అన్వేషించండి

Dhanteras 2022: ధంతేరాస్ రోజు బంగారం, వెండి మాత్రమే కాదు ఈ వస్తువులు కొన్నా మంచిదే!

Dhanteras 2022: ధన త్రయోదశి రోజు బంగారం, వెండి ఆభరణాలను పూజలో పెడితే లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు. అయితే బంగారం , వెండి మాత్రమే కాదు..ఇంకొన్ని ముఖ్యమైన వస్తువులున్నాయి...

Dhanteras 2022:  ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. దీపావళి ఐదు రోజుల పండుగలో మొదటి రోజు ధనత్రయోదశి...దీనినే ధంతేరాస్. ధన్వంతరి జయంతి, క్షీరసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది ఈ రోజే. అందుకే ధంతేరాస్ రోజు బంగారం, వెండి కొనుగోలు చేస్తారు. లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తే సంపదకు కొదవ ఉండదని విశ్వసిస్తారు. అయితే ధన త్రయోదశి రోజు బంగారం, వెండి మాత్రమే కాదు మరికొన్ని వస్తువులున్నాయి..వాటిని కొనుగోలు చేసినా ఆర్థిక ప్రయోజనం పొందుతారు.

శ్రీ యంత్రం
ధన త్రయోదశి రోజు బంగారం, వెండి కొనే స్తోమత ఉన్నవారిసంగతి సరే..లేదంటే మాత్రం శ్రీ యంత్రం కొనుగోలు చేసి పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. మరీ ముఖ్యంగా మతవిశ్వాసాల ప్రకారం ధన త్రయోదశి రోజు కుదరకపోతే దీపావళి రోజు శ్రీ యంత్రారాధన చేస్తే శుభం జరుగుతుంది

చీపురు
దీపావళి సందర్భంగా పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అందుకే ఇంటిని శుభ్రం చేసే చీపుర్లు కొనడం శుభప్రదంగా భావిస్తారు. చీపురును లక్ష్మీ దేవి స్వరూపంగా చెబుతారు. అందుకే ఈ రోజు చీపురు కొంటే పేదరికం తొలగిపోతుందని విశ్వసిస్తారు. 

Also Read: శని బాధలు తొలిగిపోవాలంటే శనివారం రోజు ఇలా చేయండి!

మట్టి దీపాలు కొనుగోలు
ధన త్రయోదశి రోజు మట్టిదీపాల కొనుగోలు చేయడం కూడా చాలా మంచిది. ఈ రోజు ఇంట్లోకి మట్టి దీపాలు తీసుకురావడం ద్వారా సుఖసంతోషాలు, సౌభాగ్యాలు మిగులుతాయని, లక్ష్మీదేవి సంతోషిస్తుందని చెబుతారు

ధనియాల విత్తనాలు 
ధన త్రయోదశి రోజు ధనియా విత్తనాలు అంటే కొత్తిమీర విత్తనాలు కొనుగోలు చేయడం శ్రేయస్కరం. పౌరాణిక విశ్వాసాల ప్రకారం దీపావళి పూజ సమయంలో లక్ష్మీదేవి దగ్గర ధనియాల విత్తనాలు పెట్టి వాటిని ఇంట్లో భద్రంగా దాచుకుంటే డబ్బు నిల్వ ఉంటుందని కొందరి విశ్వాసం.

గోమతి చక్రం
ధంతేరాస్ రోజు గోమతి చక్రం కొనుగోలు చేస్తే...ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందంటారు పండితులు. ముఖ్యంగా ఈ రోజు 11 గోమతి చక్రాలను కొనుగోలు చేసి పసుపు గుడ్డలో కట్టి అమ్మవారి దగ్గర పూజ తర్వాత లాకర్లో పెడితే మంచి జరుగుతుందని పండితులు చెబుతారు.

Also Read: రాశిమారుతున్న కుజుడు ఈ ఆరు రాశులవారికి అన్నీ శుభఫలితాలే!

ధన త్రయోదశి ప్రత్యేకత ఇదే..
లక్ష్మీదేవి ఆవిర్భావం
అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా ఇదే రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందట. అందుకే ఈ రోజు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందని విశ్వాసం.  ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు కొనుగోలు చేయడం శుభ సూచకంగా భావిస్తారు. అందుకే ధంతేరాస్ వచ్చేసరికి బంగారం వెండి ధరలు పెరిగినా సెంటిమెంట్ ను ఫాలో అయ్యే వినియోగదారులు మాత్రం కొనుగోలు చేసేందుకు వెనకాడరు.

ధన్వంతరి జయంతి 
ఇదే రోజు మరో ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్యానికి, ఔషధాలకి అధిపతి అయిన ధన్వంతరి జయంతి.  ఆయన కూడా క్షీరసాగర మధనంలో లక్ష్మీ దేవి, కామధేనువు, కల్పవృక్షం, ఐరావతంతో పాటూ ఆవిర్భవించాడు. ఓ చేతిలో అమృత భాండం, మరొక చేతిలో ఆయుర్వేద గ్రంథంతో పాల సముద్రం నుంచి ఉద్భవించారని అందుకే ఆరోగ్యం కోసం  ధన్వంతరిని కూడా పూజిస్తారు. మహా విష్ణువు అంశ అయిన ధన్వంతరిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని చెబుతారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి
Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ
Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Crime News: పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
పార్శిల్‌లో ఇంటికి మృతదేహం - పోలీస్ విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడి
Embed widget