October Monthly Horoscope 2024: అక్టోబరు నెలలో ఈ 6 రాశులవారికి బుద్ధి, ఆలోచన సరిగా ఉండదు - ద్వితీయార్థం కొంత పర్వాలేదు!
October Monthly Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. అక్టోబరు నెలలో ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...
October Monthly Horoscope 2024 : అక్టోబరు నెల రాశిఫలాలు
మేష రాశి
మేష రాశివారికి అక్టోబరు నెల మిశ్రమ ఫలితాలను ఇస్తోంది. మొదటి అర్థభాగం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగస్తులపై అదనపు పని ఒత్తిడి ఉంటుంది. ప్రత్యర్థులు కూడా పనిలో అడ్డంకులు సృష్టిస్తారు. ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. కుటుంబంలో తగాదాలు ఇబ్బందిపెడతాయి. నమ్మినవారే మోసం చేస్తారు. ధైర్య సాహసాలతో క్లిష్ట పరిస్థితులను అధిగమించగలరు...
వృషభ రాశి
వృషభ రాశివారికి కూడా అక్టోబరు నెల అంత మంచి ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ నెలలో మీరు చేపట్టిన పనులేవీ అనుకున్న సమయానికి పూర్తికావు. లేనిపోని అడ్డంకులు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితంలోనూ ఇదే సమస్యలు . బంధు మిత్రులతో విరోధం, ఆరోగ్య భంగం, ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు తప్పవు. నెల ద్వితీయార్థంలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
Also Read: ఈ 4 రాశులవారు జీవితంలో ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తారు - మీరున్నారా ఇందులో!
వృశ్చిక రాశి
అక్టోబరు నెల మొదటి అర్ధభాగం వృశ్చిక రాశికి హెచ్చు తగ్గులతో నిండి ఉండవచ్చు. ప్రతి విషయంలోనూ కొంత వ్యతిరేకత, ఆటంకాలు, ఆర్థిక సమస్యలు, దూబరా ఖర్చులు ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అనవసర విషయాల్లో తలదూర్చటం వల్ల విలువ కోల్పోతారు. కుటుంబ సభ్యులతో విరోధాలుంటాయి. చేపట్టిన పనులు పూర్తికాక ఇబ్బందులు. ఉద్యోగులకు స్థానచలనం , వ్యసనాల ద్వారా వ్యయం ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనస్సు రాశివారికి ఈ నెల ఆరంభం బావుంటుంది కానీ..ద్వితీయార్థంలో అంత అనుకూల ఫలితాలు లేవు. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగం, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు.
Also Read: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం
కుంభ రాశి
కుంభ రాశివారికి అక్టోబరు నెలలో 15 రోజులు కలిసొస్తాయి.. 15 రోజులు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి , వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. సమయానికి డబ్బు చేతికందుకుంది. తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంటుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. చిన్న చిన్న సమస్యలు మినహా కుంభ రాశివారికి అక్టోబరు నెల బాగానే ఉంటుంది.
మీన రాశి
ఈ నెలలో మీకు ప్రధమార్థం అంతగా బావుండదు. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆలోచన, బుద్ధి సరిగా ఉండదు. మానసికంగా కుంగిపోతారు. నిత్యం ఏదో ఒక సమస్య వెంటాడుతుంది. ద్వితీయార్థంలో కొంత వరకూ పరిస్థితులు మెరుగుపడతాయి. అనుకున్న పనులు సాధిస్తారు. ఆదాయం బావుంటుంది కానీ ఖర్చులు అధికంగా ఉంటుంది. ఈ నెలలో చెడువార్తలు వినే అవకాశం ఉంది. వాహనప్రమాదాలు జరగకుండా జాగ్రత్తపడండి. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు.. పురోగతి ఉంటుంది. నూతన బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది.
Also Read: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.