అన్వేషించండి

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని చెప్పే మహా అద్భుత ఆలయాల్లో ఒకటి పూరీ జగన్నాథ్. అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం , దేవతలు , గంటలు , ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత ఉంది.

ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి..

పక్షులు ఎగరని ఆలయం..ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

అయోధ్యా మధురా మాయా

కాశీ కాంచీ అవంతికా

పూరీ ద్వారావతీచైవ

సప్తైతే మోక్షదాయకా!!

దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో పూరీ ఒకటి.  సోదరుడు బలభద్రుడితో, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు. పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాదిపాటు గర్భాలయంలో కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథాయాత్ర జరిగే రోజున తన సోదరి సుభధ్ర, సోదరుడు బలభద్రుడితో కలసి రథం అధిరోహిస్తాడు.

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదమైందని భక్తుల విశ్వాసం.  ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని  చెబుతారు.

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న  జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు.  విశ్వావసుడి కూతురైన లలితను...విద్యాపతి ప్రేమ వివాహం చేసుకుంటాడు.  జగన్నాథుడి విగ్రహాన్ని చూపించాలని మావగారైన విశ్వావసుడిని పదేపదే అడుగుతాడు విద్యాపతి. అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ గిరిజనరాజు...కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. తెలివిగా వ్యవహరించిన విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. ఈ మేరకు  రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి, అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా, జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప దుంగలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. 

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

 కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు.ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో రాచమందిరానికి చేరుకుంటాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. అందుకు అంగీకరించిన రాజు అటుగా ఎవ్వరూ వెళ్లకూడదని భటులను ఆదేశిస్తారు. రోజులు గడుస్తున్నా విశ్వకర్మ గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. లోపల శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను  8 నుంచి 12 లేదా 19 సంవత్సరాలకి ఓసారి మార్తి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టిస్తూ ఉంటారు . దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు . ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఏటా ఆషాడ శుద్ధ విదియ నాడు రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు కళ్లు చాలవు.

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

రథాయాత్ర సమయంలో  ఉత్స‌వ‌మూర్తులైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులను ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరిస్తారు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు రథంపై సిద్ధంగా ఉన్న ఉత్స‌వ‌మూర్తులకు… పూరీ సంస్థానాధీశులు నమస్కరించి…స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు.  అంతరం యాత్ర మొదలవుతుంది.

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

పూరీ జగన్నాథుడి ఆలయంలో ఎన్నో విశేషాలున్నాయి.  ఆలయ గోపురంపై ఉండే జెండా... వీచేగాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది. గోపురంపై ప్రతిష్టించిన సుదర్శన చక్రం ఎట్నుంచి చూసినా మనవైపే చూస్తున్నట్టు ఉంటుంది. ఈ ఆలయంపై పక్షలు ఎగరకపోవడం ఓ  వింత.  గోపురం నీడ... సూర్యోదయం-సూర్యాస్తమయం సమయంలోనూ ఎక్కడా కనిపించకపోవడం విశేషం. సాధారణంగా గాలి పగటిపూట సముద్రంపైనుంచి భూమిపైకి... సాయంత్రం భూమిపైనుంచి సముద్రంపైకి వీస్తుంది.  కానీ పూరీ క్షేత్రంలో దీనికి విరుద్ధంగా గాలి వీస్తుంది. స్వామి నివేదనకు ముందు ఎలాంటి వాసనా రాని ప్రసాదం నైవైద్యం సమర్పించిన తర్వాత ఘుమఘుమలాడిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రథయాత్ర ముగిసే గుండీచా ఆలయం వద్ద రథం తనంతట తానే ఆగిపోవడం స్వామివారి మహిమ.  

Puri Jagannath Temple History: ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి...పక్షులు ఎగరని ఆలయం.. ఎన్నో వింతలు..మరెన్నో ఊహకందని విశేషాలు....

జగన్నాథుడికి నివేదించే 56రకాల పదార్థాలు మట్టి కుండల్లోనే వండుతారు. ఆలయానికి అత్యంత సమీపంలో సముద్రం ఉన్నా లోపల అలల శబ్దాలు వినిపించవు.  ఇంకా ఎన్నో విశిష్టతలు, రహస్యాలు, మహిమలు కలిగిన పూరీక్షేత్రం మానవాళికి వరప్రసాదం...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget