News
News
X

Horoscope Today 17th October 2022: ఈ రాశివారు మాట్లాడటం కన్నా వినడంపై దృష్టి పెట్టాలి, అక్టోబరు 17 రాశిఫలాలు

Horoscope Today 17th October: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

Horoscope Today 17th October 2022 : కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి 
ఎవరిపైనా ద్వేషాన్ని పెంచుకోవద్దు. ఇది మీ మనస్సాక్షిని తప్పుపట్టిస్తుంది, మంచి సంబంధాల్లో చీలిక తెస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అకస్మాత్తుగా డబ్బు చేతికందుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

వృషభ రాశి 
ఈ రోజు మీకు మంచి రోజు. పాత స్నేహితులను కలుస్తారు. ఏదైనా దూరప్రాంత ప్రయాణానికి ప్లాన్ చేస్తారు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారంలో కొంతమంది భాగస్వాములుగా చేరుతారు. మీరు మాట్లాడటం కన్నా వినడంపై ఎక్కువ దృష్టి పెడితే మంచిది.

మిథున రాశి 
తొందరపాటుతో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. సహనాన్ని వదులుకోవద్దు...అతి సహనం ప్రదర్శించవద్దు. స్నేహితులు, బంధువులతో కలసి మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. చాలా రోజులుగా చేస్తున్న కృషి ఫలిస్తుంది. నిరంతర ప్రయత్నాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి.

News Reels

కర్కాటక రాశి
రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీతో లేని వ్యక్తిని మీరు గుర్తుకుతెచ్చుకుంటారు.  మీరు కమీషన్లు,డివిడెండ్లు లేదా రాయల్టీల నుంచి ప్రయోజనం పొందుతారు. పిల్లలు మీరు సాధించిన విజయాల చూసి గర్వపడతారు. కుటుంబానికి సంబంధించి ఓ విషయంలో గందరగోళంగా ఉంటారు.

Also Read: ఈ రాశివారిని ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు

సింహ రాశి 
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులు మీ పనితీరుని వ్యతిరేకిస్తారు.  కొంతమంది సహోద్యోగుల మద్దతు మీకుంటుంది. మీ సానుకూల ఆలోచనలతో బాస్ చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారం బాగాసాగుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టిసారించాలి.

కన్యా రాశి
ఈ రోజు పిల్లలకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో కొనసాగుతున్న వివాదం పరిష్కారమవుతుంది. ఒక శుభకార్యం  నిర్వహిస్తారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు పనిచేసే రంగంలో మీ గొప్పతనాన్ని చాటుకుంటారు.

తులారాశి
సరదా ప్రయాణాలు మీపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి. డబ్బు అకస్మాత్తుగా మీకు వస్తుంది. పెండింగ్ చెల్లింపులు క్లియర్ అవుతాయి. మీ నిశ్చల జీవనశైలి ఇంట్లో ప్రశాంతతని కల్పిస్తుంది..అందుకే అర్ధరాత్రి వరకూ బయట తిరిగే అలవాటు మానుకోండి. 

వృశ్చిక రాశి 
ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. మీరు సవాళ్లను తేలికగా ఎదుర్కొంటారు. ఈ రాశివారు ఎవరికైనా సహాయం చేసి సంతోషం పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక ట్రిప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం ఉంటుంది.

ధనుస్సు రాశి 
ఈ రోజు మీరు మీ పనిపై చాలా ఆసక్తి చూపిస్తారు. ఇల్లు కుటుంబానికి సంబంధించి కొన్ని ఆందోళనలు తగ్గించడానికి మీ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఉద్యోగులు సీనియర్లపై ఒత్తిడి పెంచొద్దు. వ్యాపారులు నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు ఇది మంచి సమయం కాదు.

Also Read: ఈ వారం ఈ రాశివారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు

మకర రాశి
ఒత్తిడిని నివారించడానికి పిల్లలతో మీ విలువైన సమయాన్ని గడపండి. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులుండవు. అధిక ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నించండి. ఉద్యోగులు పనిపై శ్రద్ధ పెట్టాలి

కుంభ రాశి
ఈ రోజు మీకు లాభదాయకమైన రోజు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పని ఓ స్నేహితుడి సహకారంతో పూర్తవుతుంది. ఈ రోజు ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో కొత్త ఆలోచనలను పొందుపరుస్తారు. 

మీన రాశి
ఈ రోజు మీరు పాత రుణాలను తిరిగి చెల్లించడంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రేమ సంబంధాల పరంగా  చాలా ప్రత్యేకమైన రోజు. కుటుంబంలో ఒకరిని మెరుగుపరిచే బాధ్యతను మీరే తీసుకోవచ్చు. మీ ఖర్చులు బడ్జెట్ ను పాడు చేస్తాయి.. అందుకే రకరకాల ప్రణాళికలు కాకుండా ఒకే ప్రణాళికతో ముందుకు సాగండి.

Published at : 16 Oct 2022 11:33 PM (IST) Tags: Horoscope Today 16th October 2022 horoscope astrological predictions for October 17th October 2022 horoscope today's horoscope 17th October 2022 17th October 2022 Rashifal

సంబంధిత కథనాలు

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Astro Tips: ఎంత ముఖ్యమైనా సరే ఈ వస్తువులు అరువు తీసుకోకండి, కారణం ఏంటంటే!

Chanakya Neeti Telugu: ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Chanakya Neeti Telugu:  ఈ 3 లక్షణాలున్న మహిళ ఇంటా-బయటా గౌరవాన్ని పొందుతుంది

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Facts About People Born in December: డిసెంబర్లో పుట్టినవారు ఇలా ఉంటారు!

Daily Horoscope Today 30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Daily Horoscope Today  30th November 2022: ఈ రాశివారు గందరగోళ దశలోకి ప్రవేశిస్తున్నారు, నవంబరు 30 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం, కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

Kaal Bhairav Astami 2022: ఎలాంటి దోషాలనైనా తొలగించే కాలభైరవాష్టకం,  కాలభైరవాష్టమి రోజు పఠిస్తే మరింత మంచిది!

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్