News
News
X

Horoscope Today 6th December 2022: ఈ రోజు ఈ రాశివారి జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది, డిసెంబరు 6 రాశిఫలాలు

Horoscope Today 6th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 6th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు. కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఈ రోజు మీరు మీ దినచర్య నుంచి కొంత విరామం తీసుకుని స్నేహితులతో టైమ్ స్పెండ్ చేస్తారు.సమయం, పని, డబ్బు, స్నేహితులు, సంబంధాలు అన్నీ ఒకవైపు మరియు మీ ప్రేమ మరోవైపు, రెండూ ఒకదానికొకటి కోల్పోయాయి.

వృషభ రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. పిల్లలతో కలిసి బయటకు వెళతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశి విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని కనబరుస్తారు. కొన్ని కొత్త మార్పులు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

మిథున రాశి 
ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు కానీ పనిఒత్తిడి పెరుగుతుంది. కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు. మీ జీవితంలో పెద్ద మార్పు రాబోతోంది. కోర్టు కార్యాలయ పనుల్లో జాగ్రత్తగా ఉండండి.

Also Read: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

కర్కాటక రాశి
వ్యక్తిత్వ వికాస పనిలో మీ శక్తిని ఉంచడం ద్వారా మరింత మెరుగుపడతారు. నూతన పెట్టుబడులు పెట్టేముందు తొందర పడొద్దు.  అన్ని కోణాల నుంచి పరిశీలించి పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతారు. పిల్లల వైపు నుంచి  శుభవార్త వింటారు

సింహ రాశి
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా మీతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. ఎవరికైనా మీ సలహా అడిగినప్పుడు మాత్రమే ఇవ్వండి..వేరేవారి విషయాల్లో అనవసరంగా కల్పించుకోవద్దు. కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు ఉండవచ్చు. పనిలో జాప్యం ఉంటుంది. ఓర్పు, సంయమనంతో పని చేయండి

కన్యా రాశి
ఈ రోజు వాహనాన్ని జాగ్రత్తగా నడపండి, ప్రతి సందర్భంలోనూ మర్యాదగా ఉండండి. ఉద్యోగం, వ్యాపార రంగంలో మీ స్థానం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. స్నేహితులు, బంధువులతో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. ప్రేమ సంబంధాలలో భాగస్వాముల మధ్య కొత్త ఉత్సాహం ఉంటుంది.

తులా రాశి
మీ కొత్త ప్రణాళికలు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ అవి ఆశించినంత స్థాయిలో ఫలితాలనివ్వవు. పెట్టుబడి పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. మీ మనసులో ప్రేమను తెలియజేసేందుకు మంచి రోజు. 

Also Read: ఈ రాశివారు దుష్టుల సహవాసానికి దూరంగా ఉండాలి, డిసెంబరు నెల రాశిఫలాలు

వృశ్చిక రాశి
ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. మీ ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతుంది. ఆఫీసులో మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఒక పెద్ద విషయంలో ప్రశాంతంగా ఆలోచించడం మంచిది.

ధనుస్సు రాశి
ఈ రోజు ప్రారంభంలో మీరు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది. మీ ప్రియమైన వారితో రహస్య విషయాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. అదృష్టం కలిసొస్తుంది.

మకర రాశి
జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి, మీ ఆశయాలను అదుపులో ఉంచుకోండి. యోగా చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఊహాగానాలను నమ్మకనండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త.

కుంభ రాశి
ఈ రోజు మీకు ఇష్టమైన రోజు అవుతుంది. మీ రంగంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. గొప్ప ప్రయోజనం పొందుతారు. అనుభవజ్ఞుడైన వ్యక్తి సహాయంతో మీరు ద్రవ్య ప్రయోజనాలను పొందుతారు. ఈ రాశికి చెందిన వివాహితులు ఈరోజు ఎక్కడికైనా వెళ్లవచ్చు. మీరు పిల్లల నుంచి పూర్తి మద్దతు పొందుతారు.

మీన రాశి
చాలా కాలంగా కొనసాగుతున్న గందరగోళం ఈరోజుతో తీరిపోయి నిరాశా నిస్పృహలు తీరిపోతాయి. మీరిచ్చే సలహాలు పలువురుకి ఉపయోగపడతాయి. మీ జీవిత భాగస్వామి  మానసిక స్థితి బాగానే ఉంటుంది..వారి నుంచి ప్రేమను పొందుతారు. వ్యాపారులు కొత్త ప్రయోగాలు చేస్తారు.

Published at : 06 Dec 2022 05:35 AM (IST) Tags: Horoscope Today Aaj Ka Rashifal astrological predictions Astrological prediction for December 6 6th December Rashifal Horoscope Today 6th December 2022

సంబంధిత కథనాలు

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Pratigya Mahabharat: భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి - ఇంతకీ భీష్ముడు ఏం సందర్భంలో ఏమని ప్రతిజ్ఞ చేశాడు!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Bhishma Ashtami 2023:అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Srimad Bhagavatam:పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 రాశి ఫలాలు

Weekly Horoscope 30 January to 5 February 2023: ఈ వారం ఈ రాశులవారికి అనుకూలం, ఆ రాశులవారికి ప్రతికూలం- జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5  రాశి ఫలాలు

Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు

Horoscope Today 29th January 2023: ఈ రాశులవారు ఈరోజు ఏం చేసినా మంచి ఫలితమే వస్తుంది, జనవరి 29 రాశిఫలాలు

టాప్ స్టోరీస్

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్

IND vs NZ 2nd T20: బౌలింగ్ అద్భుతం - 99 పరుగులకే పరిమితమైన కివీస్!

IND vs NZ 2nd T20: బౌలింగ్ అద్భుతం - 99 పరుగులకే పరిమితమైన కివీస్!

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?

మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?