Love Horoscope Today 11th December 2022: ఈ రాశివారి వైవాహిక జీవితంలో వివాదాలు సర్దుమణుగుతాయి
Love Horoscope Today 11th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Love Horoscope Today 11th December 2022: ఈ రోజు ఏ రాశివారి ప్రేమ జీవితం ఎలా ఉందో చూద్దాం...
మేష రాశి
పని ప్రదేశంలో ఒకర్ని కలుస్తారు. మీ ప్రేమికులతో వివాదం ఉండొచ్చు జాగ్రత్త. వైవాహిక జీవితంలో ఖర్చులు పెరగడంతో చర్చలు జరుగుతాయి. వివాహం కానివారికి సంబంధం కుదురుతుంది
వృషభ రాశి
ఈ రోజు మీరు ఎవరికైనా ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ప్రేమ బంధం బావుంటుంది. ప్రేమ జీవితం యొక్క సంబంధం చాలా కాలం ఉంటుంది. అపరిచితుడితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు పాత స్నేహితుడి నుండి ఒక సందేశాన్ని అందుకుంటారు.
మిథున రాశి
అవివాహితులకు వివాహ ప్రతిపాదన వస్తుంది. ప్రేమ జీవితం, వైవాహిక జీవితంలో ఓ విషయం గురించి భాగస్వామితో పరస్పర విభేదాలు ఉంటాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేస్తారు.
Also Read: శని ఇబ్బంది పెడితే బృహస్పతి ఉపశమనం ఇస్తాడు, 2023 లో కర్కాటక రాశిఫలాలు
కర్కాటక రాశి
ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. ప్రేమికులు సంతోషంగా ఉంటారు కానీ గృహస్థుల మధ్య కొనని విభేదాలుంటాయి. చిన్న చిన్న విషయాలపై భాగస్వామితో వాదన ఉంటుంది. ప్రేమ జీవితంలో చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది.
సింహ రాశి
మీరు మీ భాగస్వామితో కలిసి టైమ్ స్పెండ్ చేస్తారు. పనిచేసే ప్రదేసంలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు. మ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ప్రేమికులు తమ మనసులో మాట చెప్పేందుకు మంచిరోజు
కన్యా రాశి
ఈ రోజు శృంగార పరంగా మీకు ప్రత్యేకమైన రోజు. కొన్నాళ్ల నుంచి వైవాహిక జీవితంలో కొనసాగుతున్న పరస్పర విభేదాలు తొలగి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ జీవితంలో ఒక ప్రత్యేక మార్పు రాబోతోంది.
Also Read: 2023లో ఈ రాశివారు అన్నింటా సక్సెస్ అవుతారు, ఏడాది సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది
తులా రాశి
మీ భాగస్వామికి ఓబహుమతి ఇస్తారు. కుటుంబ సభ్యులను సపోర్ట్ చేయడం వల్ల జీవిత భాగస్వామితో వివాదం ఉండొచ్చు. కొత్తగా పెళ్లైన వారికి శుభసమయం
వృశ్చిక రాశి
మీరు మీ భాగస్వామితో కలర్ ఫుల్ ఆలోచనలతో ఉండబోతున్నారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమికుల మధ్య మాటపట్టింపులుంటాయి.
ధనుస్సు రాశి
మీ ప్రేమ భాగస్వామి కోరిక నెరవేరుతుంది. ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఏకపక్ష ప్రేమ మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఇంటి పనికి సంబంధించి జీవిత భాగస్వామితో వివాదం ఉండవచ్చు.
మకర రాశి
ఈ రోజు వివాహితులకు మంచిరోజు. చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమికులు తమ భాగస్వామికి మంచి బహుమతి ఇస్తారు. అవివాహితులు పని ప్రదేశంలో తమ భాగస్వామిని వెతుక్కుంటారు.
Also Read: దేవుడు తినడు కదా మరి నైవేద్యం ఎందుకు పెట్టాలి!
కుంభ రాశి
నిత్యం బిజీగా ఉండే మీరు ఈ రోజు కుటుంబం, జీవిత భాగస్వామికి పూర్తి సమయం కేటాయిస్తారు. ఎలాంటి ప్లాన్ లేకుండా ప్రేమికులు ఆకస్మికంగా సమావేశం అవుతారు..ఇది మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేస్తారు
మీన రాశి
ఈ రోజు మీరు ఒకరి నుంచి మంచి ఆఫర్ పొందుతారు. ఆన్ లైన్లో వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారికి అవి ఓ కొలిక్కివస్తాయి. అనవసర ఆవేశానికి లోనై కుటుంబ వాతావరణం డిస్ట్రబ్ చేసుకోవద్దు.