శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు-నైవేద్యాలు మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి..ఈ రోజు శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి అవతారంలో కనిపించే అమ్మవారికి కట్టు పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ఆశ్వయుజశుద్ధ విదియ రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అవతారం..ఈ రోజు పులిహోర నైవేద్యం పెడతారు ఆశ్వయుజ శుద్ధ తదియ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారం...గాయత్రి దేవికి కొబ్బరి అన్నం నివేదిస్తారు ఆశ్వయుజ శుద్ధ చవితి రోజు శ్రీ లలితా దేవి అలంకారంలో అమ్మవారు అనుగ్రహిస్తుంది..ఈ రోజు కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజు అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చే అమ్మకు పంచభక్షాలు నివేదించాలి ఆశ్వయుజ శుద్ధ షష్టి రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో కనిపించే అమ్మవారికి కదంబం నివేదిస్తారు ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి దధ్యోజనం నైవేద్యం పెడతారు ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు...ఇదే దుర్గాష్టమి..ఈ రోజు దుర్గాదేవి చక్కెరపొంగలి నైవేద్యంగా పెడతారు ఆశ్వయుజ శుద్ధ నవమి ..అంటే...మహర్నవమి రోజు శుభానికిసంకేతంగా పాయసం నివేదిస్తారు ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవికి గారెలు,పాయసం, పులిహోర అన్నీ నైవేద్యం పెట్టొచ్చు అలంకారాన్ని బట్టి ఇవి నివేదిస్తారు..అంతే కానీ.. తప్పనిసరిగా ఇవే నివేదించాలనేం లేదు. ఎవరి శక్తికి తగిన నైవేద్యం వారు పెట్టొచ్చు. భక్తి ప్రధానం.... (Images credit: Pixabay)