శరన్నవరాత్రుల్లో ఇవి తినకూడదు - ఎందుకంటే!రన్నవరాత్రుల్లో ఉల్లి, వెల్లుల్లి వినియోగించిన పదార్థాలు, మాంసాహారం తినొద్దని చెబుతారు. వాస్తవానికి శరన్నవరాత్రులనే కాదు ఏ పండుగొచ్చినా కూడా ఇదే ఫాలో అవ్వాలి అంటారు. ఎందుకలా...తింటే ఏమవుతుందికారణం చెప్పుకోవాలంటే ముందు మనిషిలో ఉండే మూడు గుణాల గురించి తెలుసుకోవాలి... వీటినే త్రిగుణాలు అంటారు. ఈ మూడు గుణాల కారణంగానే జీవుడు శరీరంలో బంధించి ఉన్నాడని భగవద్గీత చెబుతోంది.1.సత్వగుణం
సత్వగుణం జ్ఞానంపై ఆసక్తి కలిగిస్తుంది. దైవంపై, దైవకార్యాలపై మనసుని మళ్లిస్తుంది, నిత్యం ప్రశాంతంగా ఉంచుతుంది. మృదువుగా మాట్లాడేలా చేస్తుంది. ఉదాహరణ రాముడు, కృష్ణుడు2.రజోగుణం
నేను అనే అహానికి ప్రతీక రజోగుణం. రజోగుణం అధికంగా ఉన్న వ్యక్తి ప్రశాంతంగా ఉండడు. ఎప్పుడూ ఏదో ఆలోచన, ఆందోళన, అసంతృప్తి, అశాంతి, ఏదో చేయాలనే తపనతో ఉంటాడు. ఉదాహరణ దుర్యోధనుడు, రావణుడు3.తమోగుణం
తమోగుణం అధికంగా ఉంటే సోమరితనం, నిద్ర, ఇతరుల దయా-దాక్షిణ్యాలపై ఆధారపడటం, దుర్మార్గపు ఆలోచనలు, తిండి ధ్యాస ఉంటాయి.ఈ మూడు గుణాల గురించి ఇప్పుడెందుకంటే...మనం తినే ఆహారమే మనలో గుణాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఆహారాన్ని కూడా సాత్విక ఆహారం, రాజాసిక్, తమాసిక్ ఆహారాలుగా పేర్కొన్నారు.సాత్విక ఆహారం
సాత్విక ఆహారం స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఈ ఆహారాన్ని తీసుకునేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది. ఎప్పుడూ ఉత్సాహంగా అందరితో స్నేహంగా ఉంటాడు.రజాసిక్ ఆహారం
రజాసిక్ ఆహారంలో మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు , డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్లు ఉంటాయి. వీటిని తినడానికి ఎంత ఆతృత ఉంటుందో... అంతే వేగంగా కోపం, అసహనం, ఆందోళన కలుగుతాయి..తమాసిక్ ఆహారం
ఇందులో ప్రధానంగా మళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు ఉంటాయి. మనసుకి, శరీరానికి హాని కలిగించే ఈ ఆహారం తీసుకోవడం వల్ల దయగల ఆలోచన వీరి దరిచేరదని చెబుతారు.అందుకే ప్రశాంతంగా,సంతోషంగా జరుపుకునే శుభకార్యాల్లో రజోగుణం, తమోగుణం కలిగించే ఆహార పదార్థాలు తీసుకోరు.(Images credit: Pixabay)


Follow for more Web Stories: ABP LIVE Visual Stories