![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Weekly Horoscope 22 To 28 August 2021: ఈ రాశులవారు గతవారం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు... స్థిరాస్తి కొనుగోలుకి వారికి శుభ సమయం
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
![Weekly Horoscope 22 To 28 August 2021: ఈ రాశులవారు గతవారం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు... స్థిరాస్తి కొనుగోలుకి వారికి శుభ సమయం Weekly Horoscope 22 to 28 August aries, Gemini, libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Weekly Horoscope 22 To 28 August 2021: ఈ రాశులవారు గతవారం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు... స్థిరాస్తి కొనుగోలుకి వారికి శుభ సమయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/05/d0b57a8f38b9951add2e42d030032d15_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆగస్టు 22 నుంచి 28 వరకూ వారఫలాలు
మేషం
మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. స్నేహితుల సాయంతో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపారస్తులకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కలిసొచ్చే కాలం. ఏకాగ్రతతో పనులు చేస్తే ఫలితం ఉంటుంది. దగ్గరివారితో విభేదాలుండే అవకాశం… జాగ్రత్తగా ఉండండి. వారం మధ్యలో ఒక సమస్య ఉంటుంది. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి.
వృషభం
వృషభ రాశివారికి ఈ వారం బాగా కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు శుభసమయం. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. తీవ్ర ఒత్తిడికి గురికావొద్దు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి. కళారంగం వారు ఊహించని అవకాశాలు పొందుతారు. వారం ప్రారంభంలో వివాదాలుండే అవకాశం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.
మిథునం
మిథున రాశివారికి ఈ వారమంతా శుభమే. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్థిరాస్తి కొనుగోలుకి అనుకూల సమయం. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు ఉండొచ్చు.
కర్కాటకం
అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. రావలసిన సొమ్ము చేతికందుతుంది. కుటుంబంలో ఒత్తిడి నుంచి బయటపడతారు. చాలా కాలంగా వెంటాడుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. విఘ్నాలు తొలగుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. విమర్శలను పట్టించుకోకుండా ముందడుగేయండి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు,అనారోగ్య సూచనలు.
Also Read: శ్రీమహాలక్ష్మి, ద్రౌపది మొదలు యుగాలను దాటుకుని వచ్చిన పండుగ ఇది..
సింహం
సింహరాశి వారికి ఈ వారమంతా శుభమే. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన కొత్త పనుల్లో విజయం సాధిస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకునేందుకు శుభసమయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు జోరందుకుంటాయి. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది. వారం చివరిలో సోదరులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. అనుకోని ఖర్చులు ఉండే అవకాశం.
కన్య
కన్య రాశివారికి ఈ వారం మిశ్రమఫలితాలున్నాయి. ముఖ్యమైన విషయాలపై నిర్లక్ష్యం వద్దు. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం ఉంటుంది. పనులు సమయానికి పూర్తిచేస్తార. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వారం చివరిలో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందలుండొచ్చు.
తుల
ఈవారంలో తులరాశి వారికి అన్నీ అనుకూల ఫలితాలే. వేసుకున్న ప్రణాళికల ప్రకారం పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులకు శుభ సమయం. వ్యాపారస్తులకు కలిసొస్తుంది. ఉద్యోగస్తులు చిన్న చిన్న అవాంతరాలను అధిగమిస్తారు. మీ వల్ల కొందరు లాభపడతారు. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తోన్న ఫలితం ఈ వారం వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు.
వృశ్చికం
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. చేపట్టిన పనులు సమయానికి పూర్తిచేస్తారు. ప్రయత్నలోపం లేకుండా చేస్తే విజయాన్నందుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులు శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. పెద్దల ఆశీస్సులు మీకు ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకునేందుకు ఇదే శుభసమయం. మాటకారితనంతో శత్రువులను కూడా మెప్పిస్తారు. వాహన, గృహం కొనుగోలుకు అడుగులు ముందుకు పడతాయి.
ధనుస్సు
ధనస్సు రాశివారు ఈ వారం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాల్లో బదిలీలు తప్పకపోవచ్చు. కళారంగం వారికి గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసర వివాదాలు, అపార్థాలకు తావివ్వొద్దు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపండి.
Also Read: రాఖీ పౌర్ణమి రోజు మరో విశిష్టత హయగ్రీయ జయంతి.. విద్యార్థులకు చాలా ముఖ్యమైన రోజు
మకరం
గతవారం ఎదుర్కొన్న సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. మనోబలంతో ఉత్తమ ఫలితాన్ని సాధిస్తారు. ప్రారంభించిన పనుల్ని మధ్యలో ఆపకుండా పూర్తిచేయండి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో మరింత సఖ్యత ఉంటుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగస్తులు ఉత్సాహంగా ఉంటారు. పారిశ్రామికవర్గాల కృషి మరింత ఫలిస్తుంది. వారం చివరిలో సోదరుల నుంచి కొన్ని సమస్యలు ఉండే అవకాశం.
కుంభం
కుంభ రాశివారికి ఈ వారం బాగానే ఉంటుంది. మనసుపెట్టి చేసిన పనుల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. మాటలో స్పష్టత కారణంగా ఎన్నో అపార్థాలు తొలగిపోతాయి. విఘ్నాలు లేకుండా పనులు పూర్తిచేయాలి. వారాంతంలో శుభ ఫలితాలు అందుకుంటారు.చిన్ననాటి మిత్రులతో సంతోష సమయం గడుపుతారు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులుంటాయి.
మీనం
మీనరాశివారి ఈ వారం ప్రశాంతం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయండి. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. ఉద్యోగస్తులకు పనిభారం కొంతవరకూ తగ్గొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు ఉండొచ్చు.
Also Read: శ్రావణ పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ ప్రతి రోజూ ప్రత్యేకమే…
Also Read: అన్నీ రుణానుబంధాలే…తస్మాత్ జాగ్రత్త..జాగ్రత్త….
Also Read: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)