By: RAMA | Updated at : 28 Nov 2022 06:13 AM (IST)
Edited By: RamaLakshmibai
December 2022 Horoscope (Image Credit: Freepik)
December 2022 Horoscope: డిసెంబరు నెలలో మేష రాశి నుంచి కన్యారాశివరకూ ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి...
మేష రాశి
మేష రాశివారికి డిసెంబరు నెల మిశ్రమ ఫలితాన్నిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో హడావుడిగా ఉంటారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సంఘంలో పెద్దవారిని కలుస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
వృషభ రాశి
ఈ రాశివారికి కూడా డిసెంబరు నెలలో గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. బుధుడు, శుక్రుడు, సూర్యుడు రాశి మారుతున్నందున ఈ రాశివారిపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.స్థిరాస్తి విషయాలలో నిరాశ ఉండవచ్చు. పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్నవారు ఇంకొంత కాలం ఆగడం మంచిది. పరిస్థితులు పెద్దగా అనుకూలించవు.. ప్రతి విషయంలోనూ వ్యతిరేకత ఎదురవుతుంది. నమ్మినవారి వలన మోసపోతారు, మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగులకు స్థాన చలనం ఉండొచ్చు. వ్యసనాల ద్వారా ధన వ్యయం అవుతుంది
మిథున రాశి
మిథున రాశివారికి కూడా డిసెంబరు మిశ్రమ ఫలితాలనే ఇస్తోంది. వక్రంలో కుజుడి సంచార ప్రభావం మీపై ఉంటుంది. వృత్తి రీత్యా పర్వాలేదు అనిపించినా..ధన వ్యయం విపరీతంగా ఉంటుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. బంధు మిత్రులత విరోధాలు, సోదర నష్టం ఉండొచ్చు. వాహనం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి.
Also Read: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు
కర్కాటక రాశి
ఈ నెల కర్కాటక రాశివారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంది. కెరీర్ పరంగా అనుకూల ఫలితాలున్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. మీ మాటలు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సరిగ్గా ప్లాన్ చేసుకోపోవడం వల్ల రాబడికి మించిన ఖర్చులుంటాయి. వైవాహిక బంధం దృఢంగా ఉంటుంది కానీ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో మాటలు పడక తప్పదు. ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం కాదు.
సింహ రాశి
సింహరాశివారు డిసెంబరు నెలలో ఆదాయానికి కొంత ఇబ్బంది పడతారు. చేసే వృత్తి వ్యాపారాలు అంతగా కలసి రావు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనోధైర్యం కోల్పోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో విబేధాలు ఉండొచ్చు. వాహనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రావాల్సిన బాకీలు వసూలు కావు కానీ చెల్లించాల్సినవి మాత్రం తప్పదు. బంధువులు, స్నేహితులతో భేదాభిప్రాయాలు రావొచ్చు..
Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు
కన్యా రాశి
డిసెంబరు నెల కన్యారాశివారికి అత్యద్భుతంగా ఉంది. ఆస్తులు కలిసొస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి, పిల్లల వల్ల సంతోషంగా ఉంటారు. అధికార అనుగ్రహం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. బంధువర్గంలో ఆధిక్యత ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లాభాలుంటాయి. అనుకున్న పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వస్తు, వస్త్ర లాభాలున్నాయి..
మిగిలిన రాశిఫలాలు తర్వాతి కథనంలో......
2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
K. Viswanath: నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన - కళాతపస్వి సినిమాలు సర్వం శివమయం
K. Viswanath: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు
Love Horoscope Today 03 February 2023: ఈ రాశివారు తమకన్నా పెద్దవారి పట్ల ఆకర్షితులవుతారు
Horoscope Today 03rd February 2023: ఈ రాశులవారు కాస్త సున్నితంగా మాట్లాడేందుకు ప్రయత్నించండి, ఫిబ్రవరి 3 రాశిఫలాలు
ప్లేట్ లో మూడు రొటీలు వడ్డించ కూడాదా?
కోటం రెడ్డిపై మొదటి నుంచీ అనుమానాలు- ఆసక్తికర విషయాలు చెబుతున్న సహచరులు!
Michael Movie Review - 'మైఖేల్' రివ్యూ : 'పంజా' విసిరిన సందీప్ కిషన్ - సినిమా ఎలా ఉందంటే?
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
Hanuma Vihari: శెబ్బాష్ హనుమ విహారీ! మణికట్టు విరిగినా ఆంధ్రా కోసం బ్యాటింగ్ చేశాడు!