Venus Transit Sagittarius 2024: శుక్రుడి సంచారం కారణంగా ఈ రాశులవారికి అనారోగ్యం, అధిక ఖర్చులు, అన్నింటా అడ్డంకులు!
Venus Transit November 2024: వృశ్చిక రాశిలో సంచరించిన శుక్రుడు నవంబరు 07న ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. డిసెంబరు 02 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి బ్యాడ్ టైమ్ మొదలైంది...
Venus Transit November 2024 In Sagittarius : రాక్షస గురువైన శుక్రుడిని... జ్యోతిష్య శాస్త్రం ప్రకారం విలాసాల అధిపతిగా పిలుస్తారు. భౌతిక సుఖాలను ఇచ్చే శుక్రుడి సంచారం బావుంటే అన్నీ సంతోషాలే..లేదంటే అడుగడుగునా అడ్డంకులు, అవమానాలే. నవంబరు 07 న ధనస్సు రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు డిసెంబరు 02 వరకూ ఇదే రాశిలో సంచరిస్తాడు. ఈ ప్రభావం కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది.
వృషభ రాశి
శుక్రుడు మీ రాశి నుంచి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల మీపై ప్రభావం చాలా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఈ సమయంలో ఆదాయం-ఖర్చుల మధ్య సమతుల్యత చూసుకోవాలి. కార్యాలయంలో మీ ప్రణాళికలు కొన్ని విజయవంతం అవుతాయి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలుంటాయి ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇది అనుకూల సమయమే. కేవలం శుక్ర సంచారం మీ ఆరోగ్యం, ఆదాయంపై పడుతుంది.
Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!
కర్కాటక రాశి
ఈ రాశి నుంచి శుక్రుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు. ఆరో ఇంట శుక్ర సంచారం అప్పులు, శత్రువులను పెంచుతుంది. ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఇల్లు, వ్యాపారం, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. మీ శత్రువులు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. అనవసర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. చాలాసార్లు మీరు చేపట్టిన పనులు పూర్తి అయినట్టే అనిపిస్తాయి కానీ ఆఖరి నిముషంలో ఆగిపోతాయి. విదేశీ కంపెనీలలో పనిచేసేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలాస వస్తువులు కొనుగోలు కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు.
సింహ రాశి
మీ నుంచి ఐదో ఇంట శుక్ర సంచారం సాగుతోంది. ఈ సమయంలో ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరకుండా ఉంటే మీకు మంచే జరుగుతుంది. జాతకంలో ఐదో స్థానం విద్య, పిల్లలకు సంబంధించనది. అందుకే ఈ సమయంలో పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కానీ ఈ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. ఉద్యోగం , వ్యాపారంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.
Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!
ధనుస్సు రాశి
శుక్ర సంచారం మీ రాశిలోనే జరుగుతోంది. ఫలితంగా ఈ సమయంలో కెరీర్ కి సంబంధించిన కొన్ని మార్పులు వచ్చే సూచనలున్నాయి. సొంతంగా వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు ఎక్కువ రుణాలు తీసుకోకుండా ఉండాలి. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. కొత్త దంపతులకు సంతాన యోగం ఉంది.
మకర రాశి
ఈ రాశి నుంచి పన్నెండో స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. జాతకంలో పన్నెండో ఇల్లు ఖర్చు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినది. ఈ సమయంలో మీకు అధిక ఒత్తిడి, ఊహించని ఖర్చు ఎదురవుతుంది. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి కలలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు.
మీన రాశి
మీ రాశి నుంచి పదో స్థానంలో ఉన్నాడు శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పదో స్థానం కర్మకు సంబంధించిన ప్రదేశం. ఈ సమంలో ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఉన్నతాధికారులకు సత్సంబంధాలుంటాయి. భూములు - ఆస్తులకు సంబంధించిన విషయాల్లో అడుగు ముందుకు పడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.
Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.