News
News
X

Horoscope Today : ఈ రాశులవారికి పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి… ఆ ఆరు రాశులవారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 సెప్టెంబర్ 4 శనివారం రాశిఫలాలు

మేషం

ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. దీర్ఘకాలిక వ్యాధి కొంత ఇబ్బంది పెడుతుంది. తెలియని వ్యక్తులతో ఎక్కువ చర్చలు వద్దు. వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంలో శుభ కార్యాల నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు. ఆందోళన ఉంటుంది.

వృషభం

మతపరమైన ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అసహనానికి గురికావద్దు. ఉత్సాహం, కోపం రెండూ నియంత్రణలో ఉంచుకోండి. అన్నింటా విజయం సాధిస్తారు. ఆనందంగా ఉంటారు. జీవితాన్ని ఆనందించండి.

మిధునం

కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార ప్రణాళిక కార్యరూపం దాల్చుతుంది. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. ఒక పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది. కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకోకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి రిస్క్ తీసుకోకండి.

Also Read: త్రిశంకు స్వర్గం@ విశ్వామిత్ర క్రియేషన్స్...

కర్కాటకం

చాలా రోజులుగా చేతికి అందాల్సిన సొమ్ము అందుతుంది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. సంతోషంగా ఉంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు విజయం సాధిస్తారు. దుర్మార్గులకు దూంగా ఉండండి.

సింహం

కుటుంబం పట్ల ఆందోళన ఉంటుంది. అకస్మాత్తుగా కొత్త ఖర్చులు పెరుగుతాయి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. ఆస్తి సంబంధిత ఒప్పందాలు లాభాన్నిస్తాయి. రిస్క్ తీసుకోవద్దు. ఆధ్యాత్మికత వైపు ఆసక్తి చూపుతారు.

కన్య

ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రమోషన్ కోసం చేసిన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బహుమతులు అందుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు శుభసమయం. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. రోజంతా బిజీగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. టెన్షన్ పోతుంది.

Also Read: అన్నీ రుణానుబంధాలే…తస్మాత్ జాగ్రత్త..జాగ్రత్త….

తుల

బంధువులు ఇంటికొస్తారు. ప్రోత్సాహకరమైన సమాచారాన్ని పొందుతారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. అనవసర వివాదాలు వద్దు. జీవిత భాగస్వామితో అనుకూలత ఉంటుంది.

వృశ్చికం

రిస్క్ తీసుకోవడం ద్వారా కొన్ని పనులు పూర్తవుతాయి. ఎప్పటినుంచో రావాల్సిన మొత్తం చేతికందుతుంది. ఉత్సాహం పెరుగుతుంది. బాగా అలసిపోతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.  మీ నిర్లక్ష్యం కారణంగా నష్టపోతారు.

ధనుస్సు

బంధువు నుంచి దుర్వార్తలు వింటారు. దీర్ఘకాలిక వ్యాధి బయటపడొచ్చు. విలువైన వస్తువులను మీ వద్ద ఉంచుకోండి. ఆందోళన టెన్షన్ అలాగే ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.
Also read: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

మకరం

ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ప్రత్యర్థులపై మీరు పైచేయి సాధిస్తారు. కొత్త వ్యక్తులను కలుస్తారు. చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ఒక ప్రణాళికను రూపొందించవచ్చు. ఆకస్మిక పర్యటనకు వెళ్లే అవకాశం ఉంటుంది.

కుంభం

ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. మతపరమైన ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులతో సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజంతా బిజీ బిజీగా ఉంటారు. ప్రమాదకర పనులు చేయొద్దు. భాగస్వాముల నుంచి మద్దతు లభిస్తుంది.

మీనం

చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. వివాహ ప్రతిపాదనలు ముందుకు సాగుతాయి. స్నేహితులు, బంధువుల మద్దతు లభిస్తుంది. తొందరపాటు పనులతో ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది.  ఖర్చులను నియంత్రించండి.

Also Read: ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే..వాళ్లిద్దర్నీ కూడా కలిపేసుకున్నారు..

Also Read: భీమ్లా నాయక్‌ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!

Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!

Published at : 04 Sep 2021 06:21 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces 4 September 2021 Horoscope

సంబంధిత కథనాలు

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Navratri 2022: ఆకలి బాధలు తీర్చే అన్నపూర్ణ అష్టకం

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Numerology Today: ఈ తేదీల్లో పుట్టినవారు దూకుడు తగ్గించుకుంటే మంచిది,సెప్టెంబర్‌ 29 న్యూమరాలజీ

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today29th September: నవరాత్రుల నాలుగో రోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Navratri 2022: ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Navratri 2022:   ఈ విశ్వాన్ని సృష్టించిన అమ్మే కూష్మాండ దుర్గ, నవదుర్గల్లో ఈమె నాల్గవది

Zodiac signs: ఈ రాశులవారికి సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

Zodiac signs: ఈ రాశులవారికి  సిక్త్స్ సెన్స్ చాలా ఎక్కువ, మీరున్నారా ఇందులో!

టాప్ స్టోరీస్

KCR Temple Visits : జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

KCR Temple Visits :  జాతీయ పార్టీ ప్రకటనకు కేసీఆర్ సన్నాహాలు - సెంటిమెంట్ ఆలయాల వరుస సందర్శనలు !

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Prabhas: కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Minister Peddireddy : వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే రైతులు నష్టపోయేది ఏంలేదు- మంత్రి పెద్దిరెడ్డి

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన

Delhi Commission For Women: అత్యాచార బాధితులకు ఆ పరీక్ష తప్పనిసరిగా చేయాలి, ఢిల్లీ మహిళా కమిషన్ సూచన