Karthika Masam 2022: కార్తీకస్నానం చేసేటప్పుడు ఇవి ఫాలో అవండి, మొదటి రోజు ఏం చేయాలంటే!
Karthika Masam 2022: శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసం ప్రారంభమైంది. కార్తీక స్నానం ఆచరించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో చూద్దాం
Karthika Masam 2022
శ్లోకం
సర్వపాప హరంపుణ్యం వ్రతం కార్తీక సంభవం
నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే "
" కార్తీక దామోదరా! నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయు' అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకుని, కార్తీక స్నానం ఆరంభించాలి. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే సమస్త జలాల్లో శ్రీ మహా విష్ణువు వ్యాపించి ఉంటాడు.
పురుషులైతే మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేసి.. దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు వదలాలి. అనంతరం బొటనవ్రేలి కొనతో నీటిని కదిపి...మూడు దోసెళ్ళ నీళ్ళను గట్టుమీద పోసి తీరానికి చేరాలి
తీరానికి చేరుకోగానే నీళ్లుకారుతున్న దుస్తుల్ని అలాగే వదిలేయకుండా వెంటనే పిండాలి
స్త్రీలు అయితే స్నానమాచరించి ఒడ్డుకి చేరుకోగానే పసుపు రాసుకుని, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి
పొడిగా ఉండే శుభ్రని వస్త్రాలు ధరించి హరిహరులను స్మరించాలి
నది లేదా చెరువు ఒడ్డున బియ్యపు పిండితో ముగ్గువేసి, పసుపు కుంకుమ అద్ది..దానిపై దీపం వెలిగించి యధాశక్తి పూజించాలి
సాయంకాలం అవకాశం ఉంటే శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ యథాశక్తి దీపాలు వెలిగించి స్వామిని ఆరాధించాలి
కార్తీకమాసం వ్రతం ఆచరించడానికి వర్ణ భేదం, వయో భేదం, లింగ భేదం ఉండదు. ఎవ్వరైనా వారి శక్తిమేరకు హరిహరులను స్తుతించవచ్చు, వ్రత నియమాలు పాటించవచ్చు
కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు వైకుంఠ ప్రవేశం పొందుతారు
పూర్వ జన్మలో చేసిన, ప్రస్తుత జన్మలో చేస్తున్న పాపాలన్నీ కార్తీకమాసం వ్రతం వల్ల హరించుకుపోతాయని పండితులు చెబుతారు
Also Read: కార్తీకమాసంలో రెండో రోజు యమ ద్వితీయ, ఈ రోజు ఎంత ప్రత్యేకమో తెలుసా!
కార్తీక మాసం అంటే చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రంతో కలిసి ఉండేటటువంటి మాసమే కార్తీకమాసం. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం . కార్తీక మాసం మొదటి రోజు పూజించాల్సిన దైవము స్వాద అగ్ని. స్వాద అగ్ని అంటే అగ్నిదేవుని రూపం. మనం ఏదైనా హోమం కాని, ఏదైనా హోమం క్రియ చేసేటప్పుడు ఓం స్వాహా అనే మంత్రాన్ని చెప్పుకుంటూ స్వాద అగ్నిని ఉపయోగిస్తాం. కార్తీక మాసంలో (Karthika masam) అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుంది.అగ్ని సంబంధమైన దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లోకి శివానుగ్రహం, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కార్తీక మాసం మొదటి రోజు ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా మామిడి తోరణాలు, పుష్పాలతో అలంకరించాలి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టాలి.
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి, ఇదంతా దైవభక్తి మాత్రమే అనుకుంటే పొరపాటే!
కార్తీకమాసంలో పఠించాల్సిన లింగాష్టకం
బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాసిత శోభితలింగం
జన్మజదుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం.
దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం
రావణదర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం.
సర్వసుగంధ సులేపితలింగం, బుద్ధివివర్ధన కారణలింగం
సిద్ధసురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదాశివలింగం
కనకమహాకణి భూషితలింగం, ఫణిపతివేష్టిత శోభితలింగం
దక్షసుయఙ్ఞ వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం
కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సుశోభితలింగం
సంచితపాప వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం
దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవ చ లింగం
దినకరకోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదాశివలింగం
అష్టదళోపరివేష్టితలింగం, సర్వసముద్భవకారణలింగం
అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం
సురగురు సురవర పూజితలింగం, సురవనపుష్ప సదార్చితలింగం
పరమపరం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం
లింగాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ శివసన్నిధౌ, శివలోకమవాప్నోతి, శివేన సహ మోదతే.