అన్వేషించండి

Rahu Nakshatra Gochar 2024: రాహువులా పట్టుకున్నాడు అనకండి..ఈ 3 రాశులవారికి రాహువు వల్ల డబ్బే డబ్బు!

Rahu Nakshatra Gochar 2024: రాహువు నక్షత్రం మారడంతో ఈ 3 రాశుల వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది

Rahu Nakshatra Parivartan 2024 Date: జ్యోతిష్యశాస్త్రంలో రాహువును పాప గ్రహంగా పరిగణిస్తారు. ఎందుకంటే రాహువు ప్రతికూల ప్రభావం వల్ల జీవితంలో సమస్యలు మొదలవుతాయి. రాహువు సంచారం సరైన దిశలో లేకుంటే ఆ జాతుడికి జీవితంలో నిత్యం ఇబ్బందులు తప్పవు.

స్పష్టంగా చెప్పాలంటే రాహువు సంచారం సరిగాలేకుంటే జీవితం గ్రహణంలా ఉంటుంది.  సమస్యలు వస్తూనే ఉంటాయి. ఓ సమస్య తీరింది హమ్మయ్య అనేసరికి మళ్లీ పరిస్థితి మొదటికి వస్తుంది. అందుకే ఎవరైనా అలా వెంటాడుతుంటే రాహువులా తగులుకున్నావ్ అనే మాట వాడకంలోకి వచ్చింది.   రాహువు నక్షత్రం, రాశి మార్పు ప్రభావం ఓ వ్యక్తి జీవితంపై అంతలా ఉంటుంది..

నవంబర్ 10  రాత్రి 11.31 గంటలకు రాహువు రాశి మారింది. రాహువు ఉత్తర భాద్రపద నక్షత్రం తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానానికి చేరుకున్నాడు. జనవరి 10, 2025 వరకు ఇదే స్థానంలో ఉంటాడు. అంటే రెండు నెలల పాటూ ఉత్తరాభాద్రలో సంచరించి...ఆ తర్వాత రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. మొత్తం 27 నక్షత్రాలలో ఉత్తరాభాద్ర 26వది...ఆఖరి నక్షత్రం రేవతి. జనవరి 10 తర్వాత నుంచి రేవతిలో అడుగుపెడతాడు రాహువు. 

Also Read: అరుణాచలంలో కార్తీక పౌర్ణమి శోభ - గిరిప్రదక్షిణ అంటే అలా చుట్టి వచ్చేయడం కాదు ఈ 44 ఎనర్జీ పాయింట్స్ చూడాల్సిందే!

ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహువు సంచారం మూడు రాశులవారికి అదృష్టాన్నిస్తోంది. ఈ సమయంలో మీకున్న సమస్యల నుంచి బయటపడతారు, అనుకోని ఆదాయం పెరుగుతుంది. వెంటాడుతున్న ఆస్తివివాదాలు కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. 

వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)

రాహువు సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదం మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. గత పెట్టుబడుల నుంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం లభిస్తుంది. వివాదాలు పరిష్కారమవుతాయి 

తులా రాశి  (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

ఈ రాశివారికి రాహువు రాశి మార్పు చాలా మేలు చేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం మంచి స్థితిలో ఉంటుంది. మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీరు పిల్లల నుంచి ఆనందాన్ని పొందవచ్చు. కొత్త పనులు ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Also Read: శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

ధనుస్సు రాశి  (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)

ధనుస్సు రాశి వారికి రాహువు స్థానం మేలు చేస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యాలు జరగవచ్చు. ప్రేమికులు గొప్ప ఆనందంలో ఉంటారు. ఏదో ఒక మూల నుంచి అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. భగవంతునిపై భక్తిపై దృష్టి పెడతారు.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

ABP దేశంలో మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు , నిత్యం మీ రాశిఫలాలు చూసేందుకు..పండుగలు, ప్రత్యేక రోజుల విశిష్టతలు తెలుసుకునేందుకు, అంతుచిక్కని రహస్యాలున్న ఆలయాల సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget