Ksheerabdi Dwadasi Horoscope 12 November 2024:ఈ రాశులవారు భావోద్వేగానికి లోనై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు!
Dussehra Horoscope : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
Horoscope Today November 12, 2024
మేష రాశి
ఈ రోజు వ్యాపారంలో అప్పు తీసుకోకండి. సోమరితనం వల్ల పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. మీకు ఆసక్తి లేని పని చేయవలసి ఉంటుంది. తొందరపాటు స్వభావానికి దూరంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. విద్యార్థులు లాభపడతారు.
వృషభ రాశి
కార్యాలయంలో ఒత్తిడి ఉండవచ్చు. మీరు మీ స్నేహితుల మధ్య చర్చనీయాంశంగా ఉంటారు. అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా సాగుతాయి. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల మధ్య మీరు చాలా బాగా పని చేస్తారు.
మిథున రాశి
ఈ రోజు కార్యాలయంలో పోటీ ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులతో వ్యాపార ఒప్పందాలను కలిగి ఉండవచ్చు. వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. కొత్త బాధ్యతలు చేపడతారు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీ ప్రవర్తన గురించి ఆత్మపరిశీలన చేసుకోండి. అన్ని పనులను అంకితభావంతో చేయండి.
Also Read: నవంబరు 12 or 13 క్షీరాబ్ధి ద్వాదశి ఎప్పుడు - కార్తీకమాసంలో ఈ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత!
కార్కాటక రాశి
ఈ రోజు తలనొప్పిగా అనిపిస్తుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. ఆదాయ వనరులు, లాభాలు పెరుగుతాయి. భావోద్వేగాల ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో పెద్ద ఒప్పందం జరిగే అవకాశం ఉంది
సింహ రాశి
మీరు ఈ రోజు శారీరక బాధను అనుభవించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. ఇతరులకు అనవసరమైన సలహాలు ఇవ్వొద్దు. మానసికంగా దృఢంగా ఉంటారు. మీరు కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు పొందుతారు. మీరు మీ స్వభావంలో మార్పును గమనిస్తారు.
కన్యా రాశి
ఈ రోజు మీకు ఒక కొత్త పని మొదలవుతుంది..దానిని బాధ్యతాయుతంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. విహారయాత్రకు వెళ్లాలని ఆలోచిస్తారు. మీరు ఇతరుల భావాలకు విలువనిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
తులా రాశి
మీ నెలవారీ బడ్జెట్‌ను జాగ్రత్తగా చూసుకోండి. మీరు కొన్ని పనులపై అనవసరమైన ఖర్చులు పెట్టవచ్చు. కుటుంబంలో సంబంధాలు బావుంటాయి. వివాదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది . ఈరోజు వ్యాపారానికి చాలా మంచి రోజు. పరిశుభ్రతపై శ్రద్ధ వహిస్తారు. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు.
Also Read: కార్తీక పౌర్ణమి ఈ ఏడాది (2024) ఎప్పుడొచ్చింది - ఈ రోజు విశిష్టత ఏంటి!
వృశ్చిక రాశి
ఈ రోజు ఏ పనిలోనూ తొందరపడకండి. ప్రయివేటు కంపెనీల్లో పనిచేసేవారు పని ఒత్తిడి నుంచి రిలీఫ్ కావాలి అనుకుంటారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు. పాత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
ధనస్సు రాశి
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించండి. ఒకరి సలహాను వెంటనే అనుసరించడం మానుకోండి. ఆస్తి తగాదాల కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. మీరు మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
మకర రాశి
ఈ రాశి ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ మనస్సులో ఎవరి విషయంలోనూ ఎలాంటి పక్షపాతాన్ని ఉంచుకోకండి. వ్యాపార పర్యటనల వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు కొన్ని సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ... కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి.
కుంభ రాశి
ఈ రోజు వ్యాపారంలో భాగస్వామ్యాలతో కొన్ని విషయాలపై చర్చ జరగవచ్చు. కుటుంబ సభ్యులు ఏదో విషయంలో ఆందోళనకు గురవుతారు. పనికిరాని చర్చల్లో మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీరు ఈరోజు చాలా బిజీగా ఉండవలసి ఉంటుంది. ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
మీన రాశి
ఈ రాశివారు ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో ఉండే సమస్యలు తొలగుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్ పొందుతారు. ముఖ్యమైన పనులన్నీ ఈరోజు పూర్తిచేసేందుకు ప్లాన్ చేసుకోండి. మీ బాధ్యతల నుంచి తప్పించుకోవాలి అనుకోవద్దు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.