News
News
X

Food Habits: ఈ ఆహార నియమాలు పాటిస్తే మందులతో పనిలేదు…యోగశాస్త్రం ఏం చెబుతోంది….పురాణాలు ఏం చెబుతున్నాయి..

ఆహార నియమాలను సక్రమంగా పాటించే వ్యక్తికి ఔషధాల అవసరం ఏం ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏం ఫలితాన్నిస్తాయి. ఇంతకీ ఆహార నియమాలు ఎలాఉండాలి…పురణాలు, యోగశాస్త్రం ఏం చెబుతోంది…

FOLLOW US: 
Share:

పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:

వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత

న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి

అంటే రోగికి ఔషధాల అవసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .

రోగికి ఆహారంపై నియంత్రణ లేక పోతే అత్యుత్తమమైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .

అన్నం బ్రహ్మా రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః
ఇతి సంచింత్య భుంజానః అన్నదోషై ర్న లిప్యతే

ఈ అన్నమే బ్రహ్మ…ఇందులోని సారమే విష్ణువు…దీనిని భుజించేవాడు సాక్షాత్తూ మహేశ్వరుడే…ఇలా భావించి భుజించేవారికి అన్నదోషము అంటదని అర్థం.

దేవుడికి నివేదన చేయడానికి ముందు…విస్తరిలో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే నివేదనలో ముందుగా అన్ని వంటలు వడ్డించిన తర్వాత ఆఖరిలో ఉప్పు వేయాలి కానీ ప్రత్యేకంగా మాత్రం ఉప్పు వేయరాదని చెప్పారు…ఇక యోగశాస్త్రం ప్రకారం…

 • మానవుడి శ్వాసగతి 12 అంగుళాల వరకూ ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాలవుతుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. అందుకే ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదంటారు.
 • త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి రోజు కొబ్బరి తినకూడదు, పాడ్యమిరోజు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.
 • రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకునుగాని, పాత్రనుగాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.
 • రాత్రి భోజనం చేసేటప్పుడు తుమ్మితే…నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారం.
 • రాత్రి పెరుగు వాడకూడదు….ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.
 • రాత్రిళ్లు కాచిన పెరుగును అంటే మజ్జిగపులుసు వాడకూడదు
 • ఆవునేయి కంటికి మంచిది
 • ఆవు మజ్జిగలో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుంది, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుంది
 • నలుగురు కూర్చుని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు.
 • ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క చూస్తుండగా తినకూడదు
 • ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి .ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి. అంటే నోటిలోనే సగం నమలడం వల్ల లాలాజలం పూర్తిగా కలిసి , ముద్ద మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం  విరుగుడు గా పనిచేస్తుంది .
Published at : 10 Aug 2021 06:46 PM (IST) Tags: Food Habits follow these dietary rules No NeedTo Use medicines What does yoga say What do the myths say

సంబంధిత కథనాలు

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Vitamin D: మనదేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురికి విటమిన్ డి లోపం - చెబుతున్న టాటా ల్యాబ్స్ సర్వే

Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి

Periods: పీరియడ్స్ ఆలస్యం అవుతున్నాయా? ఈ ఐదు ఆహారాలూ సమయానికి వచ్చేలా చేస్తాయి

Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే

Leftover Food: మిగిలిపోయాయి కదా అని ఈ ఆహారాలను దాచుకొని తింటే అనారోగ్యమే

Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి

Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి

Deodorant Death: డియోడరెంట్ వాసనకు ఆగిన బాలిక గుండె - ఆ స్మెల్ అంత ప్రమాదకరమా?

Deodorant Death: డియోడరెంట్ వాసనకు ఆగిన బాలిక గుండె - ఆ స్మెల్ అంత ప్రమాదకరమా?

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!