Monthly Horoscope For November 2022: ఈ నెల ఈ రాశులవారికి ధనం, గౌరవం, ఆరోగ్యం, ఆనందం, అన్నింటా జయం
Monthly Horoscope November 2022: నవంబరు నెల ఈ ఆరు రాశులవారికి అద్భుతంగా ఉంది. ఈ అదృష్టవంతుల్లో మీరున్నారా...ఇక్కడ చెక్ చేసుకోండి
![Monthly Horoscope For November 2022: ఈ నెల ఈ రాశులవారికి ధనం, గౌరవం, ఆరోగ్యం, ఆనందం, అన్నింటా జయం Monthly Horoscope For November 2022: Monthly Horoscope Predictions Are Here , Aries, Gemini,Leo, Libra and Other Zodiac Signs get benefits Monthly Horoscope For November 2022: ఈ నెల ఈ రాశులవారికి ధనం, గౌరవం, ఆరోగ్యం, ఆనందం, అన్నింటా జయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/31/891c1be01045d7ec768f86a4013d5c721667237273503217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Monthly Horoscope For November 2022: నవంబరు నెల ఈ ఆరు రాశులవారికి అనుకూల ఫలితాలున్నాయి..
వృషభ రాశి
వృషభ రాశివారికి నవంబరు నెల అదిరింది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తైపోతాయి. వృత్తి వ్యాపారాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.సంతాన వృద్ధి, తలచిన పనులు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులవుతారు. ఆరోగ్యం బావుంటుంది. బంధుమిత్రులతో విందులు, వినోదాలుంటాయి. సంఘంలో ఉన్నత వ్యక్తులను, రాజకీయనాయకులను కలుస్తారు.
మిథున రాశి
మిథున రాశివారికి ఈ నెల కొంతవరకూ శుభఫలితాలే ఉన్నాయి. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు-వినోదాల్లో సంతోషంగా ఉంటారు. సమయానికి ధనం చేతికందుతుంది. జీవిత భాగస్వామితో మాటలు పడడం తప్పదు. స్నేహితల వల్ల కష్టాలుంటాయి. తలపెట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోతాయి కానీ ధైర్యంగా ముందుకుసాగుతారు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: కార్తీక మాసంలో ఉపవాసం ఉంటున్నారా, సోమవార వ్రతం ఆరు రకాలు - ఇందులో మీరు పాటించే విధానం ఏంటి!
సింహ రాశి
ఈ నెలలో చేసే వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మనస్సంతా ఆనందంగా ఉంటుంది. తండ్రి నుంచి ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉంది. బంధువులు, స్నేహితులతో కలసి సంతోషంగా ఉంటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్నేహితులు లేదా సోదరుల వల్ల కొన్ని సమస్యలు తీరుతాయి. మధ్య వర్తిత్వ వ్యవహారాలు బాగా చేస్తారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త..సంతానం విషయంలో స్వల్ప అనారోగ్యం ఉండొచ్చు.
కన్యా రాశి
కన్యారాశివారికి నవంబరు నెలలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీ రంగంలో మీరు స్ట్రాంగ్ గా నిలబడతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రతి పనిలనూ మీదే పైచేయి అవుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తిని నిద్రపోక పోవడం వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది జాగ్రత్త.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!
తులా రాశి
ఈ నెలలో గ్రహసంచారం బావుంటుంది. అన్నిరంగాలవారికి చేయూత ఉంటుంది. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం బావుంటుంది. తలపెట్టిన కార్యాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగడం వల్ల నెరవేరుతాయి. రాని బాకీలు వసూలవుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. చెడు స్నేహాలు వీడడం మంచిది. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధు, మిత్రులతో విందులు, వినోదాలు.
మకర రాశి
ఈ నెల మకరరాశివారి ఉత్సాహం రెట్టింపవుతుంది. ఆరోగ్యం బావుంటుంది. వాహనసౌఖ్యం ఉంది.ఉద్యోగుల పరిస్థితి గతంలో కన్నా బావుంటుంది. రాజకీయ వ్యవహారాలు కలిసొస్తాయి. నూతన వస్తు, వస్త్రాభరణ ప్రాప్తి.తలచిన పనులు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభం ఉంటుంది. బంధువర్గంలో ఆధిక్యత తథ్యం
మిగిలిన 6 రాశుల ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)