By: RAMA | Updated at : 19 Feb 2023 10:31 AM (IST)
Edited By: RamaLakshmibai
Weekly Horoscope (Image Credit: Freepik)
February 20 to 26 Weekly Horoscope In Telugu: ఫిబ్రవరి 20 నుంచి 26 వరకూ ఈ వారం రోజులూ ఈ రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి...
ఈ రాశివారు వారం ప్రారంభంలో కొన్ని ఆహ్లాదకరమైన వార్తలు వింటారు లేదంటే ఆశించిన విజయాన్ని పొందుతారు. దీనివల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో, మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఉద్యోగులకు సీనియర్లు, జూనియర్ల నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. జీవితభాగస్వామితో వివాదాలు సర్దుబాటవుతాయి. నిరుద్యోగుల నరీక్షణ ఫలిస్తుంది. వారం చివరిలో ఆస్తివివాదాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్త.
ఈ రాశివారికి ఈవారం శుభప్రదంగా ఉంది. ఓ పెద్ద ప్రాజెక్టులో జాయిన్ అవ్వాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి కోరిక ఈ వారం నెరవేరనుంది. సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. వ్యాపారుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చాలాకాలం నుంచి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్టైతే వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో నిదానంగా, స్థిరంగా పురోగతి కనిపిస్తోంది. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: ఫిబ్రవరి 20 నుంచి 26 వారఫలాలు, ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి
ఈ రాశివారి జీవితంలో వారం ప్రారంభంలో పెద్ద సానుకూల మార్పు రాబోతోంది. ఉద్యోగులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. వృత్తి-వ్యాపారాలకు సంబంధించి చేసే ప్రయాణం ఆశించిన ఫలితాలను ఇస్తుంది. మీ రంగంలో మీరు మీ తెలివితేటలు మరియు విచక్షణతో మీ ప్రత్యర్థులకు చెక్ పెడతారు. ఉద్యోగులు అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. చిన్నచిన్న సమస్యలు వదిలేస్తే ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణప్రయత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండొచ్చు. వారం ప్రారంభంలో ఖర్చులు పెరుగుతాయి.
ఈ రాశివారికి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులున్నా వారాంతానికి అంతా బావుంటుంది.అయితే ఈ వారం మీర డబ్బును ఆలోచనాత్మకంగా ఖర్చుచేయాలి. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి ఈవారం కొంత హడావుడి ఉంటుంది. ఈ సమయంలో సమర్థవంతమైన వ్యక్తిని కలవడం వల్ల ఏదైనా ప్రయోజనం పొందుతారు. వ్యాపారాన్ని పెంచుకోవాలని ఆలోచిస్తుంటే మీ సామర్థ్యానికి అనుగుణంగా దాన్ని విస్తరించడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధాలతో అల్లరి తగాదాలుంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉత్సాహంతో ముందడుగు వేసి అనుకున్న పనులు చక్కదిద్దుతారు. విద్యార్థుల జీవితాశయం నెరవేరుతుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం.
ఈ రాశివారు తమ జీవితంలో కొన్నాళ్లుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమసిపోతాయి.వారం ప్రారంభంలో స్నేహితుల సహకారంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ పిల్లలకు సంబంధించిన వార్త ఒకటి మీలో సంతోషాన్ని నింపుతుంది. వారం మధ్యలో వృత్తి-వ్యాపారం లేదావ్యక్తిగత వ్వవహారాపై ప్రయాణం చేయాల్సి వస్తుంది. అవివాహితులకు పెళ్లిసంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. కుటుంబంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో స్వల్ప లాభాలుంటాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు తప్పవు.
మకర రాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా జీవనోపాధి కోసం తిరుగుతున్న వారికి వారం ప్రారంభం శుభదాయకంగా ఉంటుంది. స్నేహితుడి సహాయంతో వృత్తి-వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు అధిగమిస్తారు. కార్యాలయంలో పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. సీనియర్ల అనుగ్రహం, జూనియర్ మద్దతు లభిస్తుంది. భార్యాభర్తల మధ్య భావోద్వేగ అనుబంధం పెరగడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో మరింత లాభాలు చేకూరుతాయి. పారిశ్రామికవర్గాల వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం చివరిలో వృథా ఖర్చులు ఉంటాయి.
మార్చి 26 రాశిఫలాలు, ఈ రాశులవారి మనసులో ఆనందం-తలపెట్టిన పనిలో జయం
వారఫలాలు (మార్చి 27 నుంచి ఏప్రిల్ 02): ఈ వారం ఈ రాశులవారికి శారీరక, మానసిక సమస్యలు - అహంకారం వీడకపోతే చాలా నష్టపోతారు
Weekly Horoscope 27 March-02 April: ఈ వారం ఈ 6 రాశులవారి అదృష్టం చూసి అంతా అసూయపడతారు, మార్చి 27 నుంచి ఏప్రిల్ 02 వారఫలాలు
Sri Rama Navami 2023: రావణుడికి అయోధ్య ఇస్తానన్న రాముడు, శ్రీరామచంద్రుడి నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలివే!
2023 Panchangam in Telugu: ఈ రాశులవారు ఎక్కువ సంపాదిస్తారు తక్కువ ఖర్చుచేస్తారు
రాహుల్ కంటే ముందు అనర్హత వేటు పడిన నేతలు వీరే
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా