Weekly Horoscope 17th to 23rd October: ఈ రాశివారిని ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు
Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
Astrological prediction from 17th to 23rd October 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం మేష రాశి నుంచి కన్యా రాశివరకూ...ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
ఈ వారం మేషరాశివారికి శుభసమయం. అనుకున్న పనులు పూర్తవుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలుచేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు,ఉద్యోగులకు శుభఫలితాలున్నాయి. దుబారా ఖర్చు తగ్గించండి.
వృషభ రాశి (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
ఈ వారం కష్టానికి తగిన ఫలితం అందుతుంది. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులు శ్రద్ధగా పూర్తిచేస్తారు. మీలో ఉన్న ఆత్మ విశ్వాసం ముందుకు నడిపిస్తుంది. సన్నిహితుల సలహాలు,సూచనలు పాటించండి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. వారసత్వ ఆస్తుల తగాదాలు సాగుతూనే ఉంటాయి. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!
మిథున రాశి (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదం)
ఈ రాశివారు ఈ వారం ప్రతి పనిని పట్టుదలగా చేస్తారు. ఆర్థికపరంగా ఎలాంటి లోటు ఉండదు. స్థిరాస్తి విషయంలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వారం చివరిలో అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కుటుంబంలో కలహాలకు అవకాశం ఉంది. వ్యాపురులు, ఉద్యోగులు జాగ్రత్త.
కర్కాటక రాశి (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
ఈ వారం కర్కాటక రాశివారికి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహన్నిస్తాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో అనుకున్న ఓ పని ఈ రోజు పూర్తికావడం సంతోషాన్నిస్తుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు పెడతారు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి. ధైర్యంగా ముందడుగువేస్తే పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఇష్టంతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.
సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)
ఈ వారం మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అంచనాలకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఎప్పటి నుంచో సాగుతున్న స్థిరాస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. నూతన వాహనాల కొనుగోలు చేస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. ఉద్యోగులకు పదోన్నతికి అవకాశాలున్నాయి. రాజకీయవర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే సమయం. తలపెట్టిన పనులు స్వసక్తితోనే పూర్తిచేస్తారు.
Also Read: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!
కన్యా రాశి (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పాదం)
ఈ వారం కన్యారాశివారి ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేస్తేనే లాభం పొందుతారు.మీకు డైలమా వచ్చిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు,సూచనలు తీసుకోవడం మంచిది. తెలియని విషయాల్లో అనవసరంగా తలదూర్చవద్దు. అపార్థాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఇంటి నిర్మాణానికి ప్రయత్నాలు సాగిస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.