News
News
X

Dussehra 2022 : శరన్నవరాత్రుల్లో తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలివి!

Dussehra 2022 : నవరాత్రుల తొమ్మిది రోజుల్లో దుర్గమ్మ తొమ్మిదిరూపాలను పూజిస్తారు.అమ్మవారిని పూజించే ఈ తొమ్మిది రోజులూ కొన్ని నియమాలు పాటించాలి అవేంటంటే...

FOLLOW US: 

Dussehra 2022 : సెప్టెంబరు 26న శరన్నవరాత్రులు ప్రారంభం - అక్టోబరు 5న దసరా
అయ్యవారి ఆరాధనలో తెలిసీ తెలియని తప్పులుచేసినా అంత ప్రభావం ఉండదు కానీ అమ్మవారి ఆరాధనలో పొరపాట్లు అస్సలు దొర్లకూడదని చెబుతారు పండితులు. ముఖ్యంగా  శరన్నవరాత్రుల్లో కలశ స్థాపన చేసి నియమంగా పూజలు చేసేవారు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఇంకా స్పష్టంగా చేయాలంటే ఈ సమయంలో చేయాల్సిన-చేయకూడని పనుల విషయంలో స్పష్టత ఉండాలంటారు. దుర్గమ్మ అనుగ్రహం మీపై ఉండాలన్నా, మీరు చేసిన పూజనుంచి సత్ఫలితాలు పొందాలన్నా కొన్ని పాటించాలి...

పూజ చేసేటప్పుడు మధ్యలో లేవకండి 
ఆధ్యాత్మిక కార్యక్రమం ఏం చేస్తున్నా..పూజ, మంత్ర పఠనం, చాలీశా, స్తుతి..ఏదైనా కానీ మధ్యలో అస్సలు లేవకూడదు. దుర్గా శ్లోకాలు చదువుతున్న సమయంలో ఎవ్వరితోనూ మాట్లాడకూడదు, వేరే పని నిమిత్తం లేవకూడదు. దీనివల్ల పూజనుంచి వచ్చే అనుకూల ఫలితాలు కన్నా మీ చుట్టూ ప్రతికూల శక్తి పెరుగుతుందంటారు. 

Also Read: ఆశ్వయుజాన్ని శక్తిమాసం అంటారెందుకు , శరన్నవరాత్రులు ఎందుకంత పవర్ ఫుల్!

పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
సాధారణంగా పూజ, వ్రతం, నోము, పండుగ అనేకాదు..పరిశుభ్రత పాటించడం అందరికీ చాలా అవసరం. అయితే శరన్నవరాత్రుల్లో ఇది మరికొంచెం ఎక్కువగా ఉండాలి..ఎలా అంటే.. తెల్లవారుజామునే స్నానం ఆచరించిన తర్వాతే దేవుడి మందిరంలో అడుగుపెట్టాలి. స్నానం అనంతరం దేవుడి పాత్రలు శుభ్రం చేసుకుని శుచిగా నైవేద్యం వండిపెట్టి పూజచేయాలి. పూజ సమయంలో ధరించే దుస్తులు ప్రత్యేకంగా పెట్టుకోవాలి...

లెదర్ వస్తువులు ధరించవద్దు
పూజ సమయంలో తోలుతో చేసిన వస్తువులు ధరించి పూజా మందిరంల అడుగుపెట్టకూడదు. లెదర్ వస్తువులు ధరించి పూజకు కూర్చుంటే అనుకూల ఫలితాలు కన్నా ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉంటాయని చెబుతారు పండితులు

పగటిపూట నిద్రపోవద్దు
విష్ణు పురాణం ప్రకారం శరన్నవరాత్రులు చేస్తున్నవారు పగటిపూట నిద్రించడం నిషిద్ధం. ఉపవాసం ఉండేవారైతే ఈ తొమ్మిది రోజు పగటివేళ అమ్మవారి కీర్తలతో సమయం గడపాలి.

మాంసాహారం,ఉల్లిపాయ, వెల్లుల్లి తినొద్దు
మత విశ్వాసాల ప్రకారం నవరాత్రులలో ఉల్లిపాయ, వెల్లుల్లి ,  మాంసాహారం ఇంట్లో వండకూడదు. బయటి నుంచి తెచ్చుకుని కూడా తినకపోవడమే మంచిదంటారు పండితులు. నియమ నిష్టలతో తొమ్మిదిరోజుల పాటూ అమ్మవారికి పూజలు చేస్తున్న ఇంట్లో సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిది

గోళ్లు, గడ్డం, మీసం, జుట్టు కత్తిరించకూడదు
శాస్త్రాల ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు గడ్డం, మీసాలు, జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. 

నోట్: పండితులు చెప్పిన వివరాల ఆధారంగా రాసిన విషయాలివి..వీటిని ఎంతవరకూ అనుసరించాలి, అనుసరించాల్సిన అవసరం లేదు అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...

నవదుర్గల శ్లోకం
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ |
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ ||
పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ |
సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః |
ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా ||
ఇలా దుర్గాదేవి తొమ్మిది రూపాలతో విరాజిల్లుతుంది

Published at : 15 Sep 2022 03:31 PM (IST) Tags: Lord Durga dussehra 2022 puja time dussehra 2022 2022 dussehra dussehra 2022 dates when is dussehra 2022 2022 Mahashtami Durgashtami 2022 dasara dasami 2022

సంబంధిత కథనాలు

zodiac signs: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

zodiac signs: ఈ రాశులవారితో వాదన పెట్టుకుంటే మీపై మీకే విరక్తి వస్తుందట!

Navratri 2022: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

Navratri 2022: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: శరన్నవరాత్రుల్లో రెండోరోజు పఠించాల్సిన స్తోత్రం

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

Navratri 2022: ఆయుష్షు కీర్తినిచ్చే బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారు ఆవిర్భావం ఎలా జరిగిందంటే!

టాప్ స్టోరీస్

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

Supreme Court Live Streams: సుప్రీం కోర్టు విచారణలు లైవ్‌లో ఇలా చూడొచ్చు!

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ