Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే… ఆ ఐదు రాశులవారు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు….
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 ఆగస్టు 19 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీరు పెద్ద బాధ్యతను తలకెత్తుకుంటారు. రోజంతా బిజీగా ఉంటారు. వ్యాపారం బాగా జరుగుతుంది. ప్రత్యర్థుల నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు శుభసమయం.
వృషభం
చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. డబ్బు సంబంధిత సమస్యలు దూరమయ్యే అవకాశం ఉంది. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. మీ బాధ్యతలు సమక్రమంగా నెరవేరుస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలుంటాయి . ఆరోగ్యంలో ఒడిదుడుకులు ఉంటాయి.
మిథునం
స్నేహితుల మద్దతు ఉంటుంది. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. ఏదో విషయం గురించి ఆందోళన చెందుతారు. టెన్షన్ పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో చర్చ ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు ఆర్థిక నష్టం ఉండవచ్చు. రుణాలు ఇవ్వడం మానుకోండి. ఏ విషయంలోనూ తొందరపడకండి
కర్కాటకం
ఈరోజు మీకు శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు బదిలీలు ఉండే అవకాశం. ఓపికగా ఉండండి. మతపరమైన ప్రయాణం చేసే అవకాశం ఉంది. ప్రత్యర్థుల కారణంగా కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. సామాజిక స్థితి చక్కగా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
సింహం
పెండింగ్ పనులు సులువుగా పూర్తవుతాయి. మీరు సంతోషంగా ఉంటారు. కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గొప్ప బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ బంధువులను కలుస్తారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
కన్య
కొన్ని ఇబ్బందులు తప్పవు. సహోద్యోగుల సహకారంతో కార్యాలయంలో పనులు పూర్తిచేస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తవచ్చు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యంపై అవగాహన అవసరం. మీరు పెద్దల ఆశీస్సులు పొందుతారు. ప్రయాణాలు వాయిదా వేయండి. ప్రతికూల ఆలోచనలు రానీయవద్దు.
తులారాశి
ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఈరోజు ఖర్చులు అధికంగా ఉండొచ్చు. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. రెస్ట్ లెస్ గా పనిచేయొద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. రిస్క్ తీసుకోవడం మానుకోండి. వాహనాన్ని నెమ్మదిగా నడపండి.
వృశ్చికరాశి
మీ తోటివారి అభిప్రాయాలను గౌరవించండి..వినయంగా ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపారస్తులకు శుభసమయం. కార్యాలయంలో ఇబ్బందులు ఉండొచ్చు. ఉత్సాహంచో ముందుకు సాగితే...అదృష్టం కలిసొస్తుంది. స్నేహితులను కలుస్తారు. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు.
ధనుస్సు
విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. బాధ్యత పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పనిచేసే ప్రదేశంలో విజయం సాధిస్తారు. వృద్ధులకు సేవ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఒత్తిడి దూరమవుతుంది.
మకరం
ఈరోజు మీకు కలిసొచ్చే రోజు. వివాదాలు తొలగిపోతాయి..జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు శుభసమయం. నిరుద్యోగులకు కలిసొచ్చే కాలం...ఉద్యోగులకు ముందడుగేసేందుకు మంచి రోజు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
కుంభం
మీరు సానుకూలంగా ఉంటారు..అయినా మీ సలహాను ఎవ్వరూ గౌరవించరు. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. కార్యాలయంలో సవాళ్లు ఉండొచ్చు. శుభ ఫలితాలను పొందుతారు. పెద్దల సలహాలు తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. పూర్వీకుల విషయాలు పరిష్కారమవుతాయి.
మీనం
వ్యాపారస్తులకు కలిసొచ్చే కాలం. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు..విజయాన్ని అందుకుంటారు. సహోద్యోగుల సహాయంతో మీ బాధ్యతను నిర్వర్తిస్తారు. బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారమవుతాయి.
Also read: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..
Also Read: పక్కింట్లో పూలు కోసి పూజలు చేస్తున్నారా….అయితే మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి…
Also Read: వైవాహిక జీవితం - లైంగిక సంబంధాలు.. చాణక్యుడు చెప్పిన ఆసక్తికర అంశాలు