అన్వేషించండి

Horoscope Today: నేటి రాశిఫలాలు (07-05-2024) - ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు

Daily Horoscope: మే 7 ఏ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి, ఏ రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయో ఇక్కడ తెలుసుకోండి...

Daily Horoscope -  రాశిఫలాలు (07-05-2024)

మేష రాశి

మేష రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కొత్త ఆదాయ వనరుల కోసం వెతకడం ప్రారంభించండి. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది.  ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొంతమంది పాత మిత్రులను కలుస్తారు. కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.  

వృషభ రాశి

పాత పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉంటాయి. కొందరు వ్యక్తులు ఆస్తిని విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. విద్యార్ధులు  సంతోషకరమైన ఫలితాలను పొందుతారు.  

Also Read: సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!

మిథున రాశి

ఈ రోజు ఆర్థిక విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి. కుటుంబ జీవితంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.   చిన్న చిన్న ఆనందాలని ఆస్వాదించండి. ఈ రోజు మీ వ్యక్తిగత , వృత్తి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు ఉంటాయి.  

కర్కాటక రాశి

మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆర్థిక విషయాలలో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంతో కలసి ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శిస్తారు. భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు ప్లాన్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్‌లో ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబంలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి. 

సింహ రాశి

సింహ రాశి వారికి ఈరోజు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది.  మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడతారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. యోగా, ధ్యానంపై దృష్టి సారించండి.

Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు - ఈ పండుగ ప్రాముఖ్యత ఏంటి , ఈ రోజు ఏం చేయాలి!

కన్యా రాశి

వ్యక్తిగత , వృత్తి జీవితంలో సమతుల్యతను కాపాడుకోండి. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.  మీ కెరీర్ లక్ష్యాలను సాధించడంలో మీరు విజయం సాధిస్తారు. సవాళ్లకు భయపకుండా దూసుకెళ్లండి. మీ అంతర్ దృష్టిని విశ్వసించండి. 

తులా రాశి 

ఈ రాశివారి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.  ఈరోజు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించి చాలా కాలంగా ఉన్న వివాదాల నుంచి  ఉపశమనం పొందుతారు. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించుకుంటారు. అనవసరమైన కోపం,  చర్చలకు దూరంగా ఉండాలి. అదనపు ఖర్చులుంటాయి. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఉద్యోగులకు పని ప్రదేశంలో ఒడిదొడుకులు ఉంటాయి. రియల్ ఎస్టేట్ , స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు మంచి రోజు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.  ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అనేక ఆదాయ వనరుల నుంచి డబ్బు పొందుతారు. 

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!

ధనస్సు రాశి

ఉద్యోగ, వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మాటలో సౌమ్యత ఉంటుంది. కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.  ఉద్యోగంలో స్థలం మారే అవకాశాలు ఉన్నాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.  

మకర రాశి

ఈ రోజు మీరు విశ్వాసంతో ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. వృత్తి జీవితంలో నెట్ వర్క్ పెరుగుతుంది. సోదరుడు లేదా సోదరితో విభేదాలు ఉండవచ్చు. కెరీర్ సంబంధిత నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఈ రోజు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది.  మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం ద్వారా మీ మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. 

కుంభ రాశి

ఈ రోజు  అధిక ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి.  కార్యాలయంలో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి.  అంకితభావంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. మీ పనితీరుకి ప్రశంసలు అందుతాయి.

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

మీన రాశి

ఈ రోజు మీకు శుభదినం. కార్యాలయంలో అవసరమైన మార్పులకు సిద్ధంగా ఉండండి.  కొందరి ఉద్యోగాన్వేషణ పూర్తవుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం ఉంటుంది. సామాజిక హోదా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కష్టపడి చేసిన పనిలో మంచి ఫలితాలు పొందుతారు.

గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
సజ్జలకే కిరీటం - వైసీపీలో ముసలం ! ఆ సీనియర్లంతా సైలెంటేనా ?
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Pondicherry Trip : హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
హైదరాబాద్​ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్​కి ప్లాన్ ఇదే
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Weak Passwords: ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
ఫోన్‌లో ఈ పాస్‌వర్డ్ పొరపాటున కూడా పెట్టుకోకండి - హ్యాక్ చేయడానికి సెకన్లు చాలు!
Winter Driving Tips: పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? - ఫాలో అవ్వకపోతే ప్రమాదంలో పడ్డట్లే!
Pawan Kalyan: తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
తిరుపతి ప్రజలకు ఆ రోజు శ్రీవారి దర్శనం - టీటీడీ నిర్ణయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం
Embed widget