By: ABP Desam | Updated at : 20 Aug 2021 09:32 AM (IST)
వరలక్ష్మీ వ్రతం...పూజా విధానం
శ్రావణ మాసంలో మంగళవారం శ్రావణ గౌరీ వ్రతం, శుక్రవారం మహాలక్ష్మీ పూజలు ఎంతో ప్రత్యేకం. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం.
వరలక్ష్మీ వ్రత విధానం :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం పెట్టి అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రి, తోరణాలు, పసుపు గణపతిని సిద్ధం చేసుకోవాలి.
కావాల్సిన వస్తువులు
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపం కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు…ఇంకా ఎవరి శక్తికి తగిన వస్తువులు వాళ్లు సమకూర్చుకోవచ్చు..
తోరాలు ఎలా తయారుచేసుకోవాలంటే
తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. ఆ తోరాలను పీఠం వద్ద ఉంచి పూజకు సిద్ధంకావాలి.
గణపతి పూజ:-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి.
యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః , ఓం ఏకదంతాయ నమః , ఓం కపిలాయ నమః ,ఓం గజకర్ణికాయ నమః ,ఓంలంబోదరాయ నమః
ఓం వికటాయ నమః,ఓం విఘ్నరాజాయ నమః,ఓం గణాధిపాయ నమః,ఓంధూమకేతవే నమః,ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,ఓం ఫాలచంద్రాయ నమః,ఓం గజాననాయ నమః,ఓం శూర్పకర్ణాయ నమః,ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి …ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా.. ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః..అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమః - పాదౌ పూజయామి, చపలాయై నమః - జానునీ పూజయామి, పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి, మలవాసిన్యైనమః - కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః - ముఖంపూజయామి,
సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి, రమాయైనమః - కర్ణౌ పూజయామి, కమలాయైనమః - శిరః పూజయామి,
శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.
(ఆ తరువాత పుష్పాలు, పసుపు, కుంకుమతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః , ఓం వికృతై నమః , ఓం విద్యాయై నమః, ఓం సర్వభూత హితప్రదాయై నమః ,ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః , ఓం సురభ్యై నమః , ఓంపరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః , ఓంస్వాహాయై నమః , ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః ,ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః , ఓం లక్ష్మ్యై నమః , ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యైనమః, ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః , ఓం దీప్తాయై నమః, ఓం రమాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః , ఓంకామాక్ష్యై నమః, ఓం క్రోధ సంభవాయై నమః, ఓం అనుగ్రహ ప్రదాయై నమః , ఓంబుద్ధ్యె నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః , ఓం తుష్టయే నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓంలోకశోకవినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః , ఓంలోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓంపద్మముఖియై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః, ఓంపద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాదాభిముఖీయైనమః, ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓంచంద్రసహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః , ఓంఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః, ఓం శివాయై నమః, ఓం శివకర్యై నమః, ఓం సత్యై నమః , ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః, ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః, ఓం శాంత్యై నమః, ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః, ఓంభాస్కర్యై నమః, ఓం బిల్వ నిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓంహేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః, ఓం త్రైణసౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః, ఓం నృపవేశగతానందాయై నమః, ఓంవరలక్ష్మ్యై నమః , ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, ఓంహిరణ్యప్రాకారాయై నమః, ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః, ఓంమంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః, ఓం ప్రసన్నాక్ష్యైనమః, ఓం నారాయణసీమాశ్రితాయై నమః, ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః, ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః, ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః, ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః, ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః, ఓంభువనేశ్వర్యై నమః
కంకణపూజ :-
కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.
కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి, విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే వ్రత.
కథా ప్రారంభం :-
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.
పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.
పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు గోడలతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు ఉన్న యోగ్యురాలు. రోజూ తెల్లవారుజామునే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి…ఇంట్లో పనులు పూర్తిచేసుకుని అత్తమామల్ని సేవిస్తూ ఉండేది. వరలక్ష్మీదేవి ఒకరోజు చారుమతికి కలలో కనిపించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి…. ఈవిషయం అత్తింటివారికి చెప్పింది. శ్రావణ శుక్రవారం రోజున ఇరుగు పొరుగు ముత్తైవుదులను పిలిచి ఇంట్లోనే మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని షోడశోపచారాలతో పూజించింది. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు, రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు, మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వా భరణ భూషితులయ్యారట. వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతితో పాటూ ఆ వ్రతానికి వచ్చిన వారందరి ఇళ్లలో సకల భోగాలు వచ్చాయట. అప్పటి నుంచి వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు.
మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఎన్నో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి….
Friday Special: శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!
Chanakya Niti: చాణక్య నీతి - భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధమే
Bharani Nakshatra : ఈ నక్షత్రంలో జన్మించిన వారి వ్యూహరచన బావుంటుంది, సలహాదారులుగా బాగా రాణిస్తారు!
Love and Relationship Horoscope June 9: ఈ రాశివారు పాతప్రేమికులను కలుస్తారు
జూన్ 9 రాశిఫలాలు, ఈ రాశులవారికి సమయం అనుకూలంగా ఉంది తొందరపడకండి
సునీత పిటిషన్ స్వీకరించిన సుప్రీంకోర్టు- అవినాష్ ముందస్తు బెయిల్‌పై మంగళవారం విచారణ
టీడీపీకి మరో సన్‌స్ట్రోక్- చేరికలను వాయిదా వేసిన చంద్రబాబు
Priyanka Gandhi: 2024 ఎన్నికలకు దూరంగా ప్రియాంక గాంధీ! ప్రచారంపైనే ఫుల్ ఫోకస్
Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలు భారత్‌లోనే, 3 దశాబ్దాల తరవాత సర్‌ప్రైజ్