అన్వేషించండి

Rasi Phalalu Today: ఆగష్టు 27, 2025 వినాయక చవితి రాశిఫలాలు - మేషం నుంచి మీనం.. ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి!

Horoscope for August 26th 2025 : మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల కెరీర్, ఆరోగ్యం, వైవాహిక జీవితం, ధనానికి సంబంధించి ఈ రోజు ఎలా ఉందో తెలుసుకోండి.

2025 ఆగష్టు 27th రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu August 27th 2025 

మేష రాశి (Aries)

కెరీర్: తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు పనిలో మంచి ఫలితాలు వస్తాయి. మీ ప్రవర్తన , పని  సానుకూల ప్రభావం ఇతరులపై పడుతుంది.
వ్యాపారం: మీరు ఏదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, వ్యాపారానికి సంబంధించిన అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహా తప్పనిసరిగా తీసుకోండి.
ధనం: డబ్బుకు సంబంధించిన ఏదైనా పాత లావాదేవీ ఈరోజు లాభదాయకంగా ఉంటుంది.
విద్య: విద్యార్థులకు చదువులో విజయం సాధించే అవకాశం ఉంది. సోమరితనం మానుకోండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
ప్రేమ/కుటుంబం: ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి కూడా వెళ్ళవచ్చు. జీవిత భాగస్వామి పట్ల బాధ్యతలు పెరుగుతాయి.
పరిహారం: గణేశుడికి శనగపిండి లడ్డూ సమర్పించండి, అన్ని పనులలో మంచి ఫలితాలు వస్తాయి.
లక్కీ రంగు: పసుపు
లక్కీ సంఖ్య: 1

వృషభ రాశి (Taurus)

కెరీర్: ఈరోజు వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది, దీనివల్ల మనస్సు సంతోషంగా ఉంటుంది. ఉద్యోగంలో పరిస్థితి సాధారణంగా ఉంటుంది, ఓపిక పట్టండి
వ్యాపారం: వ్యాపార కార్యకలాపాలు కొంచెం నెమ్మదిగా ఉంటాయి, కానీ పరిస్థితులను బట్టి ఓర్పుతో ఉండటం మంచిది
ధనం: ఇంటి సౌకర్యాలకు సంబంధించిన ఏదైనా వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఖర్చులను ఆలోచించి చేయండి
విద్య: పిల్లల సమస్యలు సాల్వ్ చేసేందుకు మీ సహకారం అందించండి
ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. కుటుంబంతో గడిపిన సమయం మానసిక శాంతిని కలిగిస్తుంది
పరిహారం: శివలింగంపై పచ్చి పాలు సమర్పించండి, సానుకూల శక్తి లభిస్తుంది
లక్కీ రంగు: తెలుపు
లక్కీ సంఖ్య: 6

మిథున రాశి (Gemini)

కెరీర్: కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సమస్య పరిష్కారమవుతుంది, దీనివల్ల మనస్సు తేలికగా ఉంటుంది.
వ్యాపారం: ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. ఖర్చులను పరిమితం చేయండి , అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవద్దు.
ధనం: స్నేహితుడికి ఆర్థిక సహాయం చేయాల్సి రావచ్చు. లావాదేవీలలో జాగ్రత్త వహించండి.
విద్య: చదువుపై మనసు లగ్నమవుతుంది. విద్యార్థులకు పాత సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది.
ప్రేమ/కుటుంబం: సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. పొరుగువారితో సత్సంబంధాలు కొనసాగుతాయి.
పరిహారం: పేదవారికి ఆకుకూరలు దానం చేయండి.
లక్కీ రంగు: ఆకుపచ్చ
లక్కీ సంఖ్య: 5

కర్కాటక రాశి (Cancer)

 కెరీర్: దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం వల్ల పనులు సకాలంలో పూర్తవుతాయి. 
 వ్యాపారం: వ్యాపారులు ఏదైనా కంపెనీతో భాగస్వామ్యం చేసుకోవచ్చు. కొత్త పథకాలపై పని ప్రారంభమవుతుంది.
 ధనం: ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
 విద్య: ఏదైనా కష్టమైన సబ్జెక్టుపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి.
 ప్రేమ/కుటుంబం: సంబంధాలలో సామరస్యాన్ని కొనసాగించడానికి, ప్రవర్తనలో మృదువుగా ఉండండి.
 పరిహారం: ఏదైనా ఆలయంలో తెల్లటి స్వీట్ సమర్పించండి.
 లక్కీ రంగు: తెలుపు
 లక్కీ సంఖ్య: 2

 సింహ రాశి (Leo)

 కెరీర్: సీనియర్ల సహకారం లభిస్తుంది. కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు.
 వ్యాపారం: కొత్త కాంట్రాక్ట్ పొందవచ్చు. రాజకీయ సంబంధాలు కూడా ప్రయోజనం చేకూరుస్తాయి.
 ధనం: ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది
 విద్య: విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఇది సరైన సమయం.
 ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యుల విజయం వల్ల సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది.
 పరిహారం: సూర్యునికి నీరు సమర్పించండి.
 లక్కీ రంగు: గోల్డెన్
 లక్కీ సంఖ్య: 3

 కన్యా రాశి (Virgo)

 కెరీర్: ఆఫీసులో పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో సమన్వయం ఉంచుకోండి.
 వ్యాపారం: వ్యాపార విజయం వల్ల తల్లిదండ్రులు సంతోషిస్తారు.
 ధనం: వృధా ఖర్చులను నివారించండి. మీ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి.
 విద్య: ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సోదరుడు లేదా టీచర్ సహాయం తీసుకోండి.
 ప్రేమ/కుటుంబం: అనుమానాలను నివారించండి. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం.
 పరిహారం: ఆవుకు ఆకుకూరలు తినిపించండి.
 లక్కీ రంగు: నీలం
 లక్కీ సంఖ్య: 4

 తులా రాశి (Libra)

 కెరీర్: ఈ రోజు అభివృద్ధి ఉంటుంది. పని రంగంలో విజయం లభిస్తుంది.
 వ్యాపారం:  ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది.
 ధనం: సౌకర్యవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు అవుతుంది.
 విద్య: పిల్లలకు మీ సలహా వల్ల ప్రయోజనం ఉంటుంది.
 ప్రేమ/కుటుంబం: సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది.  
 పరిహారం: ఆలయంలో ప్రసాదం నివేదించి అందరకీ పంచిపెట్టండి 
 లక్కీ రంగు: గులాబీ
 లక్కీ సంఖ్య: 7

 వృశ్చిక రాశి (Scorpio)

 కెరీర్: పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ ఇమేజ్ మెరుగుపడుతుంది.
 వ్యాపారం: ఈరోజు వ్యాపారంలో లాభం వచ్చే అవకాశం ఉంది.
 ధనం: కుటుంబం కోసం ధనం ఖర్చు అవుతుంది.
 విద్య: ఉపాధ్యాయులకు ఈ రోజు బిజీగా ఉంటుంది.
 ప్రేమ/కుటుంబం: పరస్పర సంబంధాలు బలపడతాయి. అతిథుల రాకపోకలు ఉండవచ్చు.
 పరిహారం:  వృద్ధులకు సేవ చేయండి.
 లక్కీ రంగు: ఎరుపు
 లక్కీ సంఖ్య: 9

 ధనుస్సు రాశి (Sagittarius)

 కెరీర్: జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అనుభవజ్ఞుడైన వ్యక్తి మార్గదర్శకత్వం ప్రయోజనకరంగా ఉంటుంది.
 వ్యాపారం: ఏదైనా కొత్త పథకం ప్రారంభించవచ్చు.
 ధనం:  ఆర్థిక సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
 విద్య: విద్యార్థులకు కష్టానికి మంచి ఫలితం లభిస్తుంది.
 ప్రేమ/కుటుంబం: కుటుంబ సంబంధాలు మధురంగా ఉంటాయి.
 పరిహారం: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
 లక్కీ రంగు: పసుపు
 లక్కీ సంఖ్య: 8

 మకర రాశి (Capricorn)

 కెరీర్: పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. సానుకూల ఆలోచనతో పనులు విజయవంతమవుతాయి.
 వ్యాపారం: ఆస్తి డీలింగ్ నుంచి లాభం ఉంటుంది
 ధనం: డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి.
 విద్య: విద్యార్థులు మనసు పెట్టి చదువుకుంటారు.
 ప్రేమ/కుటుంబం: కుటుంబ సహకారం లభిస్తుంది.  
 పరిహారం: నల్లటి వస్తువులను దానం చేయండి.
 లక్కీ రంగు: గోధుమ
 లక్కీ సంఖ్య: 10

 కుంభ రాశి (Aquarius)

 కెరీర్: అదనపు బాధ్యతలు పూర్తవుతాయి. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది.
 వ్యాపారం: ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉండేవారు లాభపడతారు
 ధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
 విద్య: విద్యార్థులు చదువుపై దృష్టి పెడతారు.
 ప్రేమ/కుటుంబం: పాత స్నేహితుడితో మాట్లాడతారు. ప్రేమ జీవితం బాగుంటుంది.
 పరిహారం: అమ్మవారి పూజ చేయండి
 లక్కీ రంగు: ఊదా
 లక్కీ సంఖ్య: 11

 మీన రాశి (Pisces)

 కెరీర్: పనిచేసే ప్రదేశంలో సమన్వయం బాగుంటుంది. మార్కెటింగ్‌లో విజయం లభిస్తుంది.
 వ్యాపారం: వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిపుణుల సలహా తీసుకోండి.
 ధనం: డబ్బుకు సంబంధించిన సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
 విద్య: విద్యార్థులకు రోజు బాగుంటుంది.
 ప్రేమ/కుటుంబం: ప్రేమికులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.
 పరిహారం: చేపలకు ఆహారం వేయండి
 లక్కీ రంగు: వెండి
 లక్కీ సంఖ్య: 12

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

వినాయక చవితి పూజా విధానం - పసుపు గణపతి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

పసుపు గణపతి పూజ తర్వాత మీరు తీసుకొచ్చిన గణేష్ విగ్రహానికి పూజ చేసే విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

వినాయక చవితి రోజు చదవాల్సిన కథలు సంస్కృతంలో కాకుండా మీకు అర్థమయ్యేలా చదువుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Amaravati: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
అమరావతిని రాజధానిగా నోటిఫై చేయడానికి కేంద్రం మెలిక పెట్టిందా? బిల్లును వెనక్కి పంపించిందా?
The Raja Saab : 'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
'అఖండ 2'తో మోగ్లీ రావడం అదృష్టం - ఫ్రస్టేషన్ ఎందుకు తమ్ముడు?... డైరెక్టర్ మారుతి స్పీచ్ హైలెట్స్
Chandrababu: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం - జాబితాలో పవన్, లోకేష్ కూడా ఉన్నట్లేనా ?
Embed widget