అన్వేషించండి

Puri Jagannath Rath Yatra 2024: పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మపదార్థం కృష్ణుడి గుండె..ఈ ప్రచారంలో నిజమెంత!

Jagannath Rath Yatra 2024:కృష్ణుడు లేడు కానీ ఇంకా గుండె కొట్టుకుంటోంది. పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉండే బ్రహ్మ పదార్థం అదే. అందుకే ఎవ్వర్నీ చూడనివ్వరు , నేరుగా చేతితో తాకనివ్వరు. ఈ ప్రచారంలో నిజమెంత?

 Mystery of Puri Jagannath Temple: నవకళేబర యాత్ర.. అంటే గర్భగుడిలో ఉండే విగ్రహాలను భూస్థాపితం చేసి ఆ స్థానంలో కొత్త విగ్రహాలను ప్రవేశపెట్టడం. 8 ,11,19 ఏళ్లకోసారి అధిక ఆషాడమాసం వస్తుంది. అప్పుడు మత్రమే నవకళేబర యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత జగన్నాథుడి పాతవిగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను పెట్టి..పాత విగ్రహాల్లో ఉండే ఓ బ్రహ్మపదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి ప్రవేశపెడతారు. పూరీలో నవకళేబర యాత్ర జరుగుతుంది. అధిక ఆషాడం వచ్చినప్పుడు మాత్రమే ఈ యాత్ర జరుగుతుంది. జగన్నాథుడి విగ్రహాలను తీసేసి వాటి స్థానంలో కొత్తవిగ్రహాన్ని పెడతారు, పాత మూర్తులలో ఉన్న బ్రహ్మపదార్థాన్ని కొత్తవాటిలోకి మార్చి.. పాతవాటిని భూస్థాపితం చేస్తారు. ఇక్కడ బ్రహ్మపదార్థం మార్చడమే ఓ ప్రత్యేకమైన ప్రక్రియ.

Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!

ఏం జరుగుతుంది? 

కొత్తవిగ్రహాలను ప్రతిష్టించడానికి ముందు నలుగురు పెద్దలు ఆలయంలోకి వెళతారు. తరతరాలుగా ఓ వంశానికి చెందినవారే బ్రహ్మపదార్థాన్ని మార్చే ప్రక్రియలో పాల్గొంటారు. ఆ వంశంలో అతిపెద్ద ఎవరైతే వారు ఈ క్రతువులో పాల్గొంటారు. ఆ పెద్దాయన నడుముకి తాడు కట్టి చివర్లో ఓ గంట కడతారు. కళ్లకు గంతలు కట్టి ఆలయం లోపల విగ్రహాల దగ్గరకు తీసుకెళ్లి విడిచిపెట్టి.. అందరూ బయటకు వచ్చేస్తారు. ఆ సమయంలో పూరీ మొత్తం పవర్ కట్ చేస్తారు. మొత్తం చీకటిగా మారుతుంది. పాతమూర్తుల పక్కనే కొత్త విగ్రహాలుంటాయి. జగన్నాథుడి విగ్రహానికి గుండె ప్రదేశంలో ఓ చిన్న తలుపు ఉంటుంది.. విగ్రహాలకి చుట్టూ వస్త్రాలు చుట్టేసి ఉంటాయి. ఆ వస్త్రాలన్నీ తొలగించి జగన్నాథుడి గుండె దగ్గరున్న చిన్న తలుపు తీసి లోపలున్న బ్రహ్మపదార్థాన్ని కొత్త విగ్రహంలోకి ప్రవేశపెడతారు. ఈ మొత్తం క్రియ పూర్తైన తర్వాత ఆ పెద్దాయన గంట వాయిస్తారు. అప్పుడు పాతవిగ్రహాల ప్రదేశంలో కొత్తవి ప్రతిష్టిస్తారు. అప్పుడు ఆ పాతవిగ్రహాలను తీసుకెళ్లి సమాధి చేస్తారు...దీనిని నవకళేబర యాత్ర అంటారు. 

Also Read: వెన్నుచూపి పారిపోయిన కర్ణుడు పరాక్రమవంతుడా? సినిమాలు చూసి మోసపోకండి..ఇదిగో నిజం!


బ్రహ్మ పదార్థం శ్రీకృష్ణుడి గుండె అనే ప్రచారంలో నిజమెంత?

పూరీ జగన్నాథుడి విగ్రహంలో ఉండే ఆ బ్రహ్మపదార్థం శ్రీ కృష్ణుడి గుండె అనే ప్రచారం జరుగుతోంది. దీని వెనుక ఓ కథ కూడా చెబుతారు.  
జర అనే వేటగాడు కృష్ణుడుని పొరపాటున బాణంతో కొట్టిన తర్వాత అందుకు ప్రతిగా అంత్యక్రియలు నిర్వహించాడు. కానీ శరీరం మొత్తం బూడిదైనా  హృదయం కాలలేదు... దాన్ని సంచీలో పెట్టుకుని వెళ్లి ఎక్కడెక్కడో తీసుకెళ్లి చివరకు ఓ చెక్కపెట్టెలో ఉంచి సుముద్రంలో వదిలేశాడు. అదే పూరీ తీరానికి కొట్టుకొస్తే అక్కడ రాజు దాన్ని తీసి అదో విశిష్టమైనది అని గ్రహించి జగన్నాథుడి విగ్రహంలో పెట్టించారని కథనం. అది ఓ ఎలక్ట్రానిక్ డివైజ్ అని అందుకే షాక్ కొట్టకుండా చెక్కలో పెట్టించారని అంటారు.  

ఇది ప్రచారంలో ఉన్న కథ...మరి వాస్తవం ఏంటంటే...

కృష్ణుడి గుండె అనే ప్రచారానికి మూలం అయిన కథకు మూలం జర అనే వేటగాడు. కానీ భాగవతంలో ఏు భాగవతంలో ఏముందంటే... జర అనే వేటగాడు  పక్షి అనుకుని బాణం వేసి ఆ తర్వాత అరుపు వినిపించడంతో అటుగా వెళ్లి చూసి కృష్ణుడిపై బాణం వేశానని తెలిసి పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. ఆ బాధతోనే శరీరం వదిలేశాడు. ఆ తర్వాత అర్జునుడు వచ్చి కృష్ణుడి దేహాన్ని చూసి..అంత్యక్రియలు నిర్వహించాడు. అంటే ప్రచారంలో ఉన్న కథ పూర్తిగా కల్పితం మాత్రమే. అంటే.. కృష్ణుడి గుండె ఇంకా ఉందనే ప్రచారంలోనూ వాస్తవం లేనట్టే..

Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఈ ప్రచారం ఎలా జరిగింది?

దీనికి సంబంధించి స్కాంద పురాణంలో ఓ శ్లోకం ఉంది. 
 
విష్ణోః కళేబరే తస్మిన్
క్షేత్రే శ్రీ పురుషోత్తమే
అంతర్వేది మహాపుణ్య
విష్ణోః హృదయ సన్నిభ

ఈ శ్లోకం అర్థం ఏంటంటే...పూరీ క్షేత్రం మొత్తం కృష్ణుడి శరీరం అయితే..ఆయన కొలువైన ప్రదేశం హృదయం లాంటిది అని అర్థం. అలా అలా ఈ శ్లోక అర్థం కాస్తా... పూరీ విగ్రహాల్లో జగన్నాథుడి విగ్రహంలో ఉన్న బ్రహ్మపదార్థం కృష్ణుడి గుండె అని మారిపోయింది. 

మరి లైట్లు ఆపేయాల్సిన అవసంర ఏమొచ్చిందనే సందేహం వచ్చి ఉండొచ్చు..కేవలం ఆ రహస్యాలను ఎప్పటికీ బయటకు తీసుకురాకూడదు అనే ఉద్దేశంతోనే తరతరాలుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు. అందుకే అమావాస్య అర్థరాత్రి చిమ్మచీకటిలో ఆ బ్రహ్మపదార్థాన్ని పాత విగ్రహాల నుంచి కొత్త విగ్రహాల్లోకి మార్చుతున్నారు. 

ఇంతకీ బ్రహ్మపదార్థం ఏంటి? ఎవరైనా తాకారా ఇప్పటివరకూ?....మరో కథనంలో తెలుసుకుందాం... 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Chandrababu: చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
చంద్రబాబు 100రోజుల పాలన ఎలా ఉంది..? ప్రశంసలు, విమర్శల సంగతేంటి..?
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
COVID-19 Alert : కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
కరోనా న్యూ వేరియంట్, యూరప్​ దేశాల్లో విజృంభిస్తున్న వైరస్.. శీతాకాలంలో డేంజర్ బెల్స్ తప్పదా? హెచ్చరికలిస్తున్న నిపుణులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Embed widget