అన్వేషించండి

Karthika Masam 2024 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!

Karthika Masam 2024: శివుడు, విష్ణువుకి ప్రీతికరమైన కార్తీకమాసం ఈ ఏడాది ఎప్పటి నుంచి ప్రారంభమవుతోంది. క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి సహా కార్తీకమాసంలో  ముఖ్యమైన రోజులేవో ఇక్కడ తెలుసుకోండి

Karthika Masam Start and End Date 2024:  దీపావళి అమావాస్యతో ఆశ్వయుజమాసం ముగుస్తుంది. ఆ మర్నాటి నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది అమావాస్య తిథి తగులు మిగులు రావడంతో అక్టోబరు 31 న దీపావళి వచ్చింది. నవంబరు 1 సూర్యోదయానికి అమావాస్య ఉండడంతో.. నవంబరు 2 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది. 

బ్రహ్మ ముహూర్తంలో కార్తీకస్నానం, దీపంతో కార్తీకమాసం ప్రారంభిస్తారు. సుర్యోదయానికి పాడ్యమి తిథి ఉన్న రోజునే కార్తీకమాసం ప్రారంభంగా పరిగణలోకి తీసుకుంటారు. అందుకే నవంబరు 02 న కార్తీకమాసం ప్రారంభమవుతోంది.  

Also Read: కార్తీకమాసంలో ఇందులో ఒక్క క్షేత్రం దర్శించుకున్నా చాలు!

2024 నవంబరు 02  శనివారం కార్తీకమాసం ప్రారంభం పాడ్యమి
నవంబరు  03 ఆదివారం యమవిదియ - భగినీహస్త భోజనం -భాయ్ దూజ్
నవంబరు  04 కార్తీకమాసం మొదటి సోమవారం
నవంబరు 05 మంగళవారం నాగులచవితి
నవంబరు 06 బుధవారం నాగపంచమి
నవంబరు 09  శనివారం కార్తావీర్యజయంతి 
నవంబరు 11 కార్తీకమాసం రెండో సోమవారం - యజ్ఞావల్క జయంతి
నవంబరు  12 మంగళవారం మతత్రయ ఏకాదశి
నవంబరు  13 బుధవారం క్షీరాబ్ది ద్వాదశి
నవంబరు  15 శుక్రవారం జ్వాలా తోరణం, కార్తీక పూర్ణిమ (Karthika Pournami 2024), కేదారనోములు,గురునానక్ జయంతి
నవంబరు  16 శనివారం వృశ్చిక సంక్రాంతి
నవంబరు  18 కార్తీమాసం మూడో సోమవారం
నవంబరు  19 మంగళవారం సంకటహర చతుర్థి
నవంబరు  25 కార్తీకమాసం నాలుగో సోమవారం
నవంబరు  26 మంగళవారం ఏకాదశి
నవంబరు 29 శుక్రవారం మాస శివరాత్రి
నవంబరు 30 శనివారం అమావాస్య తగులు
డిసెంబరు 01 ఆదివారం అమావాస్య మిగులు - పోలిస్వర్గం

lso Read: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!

కార్తీకమాసంలో సోమవారం,  జ్వాలాతోరణం ..పరమేశ్వరుడి ప్రాముఖ్యత తెలియజేస్తే.. బలిపాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యత తెలియజేస్తున్నాయ్. కార్తీకపురాణంలో మొదటి 15 అధ్యాయాలు పరమేశ్వరుడి ప్రాముఖ్యత, చివరి 15 అధ్యాయాలు విష్ణువు గురించి తెలియజేస్తున్నాయ్. ఈ ఏడాది నవంబరు 02 నుంచి కార్తీకమాసం ప్రారంభమవుతోంది... డిసెంబరు 01 తో ముగుస్తోంది..

న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం 
నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్

కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదు.  గంగతో సమానమైన తీర్థం లేదని అర్థం.

Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!
 
కార్తీకం నెల రోజులు నియమనిష్టలు పాటిస్తారు. ఈ నెల రోజులు నియమాలు పాటించేవారు శాఖాహారం మాత్రమే తీసుకుంటారు అది కూడా రోజుకి ఒకసారి మాత్రమే. వర్షాకాలం పూర్తై..చలి పెరిగే సమయం కావడంతో ఈ నెల రోజులు చేసే దాన ధర్మాలకు విశేష ప్రాధాన్యం ఉంటుంది. దుప్పట్లు, స్వెట్టర్లు, కంబళ్లు దానం చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. దానధర్మాలను ఎంత గోప్యంగా చేస్తే అంత మంచి ఫలితం పొందుతారు.

కార్తీకమాసంలో వీటికి దూరంగా ఉండండి

  • కార్తీకమాసం నియమాలు పాటించేవారు వెల్లుల్లి, ఉల్లి, మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి
  • ఈ నెల రోజులు ఓ నియమంలా పాటించి..ప్రతికూల ఆలోచనలకు, ఒకరికి ద్రోహం చేయాలనే ఆలోచనకు దూరంగా ఉండడం మంచిది
  • నమ్మకం ఉంటే దేవుడిని పూజించండి..లేదంటే మానేయండి..ఎట్టిపిరిస్థితుల్లోనూ దైవదూషణ మాత్రం చేయొద్దు
  • ఈ నెల రోజులు దీపారాధన కోసం మాత్రమే నువ్వుల నూనె వినియోగించండి.. ఒంటికి రాసుకునేందుకు వద్దు
  • కార్తీకంలో మినుములు తినకూడదు.. నలుగుపెట్టుకుని స్నానమాచరించడం లాంటివి చేయకూడదు
  • కార్తీకమాసం నియమాలు పాటించేవారు.. ఈ నియమాలు పాటించని వారిచేతి వంట తినకూడదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Drone Show: విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Cyclone DANA Rain News: నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?విషం ఎక్కించినా చావని మొండోడు.. హమాస్‌ న్యూ చీఫ్ మాషల్మేం ఉండగా ఒక్క ఘటన లేదు, రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Drone Show: విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
విజయవాడ పున్నమి ఘాట్‌లో డ్రోన్ షో అదుర్స్ - 5 గిన్నిస్‌ వరల్డ్ రికార్డ్స్‌ సొంతం
Southern population politics : దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
దక్షిణాదికి చైనా, జపాన్ తరహా సమస్య వచ్చిందా ? జనాభా పెంచితేనే ఉనికి నిలబడుతుందా ?
Cyclone DANA Rain News: నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
నేడు దానా తుఫానుగా మారనున్న వాయుగుండం- ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Cyclone Dana Trains Cancel: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, దానా తుఫాను ప్రభావంతో 3 రోజులు భారీగా రైళ్లు రద్దు - లిస్ట్ చెక్ చేసుకోండి
Junior Lecturers JL Results: జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
జూనియర్‌ లెక్చరర్‌ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్
Vijayawada Drone Show: 5,500 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం, కృష్ణా తీరంలో అతిపెద్ద డ్రోన్‌ షో
5,500 డ్రోన్లతో ఆకాశంలో అద్భుతం, కృష్ణా తీరంలో అతిపెద్ద డ్రోన్‌ షో
Muthyalamma Temple: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయంలో త్వరలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ట- తలసాని
Arthamainda Arun Kumar 2 Trailer: హిలేరియస్‌గా 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2' ట్రైలర్... రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
హిలేరియస్‌గా 'అర్థమైందా అరుణ్ కుమార్ సీజన్ 2' ట్రైలర్... రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
Embed widget