అన్వేషించండి

Horoscope Prediction in Telugu 10 july 2024 : ఈ రాశులవారికి ఈ రోజు సమస్యల నుంచి ఉపశమనం..పదోన్నతికి సంబంధించిన సమాచారం - జూలై 10 రాశిఫలాలు!

Horoscope Prediction 10th july 2024: గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈ రోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జూలై 10 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు కొన్ని పనులు పూర్తికాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. కార్యాలయంలో అధికారులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. మీ అభిరుచికి తగిన బాధ్యత లభించకపోవడంతో మీరు నిరాశ చెందుతారు. మతపరమైన కార్యక్రమాలపై ఏకాగ్రత వహిస్తారు.  

వృషభ రాశి

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో వివాద సూచనలున్నాయి. అనవసర కోపం తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. 

మిథున రాశి 

ఈ రోజు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. ప్రేమలో ఉన్నవారు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి రోజు. రోజంతా కుటుంబ వ్యవహారాలతో బిజీగా ఉంటారు. ఆలోచనల్లో సానుకూలత ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. 

Also Read: పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మపదార్థం కృష్ణుడి గుండె..ఈ ప్రచారంలో నిజమెంత!

కర్కాటక రాశి

కొత్త వ్యక్తులను కలుస్తారు. వివాహితులకు ఈ రోజు మంచి రోజు. శుభకార్యాలకు హాజరయ్యేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమ జీవితానికి సంబంధించి కొనసాగుతున్న ఉద్రిక్తతలు తొలగిపోతాయి. ఆర్థికపరిస్థితి ఆశాజనంగా ఉంటుంది. ఉద్యోగులు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. 

సింహ రాశి

అత్యవసరం అయితే కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. సామాజిక సేవలో పాల్గొనవచ్చు. ఒక స్నేహితుడు మీకు శుభవార్త అందిస్తారు.  మీరు జీవితంలోకి ఆహ్వానించాలి అనుకున్న వ్యక్తికి మీ మనసులో మాట చెప్పేందుకు మంచి రోజు.  

కన్యా రాశి

ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహించాలి. వ్యాపారం బాగానే సాగుతుంది. మీరు ఊహించని గుడ్ న్యూస్ వింటారు. 

తులా రాశి

ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల నుంచి సలహాలు స్వీకరించడం మంచిది. 

Also Read: ఆషాఢ అమావాస్య రోజు ఈ ఒక్కటీ చేస్తే మీ కుటుంబానికి ఉన్న పితృదోషం తొలగిపోతుంది!

వృశ్చిక రాశి 

ఈ రోజు మీ ప్రవర్తనలో ఊహించని మార్పులుంటాయి. కార్యాలయంలో పదోన్నతికి సంబంధించిన వార్తలు వింటారు. వ్యాపారంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమికులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. 

ధనుస్సు రాశి

నూతన వ్యవహారాలు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టండి..భవిష్యత్ లో మంచి లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తేనే అందుకు తగిన ఫలితం అందుకుంటారు.  పని ఒత్తిడి తగ్గుతుంది. ఆరోగ్యం బావుంటుంది. 

మకర రాశి

అనవసర విషయాలపై శ్రద్ధ తగ్గించాలి. సమయాన్ని వృధా చేయవద్దు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఖర్చులు అధికం అవడం వల్ల టెన్షన్ పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలున్నాయి. 

Also Read: పూరీ జగన్నాథుడి రథయాత్రేకాదు..ప్రసాదమూ ప్రత్యేకమే - శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో వంటలు!

కుంభ రాశి

ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. సంగీతం వైపు మొగ్గు చూపుతారు. ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయి. 

మీన రాశి

కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. బయటకు ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి రావొచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు టైమ్ కలిసొస్తుంది. ఆర్థికపరిస్థితి మెరుగుపడుతుంది. 

Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Tirupati Laddu Issue : వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ -  హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
వైఎస్ఆర్‌సీపీపై మరో పిడుగు శ్రీవారి లడ్డూ ఇష్యూ - హిందూవాదుల ఆగ్రహాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారు ?
Squid Game Season 2 Teaser: స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
స్క్విడ్ గేమ్ సీజన్ 2... డెడ్లీ గేమ్ సిరీస్ టీజర్ రిలీజ్ చేసిన నెట్‌ఫ్లిక్స్, ఆట చూసేందుకు రెడీనా?
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా వర్షాలు - ఐఎండీ
Idi Manchi Prabhutvam:
"ఇది మంచి ప్రభుత్వం" ప్రారంభమయ్యేది శ్రీకాకుళంలో కాదు, ఆఖరి నిమిషంలో మారిన షెడ్యూల్
Tirupati Laddu: తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటీ? ఇప్పుడు టీటీడీ చేయాల్సిందేంటీ?
Embed widget