహాలు ఒకేరాశిలో సంచరించినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి చాలా శుభప్రదం. ఎందుకంటే బధుడు మేధస్సుకి, వ్యాపారాభివృద్ధికి మంచి చేస్తే..శుక్రుడు సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రెండు గ్రహాల కలయిక అంటే ఆయా రాశులవారిపై అద్భుతమైన సానుకూల ఫలితాలు చూపిస్తుంది. వాస్తవానికి లక్ష్మీనారాయణ యోగం అన్ని రాశులవారికి మంచే చేస్తుంది కానీ..కొన్ని రాశులవారికి అత్యంత యోగాన్నిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సుని కలిగిస్తుంది.
Also Read: మేషం to మీనం.. మీ రాశి ప్రకారం మీరు ఏ దేవుడిని పూజించాలో తెలుసా!
బుధుడు
జూన్ 30న కర్కాటక రాశిలో అడుగుపెట్టిన బుధుడు..జూలై 20 వరకూ ఇదే రాశిలో ఉండి ఆ తర్వాత సింహ రాశిలోకి మారుతాడు. మళ్లీ జూలై 31 న వక్రంలో సంచరించి ఆగష్టు 11 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు..ఆగష్టు 22న తిరోగమనం పూర్తిచేసుకుని తిరిగి సెప్టెంబరు 01 న సింహరాశిలోకి అడుగుపెడతాడు.
శుక్రుడు
శుక్రుడు జూలై 07న కర్కాటక రాశిలో అడుగుపెట్టి నెలాఖరు వరకూ ఇదే రాశిలో ఉంటాడు. జూలై 31 తర్వాత సింహంలోకి రాశిపరివర్తనం చెందుతాడు
అంటే ప్రస్తుతం... బుధుడు, శుక్రుడు...ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. ఫలితంగా ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ఈ రాశులవారికి ఐశ్వర్యం, విజయం , ఆనందం సిద్ధిస్తుంది...
Also Read: ఈ రాశులవారికి ఈ రోజు సమస్యల నుంచి ఉపశమనం..పదోన్నతికి సంబంధించిన సమాచారం - జూలై 10 రాశిఫలాలు!
కర్కాటక రాశి
కర్కాటక రాశిలోనే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నందున..ఈ రాశివారికి అన్నీ శుభఫలితాలే ఉన్నాయ్. ఎప్పటినుంచో వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. నూతన వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. కుటుంబ జీవితంలో ఉండే తగాదాలు సమసిపోయి..సంతోషం పెరుగుతుంది.
సింహ రాశి
లక్ష్మీనారాయణ యోగం సింహరాశివారికి అన్నీ శుభఫలితాలే ఉన్నాయి. సయమానికి డబ్బు చేతికందుతుంది. వర్తక, వ్యాపారాల్లో లాభాలొస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నత ఉద్యోగం, నిరుద్యోగులకు సౌకర్యవంతమైన ఉద్యోగం లభిస్తుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు.
వృశ్చిక రాశి
కర్కాటక రాశిలో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం వల్ల వృశ్చిక రాశి వారికి అన్నీ సానుకూల ఫలితాలే ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని ధనలాభం ఉంటుంది. వెంటాడుతున్న కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాపారులు ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెడితే..భవిష్యత్ లో లాభాలనిస్తాయి. పెళ్లికానివారికి వివాహయోగం ఉంటుంది.
Also Read: అత్యంత ఆకర్షణీయమైన రాశుల్లో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)