అన్వేషించండి

Saturn Transit 2024 - 2025 : శని తిరోగమనం - ఈ 3 రాశులవారికి శని వదిలిపోతుంది .. రెండున్నరేళ్లు వీళ్లకు కష్టాలే కష్టాలు!

Shani Vakri 2025: శనిగ్రహం తిరోగమనం కొన్ని రాశులవారిని కష్టాల నుంచి బయటపడేస్తే..మరికొన్ని రాశులవారికి అదృష్టాన్నిస్తుంది. ఇప్పుడు శని తిరోగమనం ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి..

Saturn Transit 2024 - 2025: ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని...కర్కాటక రాశి, వృశ్ఛికరాశి, మకర రాశి, కుంభ రాశి, మీన రాశి వారిపై శని ప్రభావం ఉంది. కర్కాటకం, వృశ్చిక రాశివారికి అర్ధాష్టమ, అష్టమ శని ఉండగా.. మకరం, కుంభం, మీనం..ఈ రాశులవారిపై ఏల్నాటి శని ప్రభావం ఉంది. ఏల్నాటి శని అంటే ఏడున్నరేళ్లు ఉంటుంది. 

నెమ్మదిగా సంచరించడం వల్లే శనిని మందరుడు అంటారు...అన్ని గ్రహాలు నెల రోజులకోసారి రాశి మారితే శని గ్రహం మాత్రం రెండున్నరేళ్లకోసారి రాశి మారుతుంది. కుంభరాశిలో వక్రంలో ఉన్న శని నవంబరు 13 నుంచి సాధారణ స్థితికి వస్తాడు..

తిరోగమనంలో ఉన్న శని సాధారణ స్థితికి వచ్చిన తర్వాత కుంభంలో సంచరించి..వచ్చే ఏడాది మార్చిలో మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. శని ప్రత్యక్షంగా రాశి మారడం వల్ల ఆ ప్రభావం అన్ని రాశులవారిపైనా ఉంటుంది.   2025లో శని ప్రభావం ఏ రాశులవారిపై ఎలా ఉండబోతోందో ఈ కథనంలో తెలుసుకుందాం...

Also Read: కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ - శివతాండవ స్తోత్రం ఎందుకంత పవర్ ఫుల్!
 
2025 మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశించి.. జూన్ 03, 2027 వరకూ అక్కడే ఉంటుంది. అంటే రెండున్నరేళ్లపాటూ మీన రాశిలో ఉంటుంది శనిగ్రహం. ఫలితంగా కొన్ని రాశులవారికి అష్టమ, అర్ధాష్టమ, ఏల్నాటి శని ముగిస్తే..మరికొన్ని రాశులవారికి ప్రారంభం అవుతుంది.  

మేషరాశి, వృషభ రాశి, మిధున రాశివారికి మీనంలో శని సంచారం అంత ప్రతికూల ప్రభావం చూపించదు.

సింహం, ధనస్సు రాశులవారిపై మిశ్రమ ప్రభావం ఉంటుంది. 

కర్కాటకం, వృశ్ఛిక రాశులవారికి మీనంలో శని సంచారం అనుకూల ఫలితాలను ఇస్తుంది.కానీ.... 2025 మార్చి లోగా చుక్కలు కనిపిస్తాయ్

కన్యా, తులా రాశులవారికి కూడా ఇబ్బందులు తప్పవు.

మకర రాశి వారికి ఏల్నాటి శని నుంచి ఉపశమనం లభిస్తుంది

కుంభం, మీనం రాశులవారికి ఏల్నాటి శని ఉంది కాబట్టి..శని స్థానాన్ని బట్టి ఫలితాలుంటాయి.

Also Read: శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశులవారికి అనారోగ్యం, అధిక ఖర్చులు, అన్నింటా అడ్డంకులు!

2025 లో శని సంచారం ఈ మూడు రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తోంది.
 
వృషభ రాశి

మీనంలో శని సంచారం అంటే మీ రాశి నుంచి పదకొండో స్థానంలో ఉందని అర్థం. ఈ స్థానంలో శని సంచారం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలికన అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆకస్మిక ధనలాభం, ఆస్తి వివాదాల్లో విజయం తథ్యం. శుభవార్తలు వింటారు..వచ్చే ఏడాది మీకు అద్భుతంగా కలిసొస్తుంది. 

కర్కాటక రాశి

కర్కాటక రాశి నుంచి శని సంచారంలో తొమ్మిదో స్థానంలో ఉంటుంది. జాతకంలో తొమ్మిదో స్థానంలో శని సంచారం అదృష్టాన్నిస్తుంది. కొన్నాళ్లుగా పడుతున్న ఇబ్బందుల నుంచి 2025 మార్చి నుంచి ఉపశమనం లభించడం ప్రారంభమవుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీపై కనుదృష్టి అధికంగా ఉంటుంది. సౌకర్యవంతమైన ఉద్యోగాల్లో స్థిరపడతారు. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మార్గాలు కనిపిస్తాయి.  

Also Read: ధనస్సు లోకి శుక్రుడు - డిసెంబరు 02 వరకూ ఈ రాశులవారికి అన్నీ శుభఫలితాలే!

మకర రాశి

మీ రాశివారికి 2025 మార్చి నుంచి ఏల్నాటి శని నుంచి ఉపశమనం లభిస్తుంది. కుంభ రాశిలో శని సంచారం ముగిసినప్పటి నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. చేపట్టిన పనుల్లో విజయావకాశాలుంటాయి. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. 

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget