News
News
X

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Horoscope Today 4th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రోజు మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. పెద్దల ఆశీర్వాదంతో, మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు. తప్పుడు విషయాలవైపు అట్రాక్ట్ కాకుండా ఉండడమే మంచిది. మీ కుటుంబ సభ్యుల్లో అనారోగ్యంతో ఉన్నవారు ఈ రోజు కోలుకుంటారు. భవిష్యత్ కోసం పెద్ద పెట్టబుడులు పెట్టేందుకు ఇదే మంచిసమయం. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు.

వృషభ రాశి
ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మంచి ఆలోచనతో మీ రంగంలో మీరు రాణిస్తారు. ఎప్పటి నుంచో అనుకున్న కల ఈ రోజు నెరవేరుతుంది. ఆదాయ వ్యయాల్లో సమతుల్యత పాటించకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు పడతారు. వివాహితులు కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏదైనా పనిగురించి మరీ ఎక్కువగా ఆలోచించకండి. 

మిథున రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు. ఇంట్లో బయటా ఎవరితోనూ వాదనలకు దిగకుండా ఉండడం మంచిది. దీర్ఘకాలంగా ఉండిపోయిన పనులును పూర్తిచేసేందుకు మీవంతు కృషి చేస్తారు. సహోద్యోగి మద్దతుతో దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఇంటి సమస్యలు మీ జోక్యంతోనే పూర్తవుతాయి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఇచ్చినా అవి తిరిగి రావని గుర్తుంచుకోవాలి.

Also Read: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

కర్కాటక రాశి
ఈ రోజు మీకు ఫలవంతమైన రోజు. ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తిచేయాలి లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు. పని ఒత్తిడి వల్ల అలసిపోతారు. స్నేహితులను కలుస్తారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదో విషయంలో కోపంగా ఉంటారు

సింహ రాశి
ఈ రాశివారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన  పనులు ప్రారంభించవచ్చు. కుటుంబంలో ఒక ప్రత్యేక పనికి మీరు సంతోషంగా ఉంటారు. రాజకీయ రంగాలలో పనిచేసే వ్యక్తులకు గుర్తింపు పెరుగుతుంది. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యమైన పనిలో ఏదైనా సమస్య ఎదుర్కొంటే దాన్నుంచి ఈ రోజు బయటపడతారు. 

Also Read: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

కన్య రాశి
ఈ రోజు  మీకు ముఖ్యమైన రోజు. మీ ఖర్చులుపై శ్రద్ధ వహించకపోతే సమస్య ఉండొచ్చు. కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలు తగ్గుతాయి. ఇరు పక్షాలు చెప్పిన మాట విని నిర్ణయం తీసుకోండి లేదంటే సమస్య ఉండొచ్చు. మీ స్నేహితుల్లో ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చాలి. మీరు మీ భాగస్వామితో కలిసి వ్యాపార ప్రణాళికలను రూపొందిస్తే, అది మీకు మంచి జరుగుతుంది. ఈ రోజు కొన్ని భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించవచ్చు. 

తులా రాశి
ఈ రాశివారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడతారు. ఉద్యోగం కోసం చూస్తున్న యువకులు కొన్ని మంచి అవకాశాలను పొందవచ్చు. మీరు  కోపాన్ని నియంత్రించుకోవాలి. మతపరమైన కార్యకలాపాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి.  ఖర్చులు చూసుకోవాలి.  వ్యాపార సంబంధిత పనులు కలిసొస్తాయి. 

వృశ్చిక రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో నిలిచిపోయిన మీ డబ్బును పొందడంలో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది..కానీ కుటుంబంలో సమస్యల కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు. ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కోవచ్చు. బిజీగా ఉండడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతారు. వ్యాపారంలో ఏ నిర్ణయాన్నైనా మీరు ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. భాగస్వామ్యంతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటే అది మీకు మంచిది 

ధనుస్సు రాశి
ఈ రోజు మీకు  ఫలవంతమైన రోజు. పాత స్నేహితులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు  ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను సకాలంలో పూర్తి చేయాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సామాజిక సేవలో పూర్తి మద్దతు ఇస్తారు. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి ఆలోచించకపోతే అదే మీకు ఫ్యూచర్లో సమస్యగా మారొచ్చు. ప్రతికూల ఆలోచనలను మనసులో ఉంచుకోకుండా ఉండాలి లేకపోతే  ఇబ్బందులుండొచ్చు. 

మకర రాశి
అధిక పనిభారం కారణంగా కలత చెందుతారు. ఇతరులపై ఆధారపడటం కంటే మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరుతుంది. ఈ రోజు అప్పు తీసుకోవద్దు..లేదంటే ఇబ్బంది పడతారు. మీ పిల్లల  భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మీ మనస్సులో విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు..దాన్ని వారు అవకాశంగా చేసుకుంటారు.

కుంభ రాశి
మీకు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటే మీరు వాటిని చాలావరకు పరిష్కరించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది . జీవిత భాగస్వామితో వివాదం సమసిపోతుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వినవచ్చు. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్తగా ప్రారంభించేపనులు వాయిదా వేసుకోవడం మంచిది.

మీన రాశి
ఈ రోజు మీకు కొన్ని సమస్యలు వెంటాడతాయి. ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతారు. తప్పుడు పనుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇరుక్కుపోతారు. ఉద్యోగులు తమలో దాగిఉన్న ప్రతిభను వెలికితీస్తారు. మీ సామర్థ్యానికి అనుగుణంగా పని పొందుతారు. మీ దినచర్యలో కొన్ని మార్పులు చేస్తే దానివల్ల సమస్యలు ఎదుర్కొంటారు. మీలో ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా ఉంటుంది. 

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 04 Dec 2022 05:30 AM (IST) Tags: Horoscope Today Aaj Ka Rashifal astrological predictions Astrological prediction for December 4 4th December Rashifal Horoscope Today 4th December 2022

సంబంధిత కథనాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా  చదువుకోవాల్సిన  శ్లోకాలు

Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు

Ratha Saptami 2023 Wishes In Telugu: జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Ratha Saptami 2023 Wishes In Telugu:  జనవరి 28 శనివారం రథసప్తమి సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Love Horoscope Today 28th January 2023: ఈ రాశులవారి వైవాహిక జీవితంలో టెన్షన్ తప్పదు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Horoscope Today 28th January 2023: ఏదైనా భిన్నంగా చేసే అలవాటు ఈ రాశివారిని ప్రత్యేకంగా నిలుపుతుంది, జనవరి 28 రాశిఫలాలు

Spirituality: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

Spirituality: ఈ రెండు తిథుల్లో ఏ పని ప్రారంభించినా అడ్డంకులు, అష్టకష్టాలు తప్పవా!

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!