అన్వేషించండి

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పారాయణం చేయాల్సినవి ఇవే

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది...అందుకే రోజుకో శ్లోకం, అష్టోత్తరంతో స్తుతిస్తారు. మొదటి రోజు పారాయణం చేయాల్సినవి దుర్గా అష్టోత్తరం, శ్రీ దుర్గా కవచం...

నమస్తే శరణ్యే శివేసానుకమ్పే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే
నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే॥
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. ఈ రూపంలో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా రెట్టింపు కాంతితో, ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయతో దర్శనమిస్తుంది. సింహవాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ ఆయుధాలు ధరించి ఉంటుంది. స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే సకల విజయాలూ చేకూరుతాయని చెబుతారు. ఈ రోజు అమ్మవారిని పూజించి...దుర్గా అష్టోత్తరం, దుర్గా కవచం పారాయణం చేయాలి.

Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం

శ్రీ దుర్గా దేవి కవచం (Sri Durga Kavacham)

శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సంకటాత్ || 

అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ |
న చాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ || 

ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ |
చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ||

సుగన్ధా నాసికం పాతు వదనం సర్వధారిణీ |
జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా || 

అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ || 

కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ || 

ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తు తే || 

Also Read:  శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!
దుర్గా అష్టోత్తరం
ఓం దుర్గాయై నమః  
ఓం శివాయై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం చండికాయై నమః
ఓం సర్వఙ్ఞాయై నమః
ఓం సర్వాలోకేశ్యై నమః
ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః
ఓం సర్వతీర్ధ మయాయై నమః
ఓం పుణ్యాయై నమః
ఓం దేవ యోనయే నమః
ఓం అయోనిజాయై నమః
ఓం భూమిజాయై నమః
ఓం ఆధారశక్త్యై నమః
ఓం అనీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిరహంకారాయై నమః
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః
ఓం సర్వలోకప్రియాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం సర్వవిధ్యాది దేవతాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం వనీశ్యై నమః
ఓం వింధ్య వాసిన్యై నమః
ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః
ఓం కోటిసూర్య సమప్రభాయై నమః
ఓం దేవతాయై నమః
ఓం వహ్నిరూపాయై నమః
ఓం సతేజసే నమః
ఓం వర్ణరూపిణ్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః
ఓం గుణమధ్యాయై నమః
ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం కర్మఙ్ఞాన ప్రదాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం సర్వసంహార కారిణ్యై నమః
ఓం ధర్మఙ్ఞానాయై నమః
ఓం ధర్మనిష్టాయై నమః
ఓం సర్వకర్మవివర్జితాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం కామాసంహంత్ర్యై నమః
ఓం కామక్రోధ వివర్జితాయై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శాంభవ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం చంద్రసుర్యాగ్నిలోచనాయై నమః
ఓం సుజయాయై నమః
ఓం జయాయై నమః
ఓం భూమిష్ఠాయై నమః
ఓం జాహ్నవ్యై నమః
ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్రాయై నమః
ఓం శాస్త్రమయాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం శుభాయై నమః
ఓం చంద్రార్ధమస్తకాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం కల్పాయై నమః
ఓం కరాళ్యై నమః
ఓం కృష్ణ పింగళాయై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం రౌద్ర్యై నమః
ఓం చంద్రామృత పరివృతాయై నమః
ఓం జ్యేష్ఠాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం జగత్సృష్ట్యాధికారిణ్యై నమః
ఓం బ్రహ్మాండ కోటి సంస్థానాయై నమః
ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః
ఓం కాత్యాయన్యై నమః
ఓం కలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః
ఓం యోగానిష్ఠాయై నమః
ఓం యోగిగమ్యాయై నమః
ఓం యోగధ్యేయాయై నమః
ఓం తపస్విన్యై నమః
ఓం ఙ్ఞానరూపాయై నమః
ఓం నిరాకారాయై నమః
ఓం భక్తాభీష్ట ఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః
ఓం భూతమాత్రే నమః
ఓం భూతేశ్యై నమః
ఓం భూతధారిణ్యై నమః
ఓం స్వధానారీ మధ్యగతాయై నమః
ఓం షడాధారాధి వర్ధిన్యై నమః
ఓం మోహితాయై నమః
ఓం అంశుభవాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః
ఓం నిరాలసాయై నమః
ఓం నిమగ్నాయై నమః
ఓం నీలసంకాశాయై నమః
ఓం నిత్యానందిన్యై నమః
ఓం హరాయై నమః
ఓం పరాయై నమః
ఓం సర్వఙ్ఞానప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం దుర్లభ రూపిణ్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః
ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః
|| ఇతి శ్రీ దుర్గా అష్టోత్తర శతనామావళీ సమాప్తం ||

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !

వీడియోలు

Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!
Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Divi Vadthya Bikini Pics: బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
బికినీలో బిగ్ బాస్ దివి... ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఫోటోలు
Akhanda 2 Premiere Show Collection: 'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ 2' ప్రీమియర్స్... గురువారం రాత్రి బాలయ్య సినిమా కలెక్షన్స్ ఎంతంటే?
Cognizants Campus in Visakhapatnam: ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
ఏడాదిలోనే విశాఖకు కాగ్నిజెంట్.. తాత్కాలిక క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ 
Embed widget