By: RAMA | Updated at : 19 Feb 2023 10:25 AM (IST)
Edited By: RamaLakshmibai
Image Credit: Pixabay
February 20 to 26 Weekly Horoscope In Telugu: ఫిబ్రవరి 20 నుంచి 26 వరకూ ఈ వారం రోజులూ ఈ రాశులవారికి కొందరికి మిశ్రమ, మరికొందరికి ప్రతికూల ఫలితాలున్నాయి...
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. వ్యాపారులకు ఊహించని విధంగా మార్గెట్లో డబ్బు చిక్కుకుంటుంది కానీ మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది.నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తపడాలి. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులను సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో పూర్తి చేస్తారు. భూ నిర్మాణానికి సంబంధించిన వివాదంలో నిర్ణయం మీకు అనుకూలంగా రావొచ్చు. వారం ఆరంభంలో కన్నా చివర్లో అనుకూల ఫలితాలు పొందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటుంది... ఓసారి ప్లాన్ చేసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలు పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
వారం ప్రారంభం నుంచి పనిభారం మోయాల్సి వస్తుంది..దానివల్ల మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. సహనం పాటించడం మంచిది. ఈ వారం మీరు మీ మాటతీరు, ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉండాలి..ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిగ్రహాన్ని కోల్పోవద్దు. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని మరల్చడానికి తరచుగా ప్రయత్నించే సహోద్యోగుల మాటలను పట్టించుకోవద్దు. వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి వారం మొదటి సగం కంటే రెండవ భాగం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు దృఢంగా ఉంటాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆస్తిలాభాలు ఉండవచ్చు.
Also Read: ఈ వారం ఈ రాశివారి జీవితంలో పెద్ద సానుకూల మార్పు రాబోతోంది
ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూల ఫలితాలున్నాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారులు, ఉద్యోగులు విజయం సాధిస్తారు. నూతన పెట్టుబడులకు ఇదే సరైన సమయం. ఉద్యోగులకు కాస్త ఒత్తిడి తగ్గుతుంది...సీనియర్ల నుంచి పూర్తిస్థాయి సహకారం అందుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనకున్నది సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు సమసిపోతాయి,లాభం పొందుతారు. తోటివారి నుంచి సహకారం అందుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు...ఆరోగ్యం జాగ్రత్త.
ఈ వారం ఈ రాశివారికి మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యల వల్ల మీ పని దెబ్బతినవచ్చు. ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎదురైన సమస్యలపై వెనక్కు తగ్గడం కన్నా వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించుకుని మీవంతు ప్రయత్నం మరు చేయాలి..లేదంటే అదే సమస్య భవిష్యత్ లో మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పోటీదారుల నుంచి సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రేమ సంబంధాన్ని మెరుగ్గా కొనసాగించడానికి తొందరపాటును నివారించి, ఆలోచనాత్మకంగా ముందుకు సాగండి. క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
Also Read: కుంభ రాశిలో సూర్య సంచారం, 7 రాశులవారికి అద్భుతం, 5 రాశులవారికి ప్రతికూలం
ఈ రాశివారు ఈ వారం సోమరితనం, అహంకారానికి దూరంగా ఉండాలి. పనులు వాయిదా వేస్తే చాలా నష్టపోతారు. భాగస్వామ్య వ్యపారులు కలిసొస్తాయి. అనుకోకుండా మీ బాధ్యత పెరుగుతుంది..దానిని నెరవేర్చడానికి అదనపు శ్రమ కృషి అవసరం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు వారం చివర్లో శుభవార్త వింటారు. వారం ద్వితీయార్ధంలో మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల సలహాలు మీకు మంచిచేస్తాయని గుర్తించండి. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
ఈ రాశివారు ఈవారం అనుకున్న పనిని అనుకున్న సమయంలో పూర్తిచేయడానికి మరింత కష్టపడాల్సి ఉంటంది. అయితే సమయానికి డబ్బు చేతికందుతుంది.. సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారం బావుంటుంది. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. మీన రాశి జాతకులు భూమి, భవన క్రయవిక్రయాలలో తొందరపాటు తగదు. అలాంటివి చేసేటప్పుడు మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!
Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!
మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది
Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు
Astrology: మీ పేరులో మొదటి అక్షరం ఆధారంగా మీ రాశి - నక్షత్రం వివరాలు తెలుసుకోండి!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైండ్ గేమ్‌తో ప్రచారం- ప్రత్యర్థులను పరుగులు పెట్టేంచేలా స్కెచ్
TSPSC Paper Leak: 'ఓఎంఆర్' విధానానికి టీఎస్‌పీఎస్సీ గుడ్‌బై? ఇక నియామక పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన గంటా, టీడీపీ గెలుస్తుందంటూ ధీమా
రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష, పరువు నష్టం కేసులో దోషిగా తేల్చిన కోర్టు - వెంటనే బెయిల్