అందరికి శక్తిని ఇచ్చే ముక్కంటి, సుగంధ భరితుడు అయిన శివుడిని పూజిస్తున్నాం. పండిన దోసకాయ తొడిమ నుంచి వేరుపడినట్టే మమ్మల్ని కూడా మృత్యువు నుంచి విడిపించు అని అర్థం.
మృత్యువును (చావును) జయించడమంటే శరీరం పతనం కాకుండా వేల సంవత్సరాలు జీవించడం కాదు. పునర్జన్మ లేకపోవడం. అంటే మళ్లీ మళ్లీ జనన మరణాలు లేకపోవడం, ఇంకా చెప్పాలంటే ఈ జన్మలోనే ముక్తి పొందడం.
ముక్తి అంటే మరణం తర్వాత ప్రాప్తించేది కాదు, బతికి ఉండగానే పొందాల్సిన స్థితి. ఈ ముక్తి స్థితిని పొందాలంటే జ్ఞాని కావాలి. ఆ జ్ఞానాన్ని ప్రసాదించేదే ఈ మంత్రం.
ఉర్వారుక అంటే దోసపండు. సాధారణంగా దోసపాదు నేలమీద ఉంటుంది. ఈ పాదుకు కాసిన దోసకాయ పండినప్పుడు తొడిమ నుంచి అలవోకగా తనంతట తనే విడిపోతుంది.
జ్ఞానం పొందిన వ్యక్తి కూడా ఈ దోసపండులా అలవోకగా ప్రాపంచికత నుంచి విడవడతాడు. అంటే తనను ఆవహించిన మాయనుంచి బయటపడతాడన్నమాట.
పండిన దోసపండు తొడిమ నుంచి విడిపోయి తొడిమతో సంబంధం లేకుండా తొడిమ చెంతన ఉన్నట్లే, జ్ఞాని కూడా ప్రాపంచిక బంధాలైన ఈ సంసారం అనే మాయనుంచి విడిపోయినా దేహ ప్రారబ్ధం తీరేంతవరకు జీవుడు అక్కడే ఉంటాడు.
మృత్యుంజయ మంత్రాన్ని రోజుకి 108 సార్లు ఉచ్ఛారణ చేయవచ్చు. 12 ని 9 తో గుణిస్తే 108 వస్తుంది. అంటే ఇక్కడ 12 రాశిచక్రాలను, 9 గ్రహాలకు సూచనగా 108 కి అంత ప్రాధాన్యత ఇచ్చారన్నమాట.
మానవులు అన్ని గ్రహాలు, రాశిచక్ర చిహ్నాలకు బదులుగా జీవితంలో వచ్చే హెచ్చు తగ్గులు సరిసమానంగా చేసి ప్రశాంతంగా ఉండటానికి ఈ మంత్రాన్ని జపించాలని చెబుతారు పండితులు.
మృత్యుంజయ మంత్రాన్ని ఫలానా సమయంలోనే జపించాలనే నియమం ఏమీ లేదు.. పగలు, రాత్రి ఎప్పుడైనా స్మరించుకోవచ్చు Images Credit: Pixabay