News
News
X

Monthly Horoscope For November 2022: నవంబరు నెల ఈ రాశులవారికి అనవసర ఖర్చులు, వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు

Monthly Horoscope November 2022: నవంబరు నెల ఈ ఆరు రాశులవారికి అంత అనుకూలంగా లేదు... ఇందులో మీ రాశిఉందా చెక్ చేసుకోండి...

FOLLOW US: 
 
Monthly Horoscope For November 2022:  నవంబరు నెల ఈ ఆరు రాశులవారికి అంత అనుకూలంగా లేదు... 

మేష రాశి
ఈ రాశివారికి ఈ నెల ఆరంభంలో బాగానే ఉన్నప్పటికీ రానురాను అంత అనుకూలంగా లేదు. అష్టమంలో గ్రహసంచారం వల్ల అన్నింటా ప్రతికూలతలే ఎదురవుతాయి. నమ్మినవారి వల్ల మీరు మోసపోతారు...అప్రమత్తంగా వ్యవహరించండి. జీవిత భాగస్వామి, పిల్లలకు అనారోగ్య సూచనలున్నాయి.వ్యాపారులకు ఉత్సాహం ఉండదు. ఉద్యోగులు పై అధికారుల వలన భయపడతారు. అనారోగ్య సూచనలు, అనవసర వివాదాలున్నాయి జాగ్రత్త...

కర్కాటక రాశి
ఈ నెలలో మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు బావుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో కలహ వాతావరణం, భార్యభర్త మధ్య అన్యోన్యత లోపించడం, ప్రయాణాలకు ఆటంకాలు, బుద్ధి నిలకడగా ఉండకపోవడం,రావాల్సిన ధనం వసూలు కాకపోయినా ఇవ్వాల్సింది ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్ని ఎదురైనా మనోధైర్యంతో ముందడుగు వేస్తారు... 

Also Read:  కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్వాలా తోరణం కిందనుంచి ఎందుకు దాటితే ఏమవుతుంది!

News Reels

వృశ్చిక రాశి
ఈ నెలలో వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. కొన్నింటిలో జయం, మరికొన్నింట అపజయం ఉంటాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి, ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆదాయానికి లోటుండదు కానీ ఖర్చులు కూడా అలాగే పెరుగుతాయి. అనుకోని సంఘటనలు జరుగుతాయి. పెద్ద ఆపద సంభవించే ప్రమాదం ఉంది జాగ్రత్త. ప్రయాణం చేసేటప్పుడు సరుకులు పోతాయి. కుజుడి ప్రభావం వల్ల కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు ఎవ్వరిచేతిలో అయినా తొందరగా మోసపోతారు.

ధనస్సు రాశి
గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ధనం సరైన సమయానికి చేతికందుతుంది. పాతబాకీలు వసూలవుతాయి. శుభవార్త వింటారు. వ్యసనాల కారణంగా ధనం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఊహించని ఖర్చులుంటాయి. ప్రతివిషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబంలో వ్యక్తులతో మాటపట్టింపులుంటాయి. అనవసరంగా వివాదాన్ని పెంచుకోవద్దు.

Also Read: కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు, వాటివెనుకున్న ఆంతర్యం ఏంటంటే!

కుంభ రాశి
కుంభ రాశివారికి ఈ నెల గ్రహసంచారం మిశ్రమంగా ఉంది. ఈ రాశికి చెందిన అన్నిరంగాల వారికి బాగానే ఉంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి పర్వాలేదు. తలపెట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతారు.అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. అకారణ కలహలు..పైఅధికారులతో మాటలు పడడం ఉంటుంది. గత నెలతో పోల్చుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయి.

మీన రాశి
మీన రాశివారికి నవంబరు నెల ఆరంభం అస్సలు బాలేదు. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి. అద్దె ఇళ్లలో ఉన్నవారు గృహం మారాల్సి రావొచ్చు. అశుభవార్తలు వింటారు..అన్నదమ్ములతో వివాదాలుంటాయి. ఇతరుల వలన మాటలు పడడం, అపనిందలు తప్పవు. ఉద్యోగులకు ఆకస్మిక  బదిలీలు ఉంటాయి. ద్వితీయార్థంలో పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు..దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు...

నోట్:  ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

మిగిలిన 6 రాశుల ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

Published at : 01 Nov 2022 07:58 AM (IST) Tags: astrological prediction Monthly Horoscope For November 2022 Monthly Horoscope Predictions Are Here Your Sign's November 2022 Horoscope Aries Gemini Leo Libra and Other Zodiac Signs

సంబంధిత కథనాలు

Horoscope Today 3rd  December 2022:  ఈ రాశివారు ధీమా వీడకపోతే  వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Horoscope Today 3rd December 2022: ఈ రాశివారు ధీమా వీడకపోతే వీరిని నమ్ముకున్నవారు మునిగిపోతారు, డిసెంబరు 3 రాశిఫలాలు

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Love Horoscope Today 2nd December 2022: ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Love Horoscope Today 2nd December 2022:  ఈ రాశివారు జీవిత భాగస్వామిపై అపనమ్మకం వీడాలి

Horoscope Today 2nd December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Horoscope Today 2nd  December 2022: ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం, డిసెంబరు 2 రాశిఫలాలు

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

Spirituality: చేతులకు రంగురంగుల దారాలు ఎందుకు కడతారు, ఆంతర్యం ఏంటి!

టాప్ స్టోరీస్

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

LIC WhatsApp Services: ఇకపై వాట్సాప్‌ ద్వారా ఎల్‌ఐసీ సేవలు - ఇంట్లోంచే అందుకోండిలా!

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Neuberg Diagnostics IPO: భారీ ఐపీవో బాటలో న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్, డబ్బులు రెడీగా పెట్టుకోండి

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు

Kids: శీతాకాలంలో పిల్లలకు చెవి ఇన్ఫెక్షన్లు - నొప్పి అని చెబితే నిర్లక్ష్యం వద్దు