News
News
X

Surya Gochar 2023: కుంభ రాశిలో సూర్య సంచారం, 7 రాశులవారికి అద్భుతం, 5 రాశులవారికి ప్రతికూలం

Sun's transit in Aquarius 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 
Share:

Surya Gochar 2023:  గ్రహాలకు రాజుగా చెప్పే సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభరాశిలో ప్రవేశించాడు. మార్చి 15 వరకూ అదే రాశిలో సంచరించి..ఆ తర్వాత మీనరాశిలో అడుగుపెట్టనున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. మరి ఏ రాశివారిపై ప్రతికూల ప్రభావం ఉంది, ఏ రాశులవారిపై అనుకూల ప్రభావం ఉందో చూద్దాం..

మేష రాశి

ఈ రాశి నుంచి సూర్యుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అన్నీ శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అప్పులుతీరుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు

వృషభ రాశి

ఈ రాశి నుంచి సూర్యుడు 10వ స్థానంలో ఉన్నాడు. ఈ నెల రోజులు మీరు చేసే అన్ని పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు కార్యాలయంలో మంచి గౌరవాన్ని పొందుతారు.  మీకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోగలరు. ఒకటి కంటే ఎక్కువ మాధ్యమాల ద్వారా ఆదాయాన్ని అందుకునే అవకాశం ఉంది. వ్యాపారం బాగాసాగుతుంది.  

మిధున రాశి

ఈ రాశి నుంచి సూర్యుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఈ రాశివ్యాపారులు భారీ లాభాలు అందుకుంటారు.  పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయి.  కొత్త ప్రాజెక్టులు నిర్వహించే బాధ్యత కూడా రావొచ్చు.

Also Read: శివరాత్రి రోజు జాగరణ, ఉపవాసం ఎందుకు చేయాలో శివుడు స్వయంగా పార్వతికి చెప్పిన కథ ఇది

కర్కాటక రాశి

ఈ రాశి నుంచి సూర్యుడు అష్టమ స్థానంలో ప్రయాణిస్తున్నాడు..ఈ సమయంలో కర్కాటక రాశివారికి కొన్ని ఒడిదొడుకులు తప్పవు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. మీ పనిపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టడం మంచిది.

సింహ రాశి

ఈ రాశి నుంచి సూర్యుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు..ఈ సమయంలో ఏం చేసినా ఈ రాశివారికి ప్రతికూల సమస్యలు తప్పవు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందలేరు. కెరీర్ విషయంలోనూ గందరగోళంగా ఉంటారు. నిరుద్యోగులకు ఇంకొంతకాలం వేచి ఉండక తప్పదు. ఓపిక, సహనం చాలా చాలా అవసరం

కన్యా రాశి

కన్యా రాశినుంచి ఆరో స్థానంలో సూర్య సంచారం వల్ల ఈ సమయం మీకు బాగా కలిసొస్తుంది. శత్రువులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు అనుకూల సమయం. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. 

Also Read: మృత సంజీవని అని చెప్పే మృత్యుంజయ మంత్రం ఎప్పుడు జపించాలి!

తులా రాశి

ఈ రాశినుంచి ఐదో స్థానంలో సూర్య సంచారం వల్ల మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కెరీర్లో మంచి అవకాశాలు పొందుతారు. సానుకూల ఫలితాలు పొందుతారు. 

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి నుంచి నాలుగో స్థానంలో సూర్య సంచారం వల్ల వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పనిని  ఇంటి పనులను బ్యాలెన్స్  చేయడం కొంత కష్టంగా అనిపించవచ్చు. ఈ సమయంలో మీరు మానసికంగా బలహీనంగా ఉంటారు.

ధనస్సు రాశి

మూజో స్థానంలో సూర్య సంచారం వల్ల ఆర్థికంగా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభసమయం. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. కొత్తగా అమలు చేయాలి అనుకున్న ప్రణాళికలు ప్రశాంతంగా అమలు చేయవచ్చు. 

మకర రాశి

కుంభ రాశిలో సూర్య సంచారం ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే వాగ్వాదం ఉండొచ్చు. 

కుంభ రాశి

మీ రాశిలోనే సూర్యుడు సంచరిస్తున్నాడు..ఈ ఫలితంగా మీకు లాభాలు కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. 

మీన రాశి 

ఈ రాశి నుంచి సూర్యుడు 12వ స్థానంలో సంచరిస్తున్నందున ఈ సమయం మీకు కలిసొస్తుంది. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులకు దూరంగా ఉండం మంచిది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్ పై ప్రభావం చూపిస్తాయని గుర్తుంచుకోవాలి. 

Published at : 16 Feb 2023 06:30 AM (IST) Tags: Astrology Surya Gochar 2023 feb Sun's transit in Aquarius 2023 Surya Rashi Parivartan 2023

సంబంధిత కథనాలు

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Srirama Navami Special 2023: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది, రామాయణాన్ని నారాయణుడి కథగా కాదు నరుడి కథగా చదవాలంటారు ఎందుకు!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Saturn Transit 2023: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

Sobhakritu Nama Samvatsara(2023-2024): ఈ ఏడాది ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం ఉన్న రాశులివే!

మార్చి 23 రాశిఫలాలు, ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది

మార్చి 23 రాశిఫలాలు,  ఈ రాశివారు మాటలు తగ్గించి పనిపై దృష్టిపెట్టడం మంచిది

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

Sobhakritu Nama Samvatsara Predictions for 2023-24 : శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మేష రాశి నుంచి మీన రాశి వరకూ వార్షిక ఫలితాలు

టాప్ స్టోరీస్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ పూర్తి- సాయంత్రం నాలుగు తర్వాత లెక్కింపు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్- సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

Hyderabad Crime News: 16 కోట్ల మంది డేటా చోరీ- ఐడీలు, పాస్ వర్డ్స్‌ లీక్-  సంచలనం సృష్టిస్తున్న హైదరాబాద్ కేసు

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

TDP On Tammneni : డిగ్రీ చేయకుండానే లా కోర్సులో చేరిన ఏపీ స్పీకర్ తమ్మినేని - తెలంగాణ టీడీపీ నేతల ఆరోపణ !

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్

High Court Judges Transfer : హైకోర్టు జడ్జిల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం- ఏపీ, తెలంగాణ నుంచి ఇద్దరు జడ్జిలు ట్రాన్స్ ఫర్