Horoscope Today 16th September 2022: ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా ఈ శుక్రవారం ఏ రాశులవారికి ఎలా ఉందో తెలుసుకోండి
Horoscope 16th September 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
![Horoscope Today 16th September 2022: ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా ఈ శుక్రవారం ఏ రాశులవారికి ఎలా ఉందో తెలుసుకోండి Horoscope Today 15th September 2022 Horoscope 16th September Rasi Phalalu astrological prediction for Aries, Gemini, Vigro, Libra and Other Zodiac Signs Horoscope Today 16th September 2022: ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా ఈ శుక్రవారం ఏ రాశులవారికి ఎలా ఉందో తెలుసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/15/d843044756bd2a13ddea308b6ed504f61663259733027217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Horoscope 16th September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేష రాశి
గతంలో కన్నా ఖర్చులు పెరుగుతాయి కానీ త్వరలో పరిస్థితి అదుపులోకి వస్తుంది. జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం ఉండవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆఫీసులో సహోద్యోగులతో వివాద సూచనలున్నాయి.
వృషభ రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో కలిసి సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సేవా కార్యక్రమాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు.
మిథున రాశి
ఈరోజు మిథున రాశి వారు వ్యాపారంలో పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలున్నాయి. మనసులో దాచుకున్న ఏ కోరిక అయినా నెరవేరుతుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. విద్యార్థులు చదువు గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాభివృద్ధికి అవకాశాలున్నాయి. ఉద్యోగులకు మంచి రోజు.
Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం
కర్కాటక రాశి
ఉద్యోగం ఎదురుచూస్తున్న వారి నిరీక్షణ ఫలిస్తుంది. ఈ రోజు మీరు కొన్ని శుభకార్యాలకు హాజరవుతారు. ఆరోగ్యం బావుంటుంది. సోమరితనం వదిలి పనిపై ఏకాగ్రత పెట్టడం మంచిది. కుటుంబం కోసం కొంత సమయాన్ని వెచ్చించేందుకు ప్రయత్నించండి.
సింహ రాశి
ఈ రాశి వారికి వారు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం మారాలి అనుకున్నవారు ఓసారి ఆలోచించండి. మీ పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యా రాశివారు ఈ రోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. డబ్బు ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు.
తులా రాశి
డబ్బు ప్రాముఖ్యతను తెలుసుకోండి లేదంటే రానున్న రోజుల్లో మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి రావొచ్చు. శారీరకంగా బాగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Also Read: శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!
వృశ్చిక రాశి
ఈ రోజు ప్రేమ పరంగా చాలా మంచి రోజు. ఆర్థికంగా లాభం ఉంటుంది. ఆఫీసులో మీ ఇమేజ్ పెరుగుతుంది. ఆలోచించి పెట్టిన పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తారు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులకు కొన్ని పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబంలో వృద్ధుల అనారోగ్య కారణాల వల్ల ఆందోళన పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఎదుటి వారి ఆలోచనల ఆధారంగా కాకుండా మీ తెలివితేటలు, విచక్షణ ఆధారంగా నిర్ణయం తీసుకోండి.
మకర రాశి
కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట తూలకండి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. స్నేహితులు, బంధువులతో సంబంధాలు బలపడతాయి.మీ పనితీరుతో మీకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు
కుంభ రాశి
ఆదాయ వనరులు తగ్గే అవకాశాలున్నాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. తండ్రినుంచి పూర్తి సహకారం అందుతుంది. పిల్లలు వైపు నుంచి సంతృప్తి చెందుతారు. ఉద్యోగులు బదిలీ లేదా ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వినే అవకాశం ఉంది.
మీన రాశి
జీవిత భాగస్వామితో ఏదో విషయంలో మనస్పర్థలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలుంటాయి. ఏదైనా పెట్టుబడిని తెలివిగా చేయండి. కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)