అన్వేషించండి

Weekly Horoscope: ఈ వారం ఈ రాశివారు అదృష్టానికి కేరాఫ్ అడ్రస్, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు

Weekly Horoscope: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

 Astrological prediction from 17th to 23rd October 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ వారం తులా రాశి నుంచి మీన రాశివరకూ...ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

Also Read: ఈ రాశివారిని ఆత్మవిశ్వాసమే ముందుకు నడిపిస్తుంది, అక్టోబరు 17 నుంచి 23 వారఫలాలు

తులా రాశి (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)
ఈ వారం తులారాశివారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఏకాగ్రతతో పనిచేస్తే సక్సెస్ అవుతారు.  విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలుంటాయి. స్తిరాస్తులు కొనుగోలు చేసేందుకు ఇదే మంచిసమయం. ఉద్యోగులకు ఇబ్బందులు తొలగిపోతాయి, వ్యాపారం బాగా సాగుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు మధ్యలో ఆపివేయవద్దు.

వృశ్చిక రాశి (విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
వృశ్చిక రాశివారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. సకాలంలో తీసుకునే నిర్ణయాలవల్ల సక్సెస్ అవుతారు. మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలాగే ఉంటారు. ఈ వారం అదృష్టం మీ వెంటే ఉంది. ఉద్యోగులకు మంచి సమయం. విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం. పారిశ్రామికవర్గాల ప్రయత్నాలు ఫలిస్తాయి. 

ధనుస్సు రాశి (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)
ఈ వారం ఈ రాశివారికి కూడా  అనుకూల ఫలితాలే గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్తిరాస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు,విద్యార్థులు అందరూ సక్సెస్ అవుతారు. వారం మధ్యలో అనారోగ్య సూచనలున్నాయి ఆరోగ్యం జాగ్రత్త. మీ బాధ్యతలను మీరు సకాలంలో పూర్తిచేయగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా నష్టపోతారు.

Also Read: ధనత్రయోదశి, నరక చతుర్దశి రోజు 'యమదీపం' ఏ సమయంలో పెట్టాలి!

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
ఈ వారం ఈ రాశివారు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్నపనులు పూర్తిచేస్తారు.నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది. మనోబలం ఉంటేనే సక్సెస్ అవుతారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..అనుభవజ్ఞులను సంప్రదించాకే నిర్ణయం తీసుకోవాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు తిరిగి ప్రారంభిస్తారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆరోగ్యం  జాగ్రత్తగా చూసుకోవాలి. 

కుంభ రాశి (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఈ వారం కుంభరాశివారు అత్యంత ఉత్సాహంగా పనిచేస్తారు. అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో లక్ష్యాన్ని చేరుకుంటారు. విద్యార్థులు సక్సెస్ అవుతారు. కళారంగంలో ఉన్నవారికి అనుకూల సమయం ఇది. ఆరోగ్యం జాగ్రత్త. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బాధ్యతలు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మీన రాశి (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
ఈ వారం మీనరాశివారికి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగులు, వ్యాపారులకు సహనం అవసరం. ధైర్యంగా ముందడుగు వేయండియ. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెంచుకుంటే ప్రశాంతత పెరుగుతుంది. అడ్డంకులను అధిగమించి పనులు పూర్తిచేయగలుగుతారు. తొందరపడొద్దు...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్‌ గణేష్ క్యూలైన్లో గర్భిణి ప్రసవం, బడా గణేశ్‌కు తొలి పూజ చేసిన గవర్నర్
ఖైరతాబాద్‌ గణేష్ క్యూలైన్లో గర్భిణి ప్రసవం, బడా గణేశ్‌కు తొలి పూజ చేసిన గవర్నర్
Jammu Kashmir Landslide: జమ్మూ కాశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి, వైష్ణో దేవి ఆలయం సమీపంలో ఘటన
జమ్మూ కాశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి, వైష్ణో దేవి ఆలయం సమీపంలో ఘటన
Khairatabad Ganesh 2025: శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
Sundarakanda 2025 Review - సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?
సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement

వీడియోలు

Shubman Gill Injury Before Asia Cup 2025 | గాయంతో బాధపడుతున్న శుబ్మన్ గిల్
Sanju Samson in KCL | KCL లో అదరగొడుతున్న సంజూ శాంసన్
Vinayaka Chavithi 2025 Bala Gangadhar Tilak Ganesh Festivals History | చవితి ఉత్సవాలను ప్రారంభించిన వ్యక్తి తిలక్ | ABP Desam
Vizag Sampath Vinayaka Temple Vinayaka Chavithi 2025 Special | ఈ వినాయకుని విగ్రహం పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీని ముంచేసిందా? | ABP Desam
Visakhapatnam Bellam Vinayaka Temple | బెల్లాన్ని మాత్రమే నైవేద్యంగా స్వీకరించే బెల్లం వినాయకుడు | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్‌ గణేష్ క్యూలైన్లో గర్భిణి ప్రసవం, బడా గణేశ్‌కు తొలి పూజ చేసిన గవర్నర్
ఖైరతాబాద్‌ గణేష్ క్యూలైన్లో గర్భిణి ప్రసవం, బడా గణేశ్‌కు తొలి పూజ చేసిన గవర్నర్
Jammu Kashmir Landslide: జమ్మూ కాశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి, వైష్ణో దేవి ఆలయం సమీపంలో ఘటన
జమ్మూ కాశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి, వైష్ణో దేవి ఆలయం సమీపంలో ఘటన
Khairatabad Ganesh 2025: శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్‌ గణేష్‌ దర్శనం -పూజ కోసం భారీ ఏర్పాట్లు,తరలివస్తున్న భక్తులు..
Sundarakanda 2025 Review - సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?
సుందరకాండ రివ్యూ: పెళ్లి కాని యూత్ రిలేటయ్యే సీన్స్, మరి పాయింట్? నారా రోహిత్ సినిమా ఎలా ఉందంటే?
Deputy CM Pawan Kalyan: వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ గుడ్‌న్యూస్, త్వరలో వారి ఖాతాల్లోకి నగదు జమ
వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ గుడ్‌న్యూస్, త్వరలో వారి ఖాతాల్లోకి నగదు జమ
Telangana Bhu Bharati Portal: 9 లక్షల మంది రైతులకు గుడ్‌న్యూస్, సాదాబైనామాల‌ క్రమబద్ధీకరణకు హైకోర్టు అనుమతి
9 లక్షల మంది రైతులకు గుడ్‌న్యూస్, సాదాబైనామాల‌ క్రమబద్ధీకరణకు హైకోర్టు అనుమతి
Sundarakanda OTT: సుందరకాండ ఓటీటీ డీల్ క్లోజ్... నారా రోహిత్ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో తెలుసా?
సుందరకాండ ఓటీటీ డీల్ క్లోజ్... నారా రోహిత్ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో తెలుసా?
Kingdom OTT: ఓటీటీలో విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' స్ట్రీమింగ్ షురూ... తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ!
ఓటీటీలో విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' స్ట్రీమింగ్ షురూ... తెలుగుతో పాటు ఆ నాలుగు భాషల్లోనూ!
Embed widget