Astrology : మేషం to మీనం.. మీ రాశి ప్రకారం మీరు ఏ దేవుడిని పూజించాలో తెలుసా!
Astrology : ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన భాగం దైవారాధన. ఒక్కొక్కరికి ఒక్కో దేవుడిపై నమ్మకం ఉంటుంది. అయితే మీ రాశి ప్రకారం ఏ దేవుడిని పూజించాలో తెలుసా...
Hindu God to Worship According to Your Zodiac: మీ రాశి ప్రకారం పూజించాల్సిన దేవుడు...
మేష రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మేషరాశివారు హనుమంతుడిని పూజించాలి. ఆంజనేయ ఆరాధన వల్ల ఈ రాశివారు ఎలాంటి సమస్యలను అయినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు, నిర్భయంగా ముందుకు సాగుతారు. వారిపై వారికి విశ్వాసం పెరుగుతుంది. లక్ష్య సాధనలో వెనక్కు తగ్గకుండా దూసుకెళతారు.
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుధ్ధిమతాం వరిష్టం ।
వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరాసా నమామి।।
వృషభ రాశి
వృషభ రాశివారు లక్ష్మీదేవిని ఆరాధించాలి.ఈ రాశివారు ఎంత సంపాదించిన సమయానికి చేతిలో డబ్బులు ఉండని పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాంటి స్థితి నుంచి బయటపడేందుకు లక్ష్మీపూజ చేయాలి. "ఓం శ్రీం మహా లక్ష్మీయే నమః" అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
Also Read: వారాహీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం - విశిష్టత, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి !
మిథున రాశి
మిథున రాశివారు శ్రీకృష్ణుడిని ఆరాధించాలి. కృష్ణం వందే జగద్గురుం..అంటే సృష్టిలో కృష్ణుడిని భగవంతుడిగా కన్నా గురువుగా ఆరాధించేవారే మంచి ఫలితాలను పొందుతారు. కృష్ణుడిని ఆరాధించడం వల్ల మిథునరాశివారిలో తెలివితేటలు, జ్ఞానం, సృజనాత్మకత పెరుగుతుంది.
హరే రామ హరే రామ రామ రామ హరే హరే।
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే।।
కర్కాటక రాశి
యోతిష్యశాస్త్రం ప్రకారం కర్కాటక రాశివారు దుర్గాదేవిని పూజించాలి . దుర్గారాధన వల్ల బలం, రక్షణ, భావోద్వేగాల్లో స్థిరత్వం లభిస్తుంది. "ఓం దుర్గాయే నమః" మంత్రాన్ని నిరంతరం పఠించడం వల్ల దుర్గమ్మ ఆశీర్వచనం పొందుతారు.
సింహ రాశి
సింహ రాశివారు సూర్య భగవానుడిని పూజించాలి. ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడుకి నిత్యం అర్ఘ్యం సమర్పించి "ఓం హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః" అనే మంత్రాన్ని పఠించాలి. యోగా, ద్యానం చేయడం అత్తుత్తమం...
కన్యా రాశి
కన్యా రాశి వారు గణేషుడిని ఆరాధిస్తే మంచి తెలివితేటలు వృద్ధి చెందుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. విఘ్నాధిపతిగా అయిన వినాయకుడి ఆరాధన వల్ల మీరు చేపట్టే కార్యాలలో అడ్డంకులు తొలిగిపోతాయి.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ।।
Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!
తులా రాశి
తులా రాశి వారు సరస్వతీ దేవిని పూజిస్తే... జ్ఞానం, తెలివితేటలు, సృజనాత్మకత సిద్ధిస్తుంది. 'ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీ వతీ ధీనామ విత్ర్యవతు' అనే శ్లోకాన్ని పఠించాలి
వృశ్చిక రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం వృశ్చిక రాశి వారు శివుడిని పూజిస్తే పరివర్తన,మానసిక బలం పొందుతారు. అభిషేక ప్రియుడైన శివయ్యకు నీటితో అయిన అభిషేకం చేయడం...'ఓం నమః శివాయ' మంత్రాన్ని పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే తెలివితేటలు వృద్ధిచెందుతాయి, ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం |
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం ||
మకర రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మకర రాశివారు కాళికా దేవిని పూజించాలి. కాళికను ఆరాధిస్తే అంతర్గత - బాహ్య బలం, ధైర్యం, విజయం వరిస్తాయి. ప్రతికూల శక్తులు మీపై ఎలాంటి ప్రభావం చూపించలేవు.. "ఓం క్రీం కాళీ" మంత్రాన్ని జపించాలి
కుంభ రాశి
కుంభ రాశివారు శ్రీరాముడిని పూజిస్తే నైతికత, ధైర్యం, కరుణ, మంచి మనస్తత్వం వృద్ధి చెందుతుంది. రామాయణ పాఠాలు చదవడం మీ జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకొస్తాయి.
శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే
సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.!!
మీన రాశి
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీన రాశివారు శ్రీ మహావిష్ణువుని, శ్రీ కృష్ణుడిని ఆరాధిస్తే అదృష్టం, ఆధ్యాత్మిక సామరస్యం, ప్రేమ, జ్ఞానం లభిస్తాయి. "ఓం నమో నారాయణాయ" లేదా "హరే కృష్ణ" మంత్రాలు పఠించవచ్చు.