Horoscope Today : ఈ రాశి ఉద్యోగులకు ప్రశంసలు.. ఆ రాశివారు దూకుడు తగ్గించుకోకపోతే సమస్యలు పెరుగుతాయి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
ఆగస్టు 26 గురువారం రాశిఫలాలు
మేషం
మీరు కార్యాలయంలో ప్రశంసలు అందుకుంటారు. ఇంటి పెద్దల ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఈ రోజు కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు. విద్యార్థులు మరింత కష్టపడాలి. సామాజిక సేవలో పాల్గొంటారు. ఉద్యోగాలు మారే అవకాశం ఉంది.
వృషభం
ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాలంటే క్రమశిక్షణ పాటించండి. బంధువుల నుంచి దుర్వార్తలు అందుతాయి. వ్యాపారులకు శుభసమయం. వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది. మీ ప్రవర్తనను అందరూ అభినందిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితుడిని కలుస్తారు.
మిథునం
మీరు శుభవార్త వింటారు. కొన్ని విషయాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ప్రయాణాలు పెట్టుకోవద్దు. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. పెద్దలతో మాట్లాడిన తర్వాత మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఇచ్చిన అప్పును తిరిగి పొందే అవకాశం ఉంది.
Also Read: ఈ రాశులవారు గతవారం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు... స్థిరాస్తి కొనుగోలుకి వారికి శుభ సమయం
Also Read: ఆగస్టు నెలలో ఏ రాశివారికి ఎలా ఉందంటే…. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే….
కర్కాటక రాశి
వ్యాపారంలో లాభం ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఆఫీసులో ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఒత్తిడి తీసుకోకండి. చాలా కాలంగా నిలిచిపోయిన పని ఈరోజు పూర్తి అవుతుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది. కుటుంబంలో సామరస్యం ఉంటుంది. బంధువులను కలుస్తారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. వ్యాపారం పురోగమిస్తుంది.
సింహం
ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్రుత, తొందరపాటుతో కొన్ని తప్పులు చేసే అవకాశం ఉంది.. మీ దూకుడు మీ సమస్యను తీవ్రతరం చేస్తుంది.మీ పని తీరుపై విమర్శలు ఎదుర్కొంటారు. మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
కన్య
పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యక్తులను కలిసిన తర్వాత మీ జీవితం మరో మలుపు తిరుగుతుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఏ వివాదంలోనూ తలదూర్చవద్దు.
Also Read: ఎవ్వరికీ చెప్పొద్దు... ఈ రాశుల వారు ఆ మూవీలో క్యారెక్టర్స్ టైపే... ఏ విషయం దాచలేరు..
Also Read: ఈ రాశుల వాళ్లు సీతయ్యలు…ఎవ్వరి మాటా వినరు
తులారాశి
మీ పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారం మందగించే అవకాశం ఉంది. పిల్లల వైపు నుంచి శుభవార్త అందుకునే సంకేతాలు ఉన్నాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచిరోజు. మనశ్శాంతిగా ఉంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
వృశ్చికరాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఓపని మీద ప్రయాణం చేస్తారు. మీ ప్రవర్తన ద్వారా ప్రశంసలందుకుంటారు. స్నేహితుల మద్దతు లభిస్తుంది. ఈ రోజు విద్యార్థులకు మంచి రోజు. ప్రమోషన్ ఉండొచ్చు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం తగదు.
ధనుస్సు
ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోండి. మీ పని ద్వారా ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. బద్ధకాన్ని వీడండి. కార్యాలయంలో సవాళ్లను ఎదుర్కోవచ్చు.
Also Read: ఈ రాశులవారు ప్రేమను కోరుకుంటారు…ఈ రాశుల వారు ఎంజాయ్ చేయాలనుకుంటారు…
Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…
మకరం
ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్యాలయంలో కొత్త సమాచారం అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ముందు, అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలను తప్పకుండా తీసుకోండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీ జీవిత భాగస్వామికి పూర్తి సమయం ఇవ్వండి. ఈరోజు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో వృద్ధి, పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. బాధ్యత నెరవేర్చనప్పుడు నిరుత్సాహపడకండి.
కుంభం
ప్రస్తుతానికి కొత్త పనులు ప్రారంభించవద్దు. నగదు దుర్వినియోగానికి దూరంగా ఉండండి. వ్యసనాలకు లోనుకాకండి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు పొందుతారు. ఈరోజు అవసరమైన వారికి సహాయం చేయండి. వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ఆలోచనలు వస్తాయి.
మీనం
కొత్త వ్యాపార ప్రతిపాదనలు చేయొచ్చు. పూర్వీకుల ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వివాదాలు ఉండొచ్చు. పొదుపు పథకంలో పెట్టుబడి పెట్టండి, ఇది రాబోయే రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు చాలా మంచి రోజును కలిగి ఉంటారు. కెరీర్‌లో ముందుకు సాగడానికి అనుభవజ్ఞులైన వారి నుంచి సహాయం పొందుతారు.