Karthika Somavara Vratham 2022: కార్తీక మాసంలో ఉపవాసం ఉంటున్నారా, సోమవార వ్రతం ఆరు రకాలు - ఇందులో మీరు పాటించే విధానం ఏంటి!
Karthika Somavara Vratham 2022:శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో నెలరోజుల పాటూ సూర్యోదయానికి ముందే స్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తారు. కొందరు నెలరోజులూ కార్తీకవ్రతాన్ని ఈ విధంగా పాటిస్తారు.
![Karthika Somavara Vratham 2022: కార్తీక మాసంలో ఉపవాసం ఉంటున్నారా, సోమవార వ్రతం ఆరు రకాలు - ఇందులో మీరు పాటించే విధానం ఏంటి! Karthika Masam 2022: Karthika Somavara Vratham in telugu, Karthika Deepam, Karthika Snanam Karthika Somavara Vratham 2022: కార్తీక మాసంలో ఉపవాసం ఉంటున్నారా, సోమవార వ్రతం ఆరు రకాలు - ఇందులో మీరు పాటించే విధానం ఏంటి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/26/633d50828c5c358bbc6a3e35fd4627f31666748988066217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Karthika Somavara Vratham 2022: కార్తీక మహత్యం గురించి జనకమహారాజుకి వివరించిన వశిష్ట మహర్షి...ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారని, కార్తీకమాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా స్నాన, జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారని చెప్పారు. అయితే ఈ సోమవార వ్రతవిధి ఆరురకాలని ఉపదేశించారు.. అవేంటంటే
1. ఉపవాసము
2. ఏకభక్తము
3. నక్తము
4. అయాచితము
5. స్నానము
6. తిలదానము
Also Read: కార్తీకస్నానం చేసేటప్పుడు ఇవి ఫాలో అవండి, మొదటి రోజు ఏం చేయాలంటే!
1. ఉపవాసము
కార్తీకమాసంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న, పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు ఉపవాసం ఉంటే అత్యుత్తమ ఫలితాన్ని పొందుతారు. ఆరోగ్యం సహకరించినవారు, శక్తి ఉన్నవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడుకి యధాశక్తి పూజచేసి..నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి.
2. ఏకభక్తము
ఆరోగ్యం సహకరించకపోయినా కార్తీక సోమవారం వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్లు ఏక భుక్తము పాటించవచ్చు. ఉదయాన్నే స్నానం , పూజ పూర్తిచేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి వేళ భోజనానికి బదులు తీర్థం తీసుకోవచ్చు.
3. నక్తము
సాధారణంగా కార్తీకమాసంలో అందరూ ఫాలో అయ్యేది నక్తమే. అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం, పూజ పూర్తిచేస్తుకుని నక్షత్ర దర్శనం అనంతరం భోజనం కానీ, ఉపాహారం కానీ స్వీకరించాలి.
4. అయాచితము
తమకి తాముగా వండుకుని తినడం కాకుండా..ఎవరైనా భోజనానికి పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము అంటారు. కార్తీకమాసం నెలరోజులూ ఉచిత అన్నదానం చేసేవారి సంఖ్య పెరిగింది. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఇలాంటి భోజనం చేస్తే పెట్టిన వారికి కూడా ఉత్తమగతులు లభిస్తాయని పురాణోక్తి.
5. స్నానము
ఉపవాసం, ఏకభుక్తం, నక్తము, ఆయాచితము ఇవన్నీ పాటించలేనివారు కనీసం సమంత్రక స్నానం ఆచరించి, యధాశక్తి దేవుడికి నమస్కరించుకున్నా చాలు.
6. తిలదానము
కనీసం మంత్ర జపవిధులు కూడా మాకు తెలియదు కానీ భక్తి ఉంది ఏం చేయాలి అంటారా.. స్నానమాచరించి కార్తీక సోమవారం రోజు నువ్వులు దానం చేసినా సరిపోతుందంటారు పండితులు.
పైన పేర్కొన్న ఆరు పద్ధతుల్లో దేన్ని ఆచరించినా కార్తీక సోమవారం వ్రతం ఆచరించినట్టే అవుతుందని వశిష్ట మహర్షి జనకమహారాజుకి వివరించారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతిసోమవారం పగలంతా ఉపవసరించి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరం భోజనం చేసేవారు శివసాయుజ్యాన్ని పొందుతారు.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!
ఓం నమస్తే అస్తు భగవాన్ - శివ స్తోత్రం
నమస్తే అస్తు భగవాన్
విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురాంతకాయ
త్రికాలాగ్ని - కాలాయ
కాలాగ్ని - రుద్రాయ నీలకాంఠాయ మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమాన్ మహాదేవాయ నమ
ఏకాదశ రుద్ర మంత్రం
కపాలీ- ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్
పింగళ- ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమ:
భీమ- ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం
విరూపాక్ష- ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమ:
విలోహిత- ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం
శశస్త- ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమ:
అజపాద- ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం
అహిర్బుధన్య- ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం
శంభు- ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమ:
చంద- ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్
భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ:
'ఓం నమః శివాయః'
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)