అన్వేషించండి

Horoscope Today 15 October 2024 : ఈ రాశుల ఉద్యోగులకు ఈ రోజు బ్యాడ్ టైమ్ నడుస్తోంది - అక్టోబరు 15 రాశిఫలాలు !

Dussehra Horoscope 15th October 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

Daily Horoscope for 15th October 2024 

మేష రాశి

నూతన పనులు ఉత్సాహంగా ప్రారంభిస్తారు..అదే స్థాయిలో రిజల్ట్ అందుకుంటారు. అయితే ఒకేసారి నాలుగైదు పనులు చేపడితే నిరాశ తప్పదు. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టడం కొన్నాళ్లు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. 

వృషభ రాశి

ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. మళ్లీ పాత వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది అప్రమత్తం అవండి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఈ రోజు మంచిది. మీ సన్నిహితుల నుంచి ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో పురోగతికి అవకాశం ఉంటుంది. 

మిథున రాశి

ఈ రోజు మీరు కొన్ని విషయాలపై లోతైన అధ్యయనం చేస్తారు. కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు. మీరు పై అధికారుల అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. నిలిచిపోయిన పనిని పూర్తి చేయవచ్చు.

Also Read: రాశులవారికి ఈ వారం (అక్టోబరు 14 to 20 ) 'గురిపెట్టినా ఎర పడదు' - శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ!

కర్కాటక రాశి

మీ జీవిత భాగస్వామిపై మీకు నమ్మకం తగ్గుతుంది. ఈ రోజంతా గందరగోళంగా అనిపిస్తుంది. అనుకున్న పనులేవీ పూర్తికాకపోవడంతో చికాకు పెరుగుతుంది. సోమరితనం వీడండి. అనవసర విషయాలపై శ్రద్ధ తగ్గించాలి. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సమస్యలు తప్పవు. 

సింహ రాశి
 
ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు ఉన్నతస్థానం పొందే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. 

కన్యా రాశి

ఈ రోజు మీరు కష్టపడి పని చేయడం ద్వారా పెండింగ్ పనులన్నీ ఏకకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీరు జీవితం పట్ల మీ దృక్పథంలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. కార్యాలయంలో సహోద్యోగులతో సమన్వయం చాలా బాగుంటుంది. 

తులా రాశి

ఈ రాశివారు తల్లిదండ్రుల పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. గ్రహాలు మీకు అననకూలంగా ఉన్నాయి..చేపట్టిన పనుల్లో సక్సెస్ మీ సొంత మవుతుంది. స్నేహితులను కలుస్తారు. సహోద్యోగులు మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నించవచ్చు. పోటీ పరీక్షలలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 

వృశ్చిక రాశి

ఈ రాశివారు ఈ రోజు అనుకోని ప్రయాణం చేయవచ్చు. ఆదాయం కన్నా ఖర్చులు పెరుగుతాయి బ్యాలెన్స్ చేసుకోవాల. అనుకోని అతిథులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. స్నేహితులను కలుస్తారు. ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

Also Read: అక్టోబరు 14 to 20.. ఈ రాశులవారికి శుభం-అశుభం మిశ్రమంగా ఉంటుంది - ఈ 3 రంగాలవారికి విశేష జయం!

ధనస్సు రాశి

ఈ రోజు మీరు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. సంతోషం కోసం ఖర్చులు  చేస్తారు. కుటుంబంలో, ఉద్యోగంలో ఉన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. 

మకర రాశి

మీ ఆలోచనల్లో ప్రతికూలతను నియంత్రించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. పనికిరాని పనుల్లో చిక్కుకోవద్దు.  నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు

కుంభ రాశి

ఎప్పటి నుంచో వెంటాడుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కాస్త ఓపికగా వ్యవహరించండి. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ చేయవద్దు. ఉద్యోగుల కెరీర్లో కీలక మలుపు ఉండబోతోంది.

మీన రాశి

ఈ రాశివారు ఈ రోజు విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ సలహాలు, సూచనలు మీ సన్నిహితులకు ఉపయోగపడతాయి. కుటుంబంలో ఆస్తి తగాదాలు కొనసాగుతాయి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 

Also Read: అక్టోబరు 14 to 20 .. ఈ వారం ఈ 4 రాశులవారికి పట్టిందల్లా బంగారమే - అన్నీ అనుకూల ఫలితాలే!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
13-08-2026 గురువారం మీ రాశిఫలాలు!
Solar Eclipse 2026: మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
మొబైల్, టీవీలో ప్రత్యక్ష సూర్యగ్రహణాన్ని చూసినా నియమాలు పాటించాలా? తర్వాత స్నానం చేయలా?
Solar Eclipse 2026: సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
ఆగష్టు 12న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది? విమానం కిటికీ నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం ఎలా ఉంటుంది?
Pisces Half Year Horoscope: మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?
మీన రాశి 2026 జూలై to డిసెంబర్ మీ జీవిత గమనం మారుతుందా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Embed widget