Horoscope Today 26th September 2022: ఈ నాలుగురాశుల వారిపై దుర్గామాత ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 26 రాశిఫలాలు
Horoscope Today 26 September :ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
26 September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం
విదేశీ పర్యటనలకు వెళ్లాలి అనుకున్నవారు ఆ దిశగా ప్రయత్నాలు చేయొచ్చు. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు తమ కెరీర్‌లో మరింత చురుగ్గా ఉండేందుకు మంచి అవకాశాలు పొందుతారు. తగాదాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబం సభ్యుల సలహాలు,సూచనలు స్వీకరించండి.
వృషభం
ఈ రోజు మీ కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో వ్యాపార సంబంధిత ఒప్పందంపై డిస్కస్ చేస్తారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు కష్టపడి పనిచేస్తేనే లాభాలు అందుకుంటారు.ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులు ఇంకొంత కాలం ఎదురుచూడాల్సిందే.
మిథునం
ఆర్థిక పరంగా ఈ రోజు మీకు మంచి రోజు. కార్యాలయంలో అడపాదడపా డబ్బు పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయాలు మీలోనే ఉంచుకోవడం మంచిది. వ్యాపారులు నూతన భాగస్వాములను చేర్చుకునేందుకు ఇదే మంచి సమయం. ఆధ్యాత్మిక ప్రయాణం మీకు కలిసొస్తుంది. ఆరోగ్యం పరంగా ఈరోజు కొద్దిగా బలహీనంగా ఉంటుంది.
కర్కాటకం
ఎప్పటినుంచో ఆగిపోయిన పని పూర్తికావడంతో మీరు సంతోషంగా ఉంటారు. ఏదైన ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే తప్పనిసరిగా మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. విద్యార్థులు కష్టపడితేనే విజయం సాధిస్తారు. ఉద్యోగులు సంతోషంగా పనిచేస్తారు. ఉన్నతాధికాలు సహకారం మీకుంటుంది. ఎలాంటి క్లిష్టపరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఉండాలి. మీరు డబ్బుతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి
Also Read: శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పారాయణం చేయాల్సినవి ఇవే
సింహం
ఈరోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. మీరు వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణించవలసి రావచ్చు. ఉద్యోగుల సమస్యలు తీరుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీరు సవాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.
కన్య
ఈ రోజు మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడం వల్ల పాత కలహాలన్నీ తొలగిపోతాయి. మీ మనస్సులో సానుకూల ఆలోచనలు ఉంటాయి. మీ ప్రత్యర్థుల్లో కొందరు మీ స్నేహితులుగా మారడం చూసి ఆశ్చర్యపోతారు. ఎవ్వరూ అడగకుండా సలహాలు ఇవ్వకండి. విహారయాత్రకు వెళ్లాలనే ప్లాన్ ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
తులా
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు సువర్ణావకాశం లభిస్తుంది. క్రీడలు లేదా మరేదైనా పోటీలో పాల్గొనబోయే విద్యార్థులు కూడా ఈ రోజు మంచి స్థానాన్ని పొందవచ్చు. సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తులకు ఆదరణ పెరగుతుంది. ఏదైనా సమస్యను పరిష్కరించడంలో తల్లిదండ్రులు మీకు సహాయపడగలరు.
వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు. నిన్న మొన్నటి వరకూ అస్సలు తెగని ఆలోచనలు అకస్మాత్తుగా పూర్తవుతాయి. మీకు అత్యంత సంతృప్తిని కలిగించే పనులపై దృష్టి పెడితే ఈజీగా పూర్తవుతాయి. అధిక పని కారణంగా అలసిపోతారు. తగిన విశ్రాంతి చాలా అవసరం. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుంది.
Also Read: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!
ధనస్సు
ఈరోజు మీ ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మానసిక ఒత్తిడి కారణంగా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేరు. కార్యాలయంలో మీరు ఒత్తిడిని జయించేలా ఉండాలి. మాటల సౌమ్యత ఈరోజు మీకు గౌరవాన్ని తెస్తుంది. తోబుట్టువులతో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి.
మకరం
మకర రాశివారికి ఈ రోజు ముఖ్యమైన రోజు. పెండింగ్ పనులు, కొత్తగా తలపెట్టిన పనులు పూర్తవుతాయి.స్టాక్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు మంచి లాభాలను ఆర్జించగలరు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీరు పోగొట్టుకున్న ప్రేమను తిరిగి పొందుతారు.
కుంభం
ఈ రోజు మీరు కష్టాల్లో ఓపిక పట్టవలసి ఉంటుంది. మీ శక్తిని మంచి పనులలో ఉంచినట్లయితే అది మీకు చాలా మంచిది. పై అధికారుల నుంచి ప్రశసంలు అందుకుంటారు. వ్యాపారం చేసే వ్యక్తులు తమ మనసులో ఉన్న ఆలోచనలను ఎవరికీ చెప్పకూడదు. ఏదైనా పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు అందులో విజయం సాధిస్తారు. టెక్నాలజీతో అనుబంధం ఉన్న వ్యక్తులు ఈరోజు సువర్ణావకాశాన్ని పొందడం ఆనందంగా ఉంటుంది.
మీనం
సామాజిక రంగంలో పనిచేసే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు తమ మాటతీరుతో అందర్నీ మెప్పిస్తారు. కొన్ని అడ్డంకులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కానీ వాటినుంచి బయటపడగల సత్తా మీకుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కుటుంబ సభ్యులతో ముందుగా చర్చించండి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లానే చేసుకోవచ్చు.