Ashtalakshmi Raj Yoga: నవంబరు 11 నుంచి వృశ్చిక రాశిలోకి శుక్రుడు, ఈ 3 రాశులవారికి రాజయోగం
Ashtalakshmi Raj Yoga: ఈ రాశుల్లోని ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Ashtalakshmi Raj Yoga: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నెలకోసారి రాశులు మారుతాయి. రాశి మారిన ప్రతీసారీ ఆ ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూల ప్రభావం ఉంటే..మరికొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రస్తుతం తులారాశిలో ఉన్న శుక్రుడు నవంబరు 11న వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు...డిసెంబరు 5 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఈ ప్రభావం ఏ రాశిపై ఎలా ఉన్నా మూడు రాశులవారికి మాత్రం అరుదైన రాజయోగం ఏర్పుడుతోందంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే అన్నట్టుంటుంది. తలపెట్టిన పనులన్నీ సక్సెస్ ఫుల్ గా పూర్తవుతాయి. శుక్రుడు ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, కళ, శృంగారం విషయాలకు సంబంధించిన వాటికి కారకమైన గ్రహంగా పరిగణిస్తారు. ఇంతకీ శుక్ర సంచారంతో అత్యంత లాభపడే ఆ మూడురాశులేంటో చూద్దాం...
మకర రాశి
మీ రాశినుంచి శుక్రుడు పదకొండో ఇంట ఉన్నాడు. ఈ ఫలితంగా మీకు అష్టలక్ష్మీ యోగం ఏర్పడుతోంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇది ఆదాయానికి , అభివృద్ధికి మంచి సమయం. ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా అడుగేయవచ్చు. కొత్త ప్రణాళికలు వేసుకోవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి..ఉద్యోగులకు శుభసమయం. పాతపెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు.
Also Read: ఈ నెల ఈ రాశులవారికి ధనం, గౌరవం, ఆరోగ్యం, ఆనందం, అన్నింటా జయం
కుంభ రాశి
వృశ్చిక రాశిలోకి శుక్రుడి ప్రవేశం కుంభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. మీ రాశినుంచి పదవ ఇంట శుక్రుడు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో మీకు అంతా అనుకూలమే. వ్యాపారంలో బాగా కలిసొస్తుంది. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. నవంబరు11 నుంచి డిసెంబరు 5 వరకూ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొత్తగా ఏమైనా ప్రారంభించాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఈ సమయంలో పిల్లల నుంచి ఆనందకరమైన వార్తలు వింటారు.
మీన రాశి
ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలకు మీకు పరిష్కారం లభించబోతోంది. వృశ్చిక రాశిలో శుక్రుడు సంచారం.. మీ రాశి నుంచి తొమ్మిదో స్థానంలో ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం అదృష్టాన్నిస్తుంది. ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. ఆర్థికంగా కూడా మీకు ఇది శుభసమయం. వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు అన్నింటా అనుకూలమే...
Also Read: నవంబరు నెల ఈ రాశులవారికి అనవసర ఖర్చులు, వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు
నవగ్రహ స్తోత్రం
శ్లోకం
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||
సూర్యుడు
జపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్
తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||
చంద్రుడు
దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్
నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||
కుుజుడు
ధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్
కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||
బుధుడు
ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధం
సౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||
గురు
దేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభం
బుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||
శుక్రుడు
హిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుం
సర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||
శని
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||
రాహు
అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనం
సింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||
కేతు
ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||