Kalki 2898 AD Mahabharata and Karna: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Facts about Karna: మయసభలో ద్రౌపది నవ్విందని పగతీర్చుకోవడంలో భాగంగా ద్రౌపదీ వస్త్రాపహరణం జరిగిందని అనుకుంటున్నారా? సినిమాల్లో ఇలానే చూపించారని అంటారేమే...కానీ..వాస్తవం అదికాదు..మరి?
Mahabharata and Karna: మహాభారతంలో అత్యంత అమానుషమైన సంఘటన అంటే ద్రౌపదీ వస్త్రాపహరణం అని ఠక్కున చెబుతారు. మయసభలో దుర్యోధనుడిని చూసి ద్రౌపది నవ్వింది అందుకే మాయాజూదంలో పాండవులను ఓడించిన కౌరవులు.. రాజ్యాన్ని ఆక్రమించడంతో పాటూ ద్రౌపదిని నిండు సభలో అవమానించారని సినిమాల్లో చూపించారు. అందరూ ఇదే నిజం అనుకుంటారు. వాస్తవానికి సినిమాల్లో చాలా సన్నివేశాలు...ప్రేక్షకులను మెప్పించేందుకు రాసినవే కానీ వాస్తవంగా మహాభారతంలో ఇవేమీ లేవు. అదంతా సరే..ఇంతకీ ద్రౌపదీ వస్త్రాపహరణం అనే దుర్మార్గపు ఆలోచన ఎవరికి వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు..
మహాభారతం సభా పర్వంలో ఉన్న శ్లోకం ఇది
ఏకో భర్తా స్త్రియా దేవైః విహితః కురునందన ।
ఇయం త్వనేజవశగా బంధకేతి వినిశ్చితా ॥
అస్యాః సభామానయం న చిత్రమితి మే మతిః ।
ఏకాంబరధరత్వం వాప్యథ వాపి వివస్త్రతా ॥
ఐదుగురు భర్తలున్న స్త్రీ వేశ్యతో సమానం..ఏకవస్త్రం (నెలసరిలో ఉన్నా)లో ఉన్నా పట్టించుకోవద్దు...ద్రౌపది చీరలు నిండుసభలో వలిచేయండి అని అర్థం..
Also Read: మహాభారత విషాద వీరుడు సూర్య పుత్ర కర్ణుడిని ముంచేసిన మూడు శాపాలు ఇవే!
ఈ సలహా ఎవరిచ్చారో తెలుసా?
దుర్యోధనుడు - దుశ్శాసనుడు - శకుని ...వీళ్ల ముగ్గురిలో ఎవరో ఒకరు అని అనుకుంటున్నారా?
వీళ్లు ముగ్గురూ కాదు.. ఈ దుర్మార్గపు ఆలోచన వచ్చింది కర్ణుడికి... ఇది ఏ సినిమాలోనూ ఉండదు..
అసలు ద్రౌపదీ వస్త్రాపహరణం ఎందుకు జరిగింది?
మయసభలాంటి భవనం, పాండవుల సంపద, వైభవం చూసి దుర్యోధనుడు భరించలేకపోయాడు. అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి పాండవులను రాజ్యం నుంచి తరిమేయాలి..మాయాజూదంతోనే అది సాధ్యం అన్నాడు. ధృతరాష్ట్రులు మొదట అంగీకరించకపోయినా దుర్యోధనుడు ప్రాణం తీసుకుంటానని బెదిరించి ఒప్పించాడు. అప్పుడు మాయాజూదం ప్రారంభమైంది. పాచికలు వేసే సీన్ కూడా సినిమాల్లో పందాలు ధర్మరాజు వేసినట్టు చూపిస్తారు..కానీ అస్సలు ధర్మరాజు పాచికలు ముట్టుకోలేదు..ఇరువైపులా పందాలు వేసింది శకుని మాత్రమే. మొత్తం 20 పందాలలో ఆఖరిది అయిన 20వ ద్రౌపదిమీద పందెం. మొదట తన సేవకులైన ప్రేతగామిని పంపించి ద్రౌపదిని రమ్మని చెప్పాడు దుర్యోధనుడు. అప్పుడు ద్రౌపది అడిగిన ప్రశ్న ఏంటంటే...నా భర్త తన్నోడి నన్నోడెనా...నన్నోడి తన్నోడెనా అని అడిగింది. అది అర్థంకాక సభకు వెళ్లి చెప్పాడు ప్రేతగామి. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడంటే.. ఈ నా సేవకుడు సూతపుత్రుడికి బుద్ధిలేదు దశ్శాసనా నువ్వెళ్లి తీసుకురా అన్నాడు. సినిమాల్లో కర్ణుడుని సూతపుత్రుడు అన్నారని పేద్ద డైలాగ్ ఉంటుంది...కానీ అసలు సూతపుత్రుడు అని అవమానించింది దుర్యోధనుడే.
Also Read: కర్ణుడు - అర్జునుడు ఇద్దరిలో ఎవరు బలవంతులు? కల్కి 2898 AD సినిమాలో ఏం చూపించారు - పురాణాల్లో ఏముంది?
కర్ణుడు - వికర్ణుడు
దుశ్శాసనుడు వెళ్లి ద్రౌపదని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వచ్చి సభలో పడేశాడు. ఆ సమయంలో పాండవులు మౌనం వహించారు. కౌరవుల్లో ఒకడైన వికర్ణుడు రెండు ప్రశ్నలు అడిగాడు..
వికర్ణుడు - ద్రౌపది ధర్మరాజుకి మాత్రమే కాదు మిగిలిన నలుగురికి కూడా భార్య..వాళ్లు కూడా ఒప్పుకుంటేనే ఆమెను పందెంలో గెలిచినట్టు
కర్ణుడు - వాళ్లు ఐదుగురు మనకు దాసులు అయినప్పుడు...వాళ్ల సొత్తు అయిన ద్రౌపది కూడా దాసీనే
వికర్ణుడు - ఎవరైనా మనకు దాసులైతే...అయ్యాక వాళ్లు సంపాదించేది మనసొంతం ...కానీ అంతకుముందు సంపాదించినది మన సొత్తు ఎలా అవుతుంది...
ఈ ప్రశ్నకు కర్ణుడి నుంచి సమాధానం లేదు...
అందుకే యుద్ధంలో వికర్ణుడు చనిపోయినప్పుడు భీముడు బాధపడ్డాడు, కౌరవుల తరఫున యుద్ధానికి వచ్చావు అందుకే చంపకతప్పలేదని బాధపడ్డాడు...
ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్న సమయంలో సభలో పెద్దలంతా కళ్లుమూసుకుంటే..కృష్ణుడు వచ్చి కాపాడాడు.
కర్ణుడు: నువ్వు ఎలాగూ ఐదుగురు భర్తలకు భార్యవి..నువ్వు మాలో ఒకర్ని భర్తగా స్వీకరించు
దుర్యోధనుడు: కట్టుకున్న పంచెని పైకెత్తి కూర్చుని...రా వచ్చి కూర్చో అని తొడభాగం చూపించాడు...
అప్పుడు భీముడు...నీ తొడలు బద్దలకొట్టి నిన్ను చంపుతా అని ఆ సమయంలో ప్రతిజ్ఞ చేశాడు...
Also Read: మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?
వస్త్రాపహరణం తర్వాత మీరంతా నాశనం అయిపోతారని శపించింది ద్రౌపదీ...ప్రకృతిలో బీభత్సం మొదలైంది. అప్పటివరకూ కిమ్మనకుండా కూర్చున్న ధృతరాష్ట్రుడు...తన కుమారులంతా నాశనం అయిపోతారని భయపడి రెండు వరాలు కోరుకోమన్నాడు. పాండవులకు విముక్తి కలిగించమంది. క్షత్రియ స్త్రీ రెండు వరాలకు మించి కోరుకోకూడదు అని చెప్పింది. రాజ్యం కావాలని కోరుకోలేదు..ఎందుకంటే పాండవుల చేతిలో కౌరవులకు ఓటమితప్పదని ద్రౌపదికి తెలుసు అందుకే అరణ్యవాసం, అజ్ఞాతవాసానికి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఉన్నప్పుడే భగవంతుడిని ప్రార్థించి దివ్యాస్త్రాలు సంపాదించుకున్నారు. ధర్మరాజుకి సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చాడు, అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ప్రసాదించాడు, ద్రౌపదికి దుర్గాదేవి ప్రత్యక్షమైంది. ఇలా అరణ్యవాసం, అజ్ఞాతవాసంలో సర్వశక్తులు, సకల అస్త్రాలు సమకూర్చుకుని కురుక్షేత్రంలో అడుగుపెట్టి విజయం సాధించారు పాండవులు..